అంతర్జాతీయం

ఫలించిన పసిడి గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలెంబాగ్, ఆగస్టు 22: ఆసియా గేమ్స్ స్వర్ణ పతకాల సాధనలో భారత్ మరో మెట్టెక్కింది. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో రహి సర్నోబాట్ స్వర్ణం సాధించడమే కాదు, షూటింగ్‌లో స్వర్ణం అందుకున్న తొలి భారత మహిళగానూ రికార్డుకెక్కింది. ఫైనల్స్‌లో ఫిలిప్పైన్స్ షూటర్ నఫాస్వన్ యాంగ్‌పైబూన్‌తో రసవత్తరంగా సాగిన పోరులో కొల్హాపూర్ డిప్యూటీ కలెక్టర్ రహిదే చివరకు పైచేయి అయ్యింది. ఫైనల్‌లో 34 పాయింట్ల వద్ద టై అయిన ఇద్దరూ, టెన్ సిరీస్‌లోని చెరి ఐదు షాట్స్ గురిలోనూ ఇద్దరూ ఈక్వల్ అయ్యారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య మొదలైన మరో సిరీస్ షాట్స్‌లో యాంగ్‌పైబూన్ రెండు సాధిస్తే, రహి మూడు షాట్స్ సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. తాజా ఆసియా గేమ్స్‌లో భారత షూటింగ్ బృందం నుంచి స్వర్ణం సాధించిన రెండో వ్యక్తిగా, ఆసియా గేమ్స్ చరిత్రలో స్వర్ణం కైవసం చేసుకున్న (సౌరభ్ చౌదరి, జస్పాల్ రాణా, రణధీర్ సింగ్, జితు రాయ్, రోంజాన్ సోథి) ఆరో భారత షూటర్‌గా సర్నోబాట్ గౌరవప్రద స్థానాన్ని సంపాదించుకుంది. భారత తొలి పిస్టల్ షూటర్‌గా 2013 వరల్డ్ కప్‌లో స్వర్ణం సాధించిన రహి, 2014 కామనె్వల్త్ గేమ్స్‌నుంచీ ప్రతిష్ఠాత్మక ఈవెంట్లలో టైటిల్ సాధించిన దాఖలాలు లేవు. 2010 ఢిల్లీ కామనె్వల్త్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు సాధించిన రహి, 2014 ఇంచియాన్ ఆసియా గేమ్స్ 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్యం సంపాదించింది.