క్రీడాభూమి

7=7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత సత్తాను రెపరెపలాడిస్తారనుకున్న అథ్లెట్లు క్రీడాభిమానులను నిరాశపరుస్తున్నారు. ఒలింపిక్ హెవీవెయిట్ చైనా సాధించిన పసిడి పతకాల్లో సగానికంటే తక్కువే భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య ఉండటం బాధాకరం. వచ్చే టోక్యో-2020 ఒలింపిక్‌కు ఆసియా గేమ్స్‌ను రిహార్సల్స్ చేసుకుంటామంటూ గొప్పలు చెప్పి వెళ్లిన అథ్లెట్లు, జకార్తా, పాలెంబాగ్ మైదానాల్లో ప్రత్యర్థుల ముందు బోర్లా పడుతున్నారు. ఉనికిని చాటుకోవడానికి అన్నట్టు అరకొర సాధిస్తోన్న పతకాలు తప్ప.. చైనా, జపాన్, దక్షిణ కొరియా.. కనీసం ఇరాన్, ఇండోనేసియాల కంటే పతకాల వేటలో భారత్ వెనుకబడి ఉందంటే ఒకింత బాధ కలిగించే అంశమే. కోటా తప్పకూడదన్నట్టు.. గేమ్స్ ఏడో రోజూ ఏడో స్వర్ణాన్ని భారత్ కైవసం చేసుకుంది. షాట్‌పుట్ మహాబలుడు తిజీందర్‌పాల్ సింగ్ తూర్ అద్భుత ప్రదర్శనతో భారత్‌కు స్వర్ణాన్ని అందించాడు. ఇనుప గుండును 20.75మీటర్ల దూరం విసిరి షాట్‌పుట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. దీంతో భారత్ పసిడి పతకాల సంఖ్య ఏడుకు చేరింది. ఐదు రజతాలు, 17 కాంస్యాలతో పతకాల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఇదిలావుంటే, వచ్చే టోక్యో ఒలింపిక్‌కు ఆసియా వేదికనుంచే చైనా సింహనాదం చేస్తోంది. ప్రతి ఈవెంట్‌లోనూ ఒక పతకాన్ని ఒడిసి పట్టుకుంటూ వేటలో అగ్రపథాన నిలిచింది. 72 స్వర్ణాలు, 51 రజతాలు చైనా ఖాతాకు జమయ్యాయి. వచ్చే ఒలింపిక్‌కు ఆతిథ్యమివ్వబోతున్న జపాన్ 34 స్వర్ణాలు, 31 రజతాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా 84 పతకాలు 25 స్వర్ణాలు సాధిస్తే, ఇరాన్ 34 పతకాల్లో 14 స్వర్ణాలు కైవసం చేసుకుంది. ఆతిథ్య దేశం ఇండోనేసియా సాధించిన 38 పతకాల్లో పది స్వర్ణాలుంటే, ఉత్తర కొరియా సైతం పది స్వర్ణాలు సాధించి గౌరవప్రద స్థానంలో నిలబడింది. థాయిలాండ్ (8 స్వర్ణాలు)లాంటి చిన్ని దేశంతో పోటీపడుతూ అఖండ భారత్ మాత్రం 29 పతకాల్లో 7 స్వర్ణాలకే పరిమితమైంది. గతంతో పోల్చిచూస్తే.. ఆసియా వేదికలపై భారత క్రీడా సత్తా పూర్తిగా మసకబారింది.

చిత్రాలు..స్క్వాష్‌లో దీపికా పల్లికల్ *క్వార్టర్స్‌కు చేరిన సైనా నెహ్వాల్
* బాడ్మింటన్ సింగిల్స్‌లో క్వార్టర్స్‌కు చేరిన సింధు
*ఫైనల్స్‌కు అర్హత సాధించిన హైజంపర్ బాలసుబ్రహ్మణ్య