సబ్ ఫీచర్

సమగ్రతకు బలిపీఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య జాతీయ మాధ్యమాలలో ‘మూకదాడి’ (లించింగ్)పై చర్చ జరుగుతోన్నది. చర్చలలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రాజకీయ విశే్లషకులు, మేధావులు పాల్గొంటున్నారు. కాని సమాజంలో జరుగుతున్న లించింగ్‌కు గల కారణాలను అనే్వషించి నిరోధించుటకు ప్రయత్నం చేయటాన్ని విస్మరించి కేవలం రాజకీయ కోణంలో మాట్లాడుతూ ఒకరిపై ఒకరు మాటల దాడులతోటే చర్చలను ముగిస్తున్నారు. అంతేకాదు జరుగుతున్న లించింగ్- మూక దాడిని మతాలవారిగా విభజన చేస్తున్నారు. కొన్ని దాడులు గోరక్షణ పేరుతో, మరికొన్ని దాడులు లవ్ జిహాదీ పేరుతో ఈ రెండురకాల దాడులు వ్యక్తిగత కక్షలు, రాజకీయాల లబ్ధికి మాత్రమే కొనసాగుతున్నవని జరుగుతున్న దాడులను గమనిస్తే అర్థవౌతుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు గుజరాత్‌లో ఆవుల కళేబరాలపై గల చర్మాలను వలుస్తున్నారని ఆ ఇద్దరు ఎస్‌సి కులస్తులని వారిని కొందరు బడితెలతో చితకబాదుతున్న దృశ్యాలు జాతీయ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమయ్యాయ. గోరక్షణ పేరుతో విశ్వహిందూపరిషత్, బజరంగదళ్ కార్యకర్తలు మూకదాడి చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీతోపాటు వివిధ రాజకీయ పార్టీలు గగ్గోలు పెట్టారు. అంతేకాదు దీనిపైన నరేంద్రమోదీ మాట కూడా మాట్లాడలేదని ప్రధానమంత్రిపై వివిధ రాజకీయ పార్టీలు గగ్గోలు పెట్టాయ. కేవలం లించింగ్ మాత్రమే కాదు. కేరళలో సంవత్సరాలనుండి ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలను, పశ్చిమ బెంగాల్‌లో బిజెపి కార్యకర్తలను చంపుతున్నారు. ఈ రాష్ట్రాలలో జరుగుతున్న హత్యల గురించి సెక్యులరిస్టులు గాని, మైనారిటీలు గాని, కమ్యూనిస్టులుగాని మాట్లాడరు. లించింగ్- మూకదాడుల ద్వారా చంపబడిన వారిలో కేవలం ముస్లింలే లేరు హిందువులు కూడా అదే స్థాయిలో వున్నారు. కాని ముస్లింలపై జరిగిన దాడులను మాత్రమే దాడులుగా భావించి చిలువలు పలువలుగా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీవారు, వారిని సమర్థించే పార్టీలు మాట్లాడుతుంటారు. ఏకపక్షంగా మాట్లాడే వారెవరైనా దేశహితైషులు కాజాలరు. ఎలాంటి దాడులు జరిగినా దాడులు చేసిన వారిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఎలాంటి దాడి జరిగినా బాధ్యత తీసుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వాలను పక్కనబెట్టి ప్రధానమంత్రిపై దాడి చేయడం దేశంలోని ఎన్‌డియేతర పార్టీలన్నీ ఎంచుకున్న దురుద్దేశ దుష్టరాజకీయ వ్యాఖ్యానాలు.
2018 జూలై 20వ తేదీన రాజస్థాన్‌లో జరిగిన మూకదాడిపై ఎస్పీ రామేశ్వర్ మేఘావాల్ చెప్పిన ప్రకారం ‘్భల్’ అనే వ్యక్తి వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొన్నాడన్న కారణంతో ‘అమీర్‌ఖాన్’ తన అనుచరులైన పతాయేఖాన్, అన్వర్‌ఖాన్‌లతో కలిసి ‘్భల్’ అనే వ్యక్తిని చంపారు. ఈ సంఘటనపై ప్రతిపక్షాలు గాని, ముస్లిం నేతలుగాని మాట్లాడకపోవడం విచారకరం.
‘గో’ పరిరక్షణకై విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ కార్యకర్తలు, ‘గో’వధశాలకు అక్రమ మార్గాలనుండి తరలిస్తున్న లారీలను అడ్డుకొని చట్టంమేరకు పోలీసులకు అప్పగించుట జరుగుతున్నది. కానీ వారిపై దాడికి దిగిన మూకలను కట్టడిచేస్తున్న విషయం వాస్తవమే. కాని ‘గో’రక్షణ పేరుతో లించింగ్ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని, విశ్వహిందూపరిషత్, బజరంగదళ్ కార్యకర్తలను అప్రతిష్టపాలు చేసేందుకు ఏర్పాటైన బృందాలను కొన్ని అదృశ్యశక్తులు నడుపుతున్నారన్న విషయాన్ని గుర్తించవలసియున్నది.
‘గో’రక్షణ పేరుతో మూకదాడులు చేయడం, చట్టాలను తమ చేతుల్లోకి తీసుకొనే వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రధానమంత్రి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరటం జరిగింది కూడా. ఈవిషయాన్ని ప్రజలందరు గుర్తించాలి.
పిల్లలను కిడ్నాప్ చేసిన వారిపై, అత్యాచారాలు చేసినవారిపై, దొంగతనాలు చేసిన వారిపై, చివరకు చేతబడి లాంటి మంత్రాలు చేశారనే పేరుతో దేశంలో అనేక సంవత్సరాలనుండి మూకదాడులు- లించింగ్ జరుగుచున్నవి. చట్టాలను తమ చేతుల్లోకి తీసుకొన్నవారు అనేకమంది జైలుశిక్ష అనుభవిస్తున్నవారు కూడా వున్నారు.
సనాతన ధర్మంలో హిందూ సంస్కృతిలో ‘గోవును’ దేవతగాను, మాతృమూర్తిగాను ఆరాధిస్తారు, పూజిస్తారు. హిందువుల పుణ్యక్షేత్రాలలో ప్రతిరోజు నిర్వహించే దేవతా కైంకర్యాలు ప్రారంభానికి ముందు గోశాలనుండి గోవును మేళతాళాలతో భక్తుల మధ్య దేవాలయం ప్రాంగణానికి ఊరేగింపుగా తీసుకొని వచ్చి, దేవాలయం ప్రధాన ద్వారంవద్ద గోమాతకు పూజాక్రతువులు జరిపి అట్టి గోవును ప్రధాన ఆలయంలోనికి ప్రవేశింపజేసిన తరువాత దేవాలయంలోని మూల విరాట్‌కు కైంకర్యాలు నిర్వహించి భక్తుల దర్శనానికి అవకాశం కల్పిస్తారు. హిందువులు నూతన గృహప్రవేశానికి ముందు గోమాతకు పూజలు నిర్వహించి గోమాతను గృహప్రవేశం గావించుటచే గృహప్రవేశం జరిగినట్లు భావిస్తారు. గోమాత హిందువులు పూజించే ముప్పైమూడు కోట్ల దేవతలకు నిలయం. కాబట్టి గోమాత రక్షణ విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు, బజరంగదళ్ కార్యకర్తల సొంతం కాదు. విశ్వవ్యాప్త హిందువుల కర్తవ్యం.
బ్రహ్మర్షి విశ్వామిత్రుడు పూర్వాశ్రమంలో రాజుగా ఉన్నప్పుడు ప్రపంచమంతా పర్యటించవలెననే తలంపుతో ఒక అక్షౌహిణి సైన్యంతో బయలుదేరాడు. దారికి సమీపంలో ఉన్న వశిష్టాశ్రమమును చూచి బ్రహ్మర్షి వశిష్టుని దర్శనార్థం ఆశ్రమానికి వచ్చిన విశ్వామిత్రుడికి అతిథి సత్కారము స్వీకరించవలసినదిగా కోరిన వశిష్ఠుడు తన ఆశ్రమంలోని కామధేనువు ‘శబల’ను పిలిచి ఆశ్రమానికి వచ్చిన అతిథులకు కావలసినవి చేకూర్చమని కోరాడు. అక్షౌణి సైన్యానికి స్నానాదులకు సరిపోయిన నీటి కొలనులను, వివిధ రకాలైన మధురమైన ఆహార పదార్థాలను, ఆసనాలను క్షణాలలో ఏర్పాటుచేయుట జరిగినది. దైవత్వాన్ని సంతరించుకొనియున్న ‘శబల’ (గోమాత)లాంటి మొదలైనవి గో రూపంలో ఉన్న సాధు జంతువులు మానవజాతి మనుగడకు ఉపకరణాలు.
బ్రిటిష్‌వారి పరిపాలనలో మన దేశంలో గోవధశాలలను ప్రారంభించారు. గోవధశాలలో పనిచేయుటకు హిందువులు అంగీకరించకపోవడం చేత హిందువులకు మతపరంగా వేరైన ముస్లిం మతస్తులకు గోవధశాలల బాధ్యతను అప్పగించి హిందువులకు ముస్లింలకు మధ్య బలమైన విద్వేషాన్ని పాదుగొల్పారు. బ్రిటన్‌వారి నుండి స్వతంత్రులమైన తరువాత మనము ఏర్పాటుచేసుకొన్న రాజ్యాంగంలో గోవధను పూర్తిగా నిషేధించకుండా వయసు ఉడిగినవి, వట్టిపోయినవని డాక్టర్ సలహా మేరకు వధశాలకు అనుమతించుట జరిగినది. కాని వ్యవహారంలో మాత్రం రాజ్యాంగంలోని నియమాలకు తిలోదకాలిచ్చుటవల్ల లించింగ్‌కు దారులు పడ్డాయి. గోవధ నిషేధం కేంద్ర పరిధిలోకాకుండా రాష్ట్రాల పరిధికి వదిలిపెట్టడంవల్ల సెక్యులరిజం ముసుగులో ఓటు బ్యాంకు రాజకీయాలకు తెగబడటంచేత ఏ రాష్ట్రంలో కూడా గోవధ నిషేధం చేయలేకపోతున్నారు. ఏదేని రాష్ట్ర ప్రభుత్వం గోవధ నిషేధం చేయాలనుకున్నా కుటిల రాజకీయ నాయకుల కుతంత్రాలవల్ల, హక్కులు, ఆచారాల పేరుతోను చివరకు బీదలకు ఆహారం విషయంలో కూడా మనువాదులు ఆంక్షలు విధిస్తున్నారంటూ విద్యార్థులను రెచ్చగొట్టడం జరుగుతోంది. సమరసతకు భంగం కలిగిస్తూ సమాజ విచ్ఛిన్నతికి పాల్పడుతున్న పెద్దమనుషులను కట్టడి చేయనంత కాలం ఎలాంటి చట్టాలు తెచ్చినా లించింగ్‌ను నిర్మూలించడం సాధ్యం కాజాలదు. గోవు మాంసాన్ని ఆహారంగా తీసుకొనే పద్ధతి వేదాలలో వున్నదని నాస్తికులమని చెప్పుకొనే కత్తి మహేష్, గోగినేని బాబు లాంటి ప్రబుద్ధులు కొంతమంది మేధావులుగా టివి చానల్స్ చర్చలలో పాల్గొన్నవారు విదేశీయుల పరిపాలనలో వక్రీకరించిన వేదాలని సంబోధిస్తూ ప్రామాణికంగా చూపుతుంటారు. స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యం ముసుగులో సెక్యులర్ భావాలతో అఘాయిత్యాలకు పాల్పడుతూ చట్టాలను ఉల్లంఘించే వారెంతటి వారైనా చట్టరీత్యా వారిపై కఠిన చర్యలు తీసుకోవలసిందే!
ఏ రాష్ట్రంలో నేరం జరిగితే ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలకు ఉపక్రమించాలి. బాధ్యతారహితంగా ఉండి నేరాలు చేసినవారిపై చట్టరీత్యా చర్యలుతీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిందించే ప్రతిపక్షాలు కావచ్చు, మేధావి వర్గం కావచ్చు, అది వారి దివాళాకోరుతనంగా మాత్రమే ప్రజలు గుర్తిస్తారు.
బ్రిటిష్ వారి కబంధ హస్తాలలో చిక్కుకున్న భారతమాత సంకెళ్ళు తొలగించడానికి గోమాత సహకారమే అనే విషయాన్ని ప్రతి భారతీయుడు గుర్తించి తీరాలి. ఆవు కొవ్వు పూసిన తూటాలను రక్షణ దళానికి అందించిన కారణంగా స్వాభిమానము, స్వావలంబన, ధర్మనిష్ఠగల సైనికుడు మంగళపాండే ఆనాటి బ్రిటన్ అధికారులపై కాల్పులు జరిపి స్వాతంత్య్ర ఉద్యమానికి నాంది పలికాడు. అదే 1857 సిపాయిల తిరుగుబాటుగా ప్రాచుర్యమైన తొలి స్వాతంత్య్ర సంగ్రామము. దాని కొనసాగింపే 1947లో వచ్చిన స్వాతంత్య్రం. స్వతంత్రానికి ఆధారభూతం ‘గో’మాత.

- బలుసా జగతయ్య 90004 43379