తూర్పుగోదావరి

ఎస్సై వంశీధర్ ఘటనతో షాక్‌లో పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, ఆగస్టు 25: రామచంద్రాపురం ఎస్సైగా పనిచేస్తున్న కోట వంశీధర్ ఆకస్మిక మృతితో పోలీసులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. అతని తల్లితో కలసి కారులో వెళ్తుండగా ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్న వాగును దాటుతుండగా నీటి ప్రవాహ వేగానికి కారుకొట్టుకు పోయినట్లు తెలిసింది. ఈప్రమాదంలో ఎస్సై వంశీధర్ తల్లిని రక్షించే క్రమంలో తన ప్రాణాలను కోల్పోయారని ఆయనతో కలిసి పనిచేసిన ఎస్సైలు, సిబ్బంది తెలియజేశారు. ఎస్సై వంశీధర్ మృతిపట్ల ఎస్పీ విశాల్ తీవ్ర విచారాన్ని వ్యక్తపరిచారు. సమర్ధవంతమైన అధికారిగా పేరు సంపాదించిన ఆయన ఆకాల మృతి చెందడం పోలీస్ శాఖకు తీరని నష్టమన్నారు. జిల్లా అదనపు ఎస్పీ శ్రీ్ధర్‌రావు, ఒఎస్‌డి కె చక్రవర్తి, పలువురు డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు ఎస్సై వంశీధర్ అకాల మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరిచారు. కాకినాడ స్మార్ట్‌సిటీ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో 2016వ సంవత్సరం నుండి 2018వ సంవత్సరం మార్చినెల వరకు వంశీధర్ ఎస్సైగా పనిచేశారు. ఎస్సైగా ఆయన పలు కేసులను సమర్ధవంతంగా ఛేదించి తనకంటూ ఓ ముద్రవేసి పోలీస్ శాఖలో మంచిపేరు సంపాదించినట్లు పలువురు పోలీస్ అధికారులు చెప్పారు. గత మార్చినెలలో ఎస్సై వంశీధర్ కాకినాడ టూటౌన్ పోలీస్ స్టేషన్ నుండి రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వెళ్లారు. టూటౌన్ సిఐ ఎండి ఉమర్, ఆయనతో కలసి పనిచేసిన ఎస్సైలు, సిబ్బంది ఎస్సై వంశీధర్ అకాలమృతిని జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ సంవత్సరం ఆయనకు వివాహం జరగాల్సి ఉందని, మంచి భవిష్యత్ ఉన్న ఎస్సై వంశీధర్ మృతి చెందడాన్ని తాము నమ్మలేక పోతున్నామని ఆవేదన వెలిబుచ్చారు. ఎస్సై వంశీధర్ మృతి చెందారని తెలిసిన వెంటనే రామచంద్రాపురం డిఎస్పీ సంతోష్‌కుమార్ ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి సంఘటనా ప్రాంతానికి వెల్లి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని పోలీస్ అధికారులు తెలియజేశారు.

ముఖ్యమంత్రి పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు
జగ్గంపేట, ఆగస్టు 25: ఈనెల 31న జరిగే ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు వేగవంతం చేశారు. శనివారం జగ్గంపేటలో డిగ్రీ కళాశాల వద్ద ముఖ్యమంత్రి సభావేదిక ప్రాంతాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శనివారం పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. సభాప్రాంతం వద్ద డిగ్రీ కళాశాలకు వెళ్లే మార్గం సిమ్మెంటు రోడ్డు వేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ పార్కింగ్, హెలిప్యాడ్ ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి మల్లిబాబు, పెద్దాపురం ఆర్డీవో వసంతరాయుడు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సిహెచ్ సత్యనారాయణరెడ్డి, డిఈ రమణమూర్తి, ఎడిఈ సిహెచ్ మీనాకేతనరావు, ఎఈ రమేష్‌బాబు, తహసీల్దారు ఎల్ శివమ్మ తదితరులు పాల్గొన్నారు.

కేరళ వరద బాధితులకు సురుచి చేయూత
మండపేట, ఆగస్టు 25: ఇటీవల కేరళ రాష్ట్రంలో సంభవించిన పెను విపత్తుల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు తాపేశ్వరం సురుచి సంస్థ తమ వంతు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు తెలిపారు. శనివారం సురుచి ఫుడ్ సంస్థలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మల్లిబాబు మాట్లాడుతూ తమ సంస్థకు తాపేశ్వరం, కాకినాడలో మొత్తం మూడు బ్రాంచిలు ఉన్నాయని, వాటి ద్వారా వచ్చే నెల 2వ తేదీన అమ్మిన అమ్మకాలను వరద బాధితుల సహాయ నిధికి అందిస్తామని వెల్లడించారు. వినియోగదారులు ఆ ఒక్క రోజూ తమ వ్యాపారానికి సహకరించి, వరద బాధితుల సహాయానికి సహకరించాలని మల్లిబాబు కోరారు. సమావేశంలో సురుచి పీఆర్వో ఉప్పలపాటి రామభద్రరాజు వర్మ, జిఎం శంకర్ పాల్గొన్నారు.