తూర్పుగోదావరి

శాంతించిన గోదారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 25: వరద గోదావరి శాంతించింది. అఖండ గోదావరి ఎగువ ప్రాంతంలో నీటి మట్టాలు క్రమేణా తగ్గుముఖం పట్టాయి. శనివారం రాత్రి ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి నీటి మట్టం ఎనిమిది అడుగులకు దిగింది. బ్యారేజి దిగువన వున్న లంక గ్రామాలు, ఎగువ ప్రాంతంలోని విలీన మండలాల్లోని కూనవరం, విఆర్ పురం, చింతూరు, ఎటపాకలలో నదీ పరీవాహ గ్రామాలు ఇంకా జల దిగ్బంధం నుంచి బయటపడలేదు. దేవీపట్నం మండలంలో పలు గ్రామాల్లో ఇపుడిపుడే నీరు వేగంగా దిగువకు పోతోంది. బ్యారేజి దిగువ ప్రాంతంలోని నదీ పాయల మధ్య లంక గ్రామాల్లో వెతలు ఇంకా తీరలేదు. ఇంకా మోకాలి లోతు నీరు గ్రామాల్లో ఉంది. కోనసీమలోనూ, ఏజెన్సీలోని లంక గ్రామాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వారం రోజులుగా నీటిలో నానుతోన్న ఇళ్ళల్లోకి తిరిగి వెళ్ళడానికి స్థానికులు భయపడుతున్నారు. ప్రస్తుతం ఇటు ఇళ్ళు నష్టం, పంట నష్టం, ప్రభుత్వ ఆస్తి నష్టాలు, పాడైపోయిన రోడ్లు, మంచినీటి పథకాలు తదితర అంశాలపై అధికార యంత్రాంగం పూర్తి స్థాయి సర్వే మొదలు పెట్టింది. వరద తగ్గుముఖం పట్టడంతో నష్టాలకు సంబంధించి సర్వే నివేదిక పూర్తి స్థాయిలో ఈ నెలాఖరుకు పూర్తి చేసి 31వ తేదీన జిల్లాకు రానున్న ముఖ్యమంత్రికి సమర్పించనున్నట్టు తెలుస్తోంది.
ధవళేశ్వరం బ్యారేజి వద్ద శనివారం రాత్రి 8 అడుగుల ప్రవాహ మట్టం నమోదైంది. బ్యారేజి నుంచి 6 లక్షల 3వేల 267 క్యూసెక్కుల వరద జలాలు సముద్రంలోకి విడుదలయ్యాయి. బ్యారేజి నుంచి పశ్చిమ డెల్టాకు సాగునీటి విడుదలను తాత్కాలికంగా నిలిపి వేశారు. తూర్పు డెల్టాకు 4500 క్యూసెక్కులు, మధ్యమ డెల్టాకు 1800 క్యూసెక్కుల జలాలను విడుదల చేశారు. గోదావరి ఉద్ధృతి ఎగువ ప్రాంతంలో కూడా తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద 31.01 అడుగులకు ప్రవాహ మట్టం తగ్గింది. కాళేశ్వరం వద్ద 6.66 మీటర్లు, పేరూరు 6.28, దుమ్ముగూడెం 8.88, కూనవరం 11.8, కుంట 6.84, కొయిదా 16.22, పోలవరం 10.65, రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద 15.15 మీటర్ల మట్టంలో ప్రవాహం కొనసాగుతోంది.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు
* ఐటీటీఏ పీవో నిషాంత్‌కుమార్ హెచ్చరిక
రాజవొమ్మంగి, ఆగస్టు 25: విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని ఐటిడిఎ పివో నిషాంత్‌కుమార్ హెచ్చరించారు. మండలంలో లాగరాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసారు. వైద్యాధికారి కె కోకిలా సుశాన్ ఎటువంటి ముందస్తు ఆనుమతి కోరకుండా సెలవుపై వెళ్లడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, షోకాజ్ నోటీసు జారీ చేయమని అధికారులను పీవో ఆదేశించారు. ఆసుపత్రిలో హాజరుపట్టీలు, ఓపి రిజిస్టర్లు, మూమెంట్ రిజిస్టర్లు పివొ తనిఖీ చేసారు. జ్వరపీడితుల రక్త నమూనాలను సేకరించి, వ్యాధి నిర్ధారణ అయిన తరువాత వ్యాధి నివారణ మందులు అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. గర్భిణీల వార్డును పరిశీలించి రక్త హీనతతో ఉన్న వారికి ఎటువంటి వైద్య సహాయం అందజేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. వార్డులో దుప్పట్లు అపరిశుభ్రంగా ఉండడాన్ని పీవో గుర్తించి అసంతృప్తి వ్యక్తం చేసారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని పివొ హెచ్చరించారు. పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయకపోతే జీతాలు నిలిపివేస్తామని పీవో నిషాంత్‌కుమార్ హెచ్చరించారు. మండలంలో జడ్డంగి గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసారు. 7,8 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఆంగ్లం, గణితంలో పలు ప్రశ్నలువేసి విద్యాప్రమాణాలపై అసంతృప్తి వ్యక్తం చేసారు. మరోమారు తాను తనఖీకి వచ్చే సమయానికి ప్రమాణాలు మెరుగుపడకపోతే జీతాలు నిలిపివేస్తామని పివొ హెచ్చరించారు. వారానికి రెండు మార్లు చికెన్ అందజేస్తున్నారా లేదా అని విద్యార్థులను ఆరా తీసారు.