వరంగల్

చేతులేత్తేసిన ‘నర్సింగ్ హోం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, ఆగస్టు 25: నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్‌లో ఓ నర్సింగ్‌హోంను నెలకొల్పి పలువురి వద్ద రూ.2కోట్ల పైచీలుకు అప్పు తీసుకుని ఉడాయించిన నర్సింగ్‌హోం యజమాని చివరికు తన వద్ద నయాపైసా లేదని చెతులెత్తేసాడు. దీంతో నర్సింగ్ హోం నిర్వాహాకుడికి అప్పు ఇచ్చిన బాధితులు లబోదిబోమంటున్నారు. నెక్కొండ రోడ్‌లో నర్సింగ్‌హోంతో పాటు మెడికల్ షాపును నడిపిస్తున్న వ్యక్తి నర్సంపేటతో పాటు సమీప గ్రామాలకు చెందిన పలువురి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులను అప్పుగా తీసుకుని ఉడాయించిన విషయం మొట్టమొదటి సారిగా గత కొద్ది రోజుల క్రితం ‘ఆంధ్రభూమి’ సమగ్ర కథనాలను ప్రచురించిన విషయం పాఠకులకు తెల్సిందే. దీంతో రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇదే సమయంలో పరారైన నర్సింగ్‌హోం యజమాని తమ్ముడిని పోలీసుస్టేషన్‌కు రప్పించగా పరారిలో ఉన్న వ్యక్తి పోలీసుస్టేషన్‌కు రాక తప్పలేదు. తాజాగా శనివారం మరో మారు బాధితులు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చివరకు పోలీసులు సైతం సదరు నర్సింగ్‌హోం యజమానిపై చీటింగ్ కేసు నమోదు చేసేందుకు సమాయాత్తమైనట్లు తెలిసింది.