అంతర్జాతీయం

ప్రఖ్యాత యూఎస్ సెనేటర్ జాన్ మైకెన్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: ప్రఖ్యాత సెనేటర్, వియత్నాం యుద్ధ హీరో, అమెరికా రాజకీయ చరిత్రలో ఉద్ధండునిగా ఎదిగిన జాన్ మైకెన్ మరణించారు. 81 ఏళ్ల వయసున్న ఆయన గత కొంతకాలంగా బ్రెయిన్ క్యాన్సర్‌తో సతమతమవుతున్నారు. అరిజొనా ప్రాంతానికి ఆరుసార్లు సెనేటర్‌గా వ్యవహరించిన ఆయన భారత్‌తో స్నేహ సంబంధాలను కొనసాగించేవారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు. ప్రాణాంతకమైన బ్రెయిన్ ట్యూమర్ గ్లియోబ్లాస్టోమా బారినపడిన ఆయన గత ఏడాది కాలంగా రేడియేషన్, కీమోథెరపీ తీసుంటున్నారు. నేవీ ఆఫీసర్‌గా పనిచేసిన కాలంలో దక్షిణ వియత్నాం సైనికులు ఆయనను చిత్రహింసలకు గురిచేయడంతోపాటు ఐదేళ్లకుపైగా జైలులో నిర్బంధించారు. అత్యంత సాహసికుడు, ధైర్యవంతుడైన భర్తతో 38 ఏళ్లపాటు సహజీవనం చేసినందుకు ఎంతో గర్వపడుతున్నానని జాన్ మైకెన్ భార్య సిండీ మైకేన్ ట్విటర్ వేదికగా తన భర్త గొప్పతనం గురించి పేర్కొంది. సెనెటర్ జాన్ మైకెన్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విటర్‌లో తన ప్రగాఢ సంతాపంతోపాటు కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. అమెరికా కాంగ్రెస్‌లో శక్తివంతమైన రిపబ్లికన్‌గా జాన్ తన వాదనలు వినిపించేవారు. ట్రంప్ వ్యవహార శైలి, అసంబద్ధ నిర్ణయాలను ఎప్పటికప్పుడు తప్పుపడుతూ జాన్ వేలెత్తి చూపేవారు. జాన్ అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఆహ్వానించడంలేదని, కానీ ఈ విషయమై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
భారత ప్రధాని మోదీ సంతాపం
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ సీనియర్ సెనేటర్ జాన్ మైకెన్ అకాల మృతి పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం తెలిపారు. జాన్ భారత్‌కు బలమైన స్నేహితుడు అని మోదీ వ్యాఖ్యానించారు. సెనేటర్‌గా జాన్ అందించిన స్నేహ సంబంధాలు, ధైర్యం, సాహసం, విదేశీ వ్యవహారాల పట్ల అతని వైఖరి ప్రశంసనీయమని ట్విటర్‌లో పేర్కొన్నారు.