అంతర్జాతీయం

మోదీ పాలనతో దేశం విచ్ఛిన్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 26: దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రత, ఆర్థిక సుస్థిరతకు చిహ్నంగా భావించే న్యాయ వ్యవస్థ, కేంద్ర ఎన్నికల సంఘం, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాలను ఛిన్నాభిన్నం చేసే విధంగా బీజేపీ నడుచుకుంటోందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఈ మూడు వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ దేశ సమగ్రతను దెబ్బతీస్తోందని ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ ఆలోచన ధోరణి దేశానికి ప్రమాదకరమని ఆయన అన్నారు. 2014కంటే ముందు అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలకు తెలియదని, గత నాలుగేళ్లలోనే అభివృద్ధి జరుగుతోందని ప్రజలను అవమానిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఇంటికి పంపించేంత వరకు విశ్రమించే ప్రసక్తిలేదని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన కాంగ్రెస్ అభిమానుల సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు తన ప్రకటనలు, వ్యాఖ్యల ద్వారా భారతీయుల మనోభావాలను దెబ్బతీయడమే పనిగా మోడీ మాట్లాడుతున్నారన్నారు. గత 70 ఏళ్లలో భారత్‌కు అభివృద్ధి అంటే ఏమిటో తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ప్రపంచానికి అనేక రంగాల్లో భారత్ మార్గదర్శకంగా నిలిచే విధంగా అభివృద్ధిని సాధించిందన్నారు. దేశాభివృద్ధిలో కాంగ్రెస్ క్రియాశీలపాత్ర పోషించిందన్నారు. తన కంటే ముందు దేశంలో అభివృద్ధిలేదని మాట్లాడడమంటే, కాంగ్రెస్‌ను విమర్శించినట్లు అనుకుంటే తప్పన్నారు. 130 కోట్ల మంది భారతీయులను అవమానపరిచినట్లేన్నారు. దేశంలో హక్కుల అణచివేత జరుగుతోందన్నారు. దళితులు, మైనార్టీలు, రైతులు, పేదలు నిలదీస్తే వారి హక్కులను కాలరాస్తున్నారన్నారు. ప్రశ్నించేవారిపై దౌర్జన్యం జరుగుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీల హక్కులను పరిరక్షించే చట్టాలను నిర్వీర్యం చేశారన్నారు. ఈ వర్గాలకు ఉపకారవేతనాలు, సంక్షేమ పథకాల ఫలాలు అందడం లేదన్నారు. కులం, మతం, ప్రాంతీయ తత్వం పెచ్చుమీరాయన్నారు. అనిల్ అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలకు లాభం కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుగోళ్ల ఒప్పందంలో బీజేపీ అవినీతికి పాల్పడిందన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని కోరితే ప్రధాని మోదీ మాట్లాడడం లేదన్నారు. గత 50 ఏళ్లుగా హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ ఎయిర్ క్రాఫ్ట్‌లను తయారు చేస్తోందన్నారు. కాని ఈ ఒప్పందాన్ని వేరే కాంట్రాక్టు సంస్థకు అప్పగించారన్నారు. దేశంలో ఐశ్వర్యవంతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు అమలవుతున్నాయన్నారు. రైతుల రుణమాఫీ అంటే మోదీకి ఇష్టం లేదన్నారు. కేంద్రప్రభుత్వ దివాళా కోరు ఆర్థిక విధానాల వల్ల బ్యాంకుల నిరర్థక ఆస్తుల విలువ రూ.12.5 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. దీని వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు. ఒక బీజేపీ ఎమ్మెల్యే ఒక యువతిపై అత్యాచారం చేసినా, బ్యాంకులను మోసం చేసి నీరవ్ మోడీ అనే వ్యాపారి దేశం వదిలివెళ్లినా మోదీకి చీమకుట్టినట్లుగా లేదన్నారు. దేశంలో మునుపెన్నడూలేని విధంగా న్యాయ వ్యవస్థలో నలుగురు సీనియర్ న్యాయమూర్తులు బయటకు వచ్చి న్యాయ వ్యవస్థ ప్రమాణాలపై మాట్లాడారన్నారు. పార్లమెంటులో తాను ఇటీవల ప్రసంగించిన సందర్భంగా ప్రస్తావించిన అంశాలపై ప్రధాని బదులివ్వలేకపోయరన్నారు. భారత రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, వారికి మంచి వైద్యం, విద్య, బ్యాంకుల నుంచి విరివిగా రుణాలు కావాలన్నారు. రైతులను మోదీ ప్రభుత్వం తప్పుడు హామీలతో దగా చేసిందన్నారు. భారతదేశాభివృద్ధిలో ప్రవాసభారతీయుల పాత్ర విశిష్టమైనదన్నారు. మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్‌పటేల్, అంబేద్కర్ తదితర మహనీయులందరూ ప్రవాహ భారతీయులుగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు.
చిత్రం..లండన్‌లో ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్‌తో చర్చిస్తున్న రాహుల్ గాంధీ