Others

ఏదో.. ఎటో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితాన్ని ప్రేమిస్తున్నాను కానీ
జీవనం ఆనందంగాలేదు
జీవితం మర్రిచెట్టు
జీవనం తుమ్మచెట్టు
అందం కనుమరుగవుతున్న వేళ..
అస్తమయ గీతాలు పాడక తప్పదేమో కానీ
ఇంకా అస్తమయానికి సమయం కాలేదు
తలమీద సూర్యుడు వ్రేలాడుతున్నాడు.
తనివితీరా కౌగిలించుకోవటానికి
మల్లెచెట్టు కనిపించదు..
మంచి మనసు వినిపించదు
ఓడిపోయిన రాత్రి
కన్నీరు కార్చికార్చి
దీపం ఆరిపోయింది.
మనసు అమావాస్యగా మారింది.
జీవితం అడుగులు పదిలంగానే

పడుతుంటాయి
ఏముంది?
పాకుడు రాళ్ల మీద పదిలమేముంది?
జారిపడటం ఖాయం!
సాగర గర్భం నిరంతరం
తనలో తాను ఘర్షించినట్టు
జీవనయాత్ర తీరం దాటటంలేదు
ఒక్క కెరటం చేతికందదు
ఒక్క ముత్యం కనులకందదు
ఏదో నడుస్తుంది జీవితం..
పోరాడుతూ - ఓడిపోతూ.

-సిహెచ్.మధు - 9949486122