క్రీడాభూమి

భలే భలే.. విసిరాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, ఆగస్టు 27: ఆసియా ఆరంభ వేడుకల్లో ఫ్లాగ్ బేరర్‌గా నిలిచిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో స్వర్ణాన్ని సాధించి సత్తా చాటుకున్నాడు. ఆసియా గేమ్స్ జావెలిన్ త్రోలో భారత్‌కు స్వర్ణాన్ని సాధించిన తొలి అథ్లెట్‌గానూ చరిత్ర సృష్టించాడు. తన పేరిటే వున్న జాతీయ రికార్డును బద్దలుకొట్టి జావెలిన్‌ను 88.06 మీటర్ల దూరం విసిరిన నీరజ్, వచ్చే ఒలింపిక్‌లో భారత్‌కు ఖాయంగా పతకం సాధించగలిగే సత్తా ప్రదర్శించాడు. ఇదిలావుంటే, 1982 ఆసియా గేమ్స్‌లో గుర్జీత్ సింగ్ సాధించిన రజత పతకంతో కలిపి జావెలిన్‌లో భారత్‌కు ఇది రెండో పతకమే. స్వర్ణ పతకం సాధించడం మాత్రం ఇదే తొలిసారి. ఈవెంట్‌లో 20 ఏళ్ల నీరజ్ మూడోసారి విసిరిన జావెలిన్ రికార్డులను బద్దలుకొట్టింది. మొదటిసారి 83.46 మీటర్ల దూరం విసిరిన నీరజ్, రెండో అటెమ్ట్‌లో విఫలమయ్యాడు. మూడోసారి 88.06 మీటర్ల దూరం విసిరి రికార్డులను బద్దలుకొట్టాడు. ఈవెంట్‌లో చైనా అథ్లెట్ లి క్విజెన్ (82.22 మీటర్లు) రజతాన్ని సాధిస్తే, పాకిస్తాన్ అథ్లెట్ ఆర్షద్ నదీమ్ (80.75) కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రతిష్మాత్మక డైమండ్ లీగ్ సిరీస్‌లో భాగంగా గత మేలో జరిగిన దోహా ఎడిషన్‌లో 87.43 మీటర్ల రికార్డు సాధించిన నీరజ్, ఆసియా వేదికపై మాత్రం పూర్తిగా తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. ఈ సీజన్‌లో ఏ ఆటగాడూ 85 మీటర్ల దూరం అధిగమించిన దాఖలాలు లేకపోవడంతో, నీరజ్‌కు తిరుగులేకుండా పోయింది. గత ఏడాది 91.36 మీటర్ల రికార్డు సాధించిన చైనీస్ తైపీ అథ్లెట్ చో సున్ చెంగ్‌నుంచి నీరజ్‌కు గట్టి పోటీ ఎదరుకావొచ్చన్న అంచనాలూ విఫలమయ్యాయి. చెంగ్ కేవలం 79.81 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంవద్ద ఆగిపోయాడు.

అథ్లెటిక్స్‌లో మూడు రజతాలు
ఆసియా అథ్లెటిక్ వేదికలపై భారత్ అథ్లెట్లు గౌరవప్రదమైన విజయాలు నమోదు చేస్తున్నారు. మహిళల లాంగ్‌జంప్ విభాగంలో అత్యద్భుత ప్రదర్శన చేసిన నీనా వరాకిల్, ద్వితీయస్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. నాల్గవ విడతలో 6.51మీటర్ల దూరాన్ని అధిగమించి నీనా రజతాన్ని ఖాయం చేసుకుంది. స్వర్ణ పతకం సాధనలో నీనా నాలుగు మిల్లీమీటర్ల వెనుక ఉండిపోవడం గమనార్హం. వియత్నాంకు చెందిన తి తు తో బు తొలి ప్రయత్నంలోనే (6.55 మీటర్లు) స్వర్ణ పతకాన్ని సాధిస్తే, చైనా అథ్లెట్ జియోలింగ్ జు (6.50 మీటర్లు) కాంస్య పతకాన్ని సాధించింది. ఇదిలావుంటే, 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్‌లో 32ఏళ్ల భారత సుదూర పరుగుల రాణి సుధా సింగ్ రజత పతకాన్ని సాధించింది. ఆసియా గేమ్స్ పతకాల్లో ఇది ఆమెకు రెండోది. మహిళల సీపుల్‌చేజ్ విభాగంలో మూడు వేల మీటర్ల దూరాన్ని 9.40.03 నిమిషాల్లో అధిగమించి సుధాసింగ్ రజతాన్ని కైవసం చేసుకుంటే, బహ్రెయిన్‌కు చెందిన విన్‌ఫ్రెడ్ యవి (9.36.52) స్వర్ణాన్ని, వియత్నాంకు చెందిన ఓనహ్ గుయెన్ (9.43.83) కాంస్యాన్ని దక్కించుకున్నారు. ఇక 400 మీరట్ల హర్డిల్స్‌లో జాతీయ వ్యక్తిగత రికార్డును బద్దలుకొట్టి భారత అథ్లెట్ దురణ్ అయ్యసామి రజతాన్ని సాధించాడు. 48.96 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుని ద్వితీయస్థానంలో నిలిచాడు. ఖతార్‌కు చెందిన అబ్దెర్‌రెహ్మాన్ సాంబ ఆసియా గేమ్స్ రికార్డులను బద్దలుకొడుతూ 47.66 సెకండ్లలో రేస్ పూర్తి చేసి స్వర్ణాన్ని సాధించాడు. 2010 ఆసియా గేమ్స్‌లో జోసెఫ్ అబ్రహామ్ స్వర్ణాన్ని సాధించిన తరువాత సీపుల్‌చేజ్ ఈవెంట్‌లో భారత్‌కు మరో పతకాన్ని సాధించింది దురణ్ అయ్యసామే.