క్రీడాభూమి

భళి భళి.. భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, ఆగస్టు 27: ఆసియా వేదికపై భారత ఆటగాళ్లు చరిత్రను తిరగరాస్తున్నారు. అంచనాలకు మించిన సత్తా ప్రదర్శిస్తూ ఉపఖండం వేదికపై మువ్వనె్నల జెండాను రెపరెపలాడిస్తున్నారు. పతకాల రాసిలో విఫలమైనా, వాసిలో అద్భుత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ ‘ఖేల్ ఇండియా’కు కొత్త నిర్వచనం లిఖిస్తున్నారు. ఆసియా క్రీడా సంరంభంలో ఫ్లాగ్ బేరర్‌గా అగ్రపథాన నిలిచిన జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా స్వర్ణాన్ని సాధిస్తే, దశాబ్దాల కలగా మిగిలిన బాడ్మింటన్ మహిళల విభాగంలో స్టార్ షట్టర్ పీవీ సింధు ఫైనల్‌కు చేరి చరిత్రను తిరిగరాసింది. ఫీల్డ్ అండ్ ట్రాక్ విభాగంలో భారత అథ్లెట్లు నీనా వరాకిల్, సుధా సింగ్, దురణ్ అయ్యసామిలు సైతం సోమావారం రజత పతకాలు సాధించి, భారత్ పతకాల సంఖ్యను పెంచారు. జావెలిన్ త్రోలో భారత్‌కు స్వర్ణం ఖాయమన్న అంచనాలను వాస్తవం చేస్తూ, తొలి స్వర్ణంతో నీరజ్ చరిత్రను తిరగరాశాడు. ఆసియా క్రీడా చరిత్రలోనే జావెలిన్ త్రోలో భారత్ స్వర్ణం అందుకోవడం ఇదే ప్రథమం. వచ్చే ఒలింపిక్‌లో ఖాయంగా పతకం సాధించగల రికార్డులతో సాగుతోన్న నీరజ్, సోమవారం ఇండోనేసియా వేదికలపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. తనపేరిటేవున్న జాతీయ రికార్డును బద్దలుకొట్టి 88.06 మీటర్ల దూరం జావెలిన్ విసిరిన నీరజ్, ఈ క్రీడలో భారత్‌కు కొత్త స్థానాన్ని పదిలపర్చాడు. ప్రతిష్మాత్మక గోల్డెన్ లీగ్ టాప్ 6లో స్థానం దక్కించుకున్న సామర్థ్యంతో నీరజ్ చూపిన ప్రదర్శన ఉపఖండం క్రీడాలోకానే్న అబ్బురపర్చింది. 1982 ఆసియా గేమ్స్‌లో గుర్జీత్ సింగ్ సాధించిన రజత పతకం తరువాత, ఈ క్రీడలో భారత్‌కు మళ్లీ పతకమే లేదు. ఈసారి ఖాయంగా పతకం సాధిస్తాడన్న అంచనాలతో బరిలోకి దిగిన నీరజ్, అంచనాలకు తగ్గట్టే స్వర్ణాన్ని సాధించి భారత సత్తా చాటాడు. ఆసియా బాడ్మింటన్‌లో ఏనాటికైనా ఫైనల్స్ చేరగలమా? అన్న అనుమానాలకు ఫుల్‌స్టాప్ పెడుతూ, స్టార్ షట్లర్ పీవీ సింధు అనూహ్యంగా పసిడి పతకానికి మ్యాచ్ దూరంలో నిలిచింది. జపాన్ సీడ్ యమగుచిని కంగుతినిపించి ఫైనల్స్‌కు చేరిన సింధు కసి చూస్తుంటే, నేటి మ్యాచ్‌లో ఖాయంగా చైనీస్ తైపీ ప్రత్యర్థి, వరల్డ్ నెంబర్ 1 తై జు యింగ్‌ని మట్టికరిపించగలదన్న నమ్మకాలు బలపడుతున్నాయి. ఆసియా బాడ్మింటన్ చరిత్రలో భారత్ సత్తాను 3స్వర్ణా2క్షరాలతో లిఖించేందుకు సింధు ఉవ్విళ్లూరుతోంది. ఇక మహిళల లాంగ్‌జంప్‌లో నాలుగు మిల్లీమీటర్లు వెనుకబడి స్వర్ణాన్ని చేజార్చుకున్న నీనా వరాకిల్ (6.51మీటర్లు) అద్వితీయ ప్రదర్శనతో ద్వితీయ స్థానానికి చేరి రజతాన్ని సొంతం చేసుకుంది. 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో 32ఏళ్ల వెటరన్ పరుగుల రాణి సుధాసింగ్ (9.40.03 సెకండ్లు) రజత పతకాన్ని సాధిస్తే, 400 మీరట్ల హర్డిల్స్‌లో జాతీయ వ్యక్తిగత రికార్డును బద్దలుకొట్టి అథ్లెట్ దురణ్ అయ్యసామి (48.96 సెకండ్లు) రజతాన్ని కైవసం చేసుకున్నాడు.