అంతర్జాతీయం

వచ్చేనెలలో భారత్-పాక్ విదేశీ మంత్రుల భేటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 27: భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వచ్చేనెలలో పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షాహ్ మెహమూద్ ఖురేషీతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశం సందర్భంగా సెప్టెంబర్‌లో నిర్వహించే ఒక కార్యక్రమంలో ఉభయ దేశాల విదేశీ మంత్రులు ఈమేరకు సమావేశం కానున్నట్టు మీడియా వర్గాలు తెలిపాయి. ఈనెల 18న పాకిస్తాన్ ప్రధామంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరుగుతున్న తొలిసారిగా జరుగనున్న ఇరు దేశాల మంత్రుల ద్వైపాక్షిక సమావేశం ప్రాధాన్యతను సంతరించుకోనుంది. అయితే, ఈ భేటీ గురించి ఇంకా తుది నిర్ణయం ఏమీ తీసుకోలేదని యూఎస్‌లోని సీనియర్ పాకిస్తాన్ దౌత్తవేత్త ఒకరు పేర్కొన్నట్టు ‘డాన్’ పత్రిక ఉటంకించింది. పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ సైతం సుష్మా స్వరాజ్, ఖురేషీ మధ్య యూఎన్ జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశం సందర్భంగా భేటీ అయ్యే విషయాన్ని ధృవీకరించలేదు.