డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వ్రేళ్ళమధ్య మృదువుగా వుండే పూసలుపెట్టి వాటిని నియమిత కాలప్రమాణంలో కదలిస్తూ వుంటే అది మనసును అదే ప్రమాణంలోవున్న తాళంగా తయారుచేస్తుంటాయి. దీనిని మంత్రంయొక్క రిథమ్‌లో సింక్రనైజ్‌చేస్తే ఇటు వ్రేళ్ళు-అటు మంత్రం కూడా సూత్రప్రాయంగా ట్యూన్ అవుతాయి. దీనివలన మంత్ర జపం సులభవౌతుంది. ఎలాగూ చేతికి పూసల్ని వినియోగిస్తున్నాం గనుక ఒక్కొక్క పూసలోవుండే ద్రవ్యగుణ విశేషాన్నికూడా ఉపయోగంలోకి తీసుకునేందుకుగాను వివిధరకాల జపమాలలు వినియోగంలోకి వచ్చాయి.
జపమాల:
మాలలు నాలుగు రకాలు:
1. తిథిమాల - 15 పూసలు
2. నక్షత్ర మాల- 27 పూసలు
3. జపమాల- 108 పూసలు
4. ధరించే మాల- 54 పూసలు.
ధరించే మాల గురించి వివరించే ముందు జపమాలలోని పూసల సంఖ్య వెనుకనున్న విశిష్టతని వివరించుకొందాం. మనకి 12 రాశులున్నాయి. ఈ రాశి చక్రంలో వున్న మొత్తం డిగ్రీలు 360. వీటిని 27 భాగాలుగా విభజిస్తే, నక్షత్రాలనేవి ఏర్పడతాయి. ఒక్కొక్క నక్షత్రానికీ నాలుగు పాదాలు. అంటే మొత్తం 27తి 4= 108 పాదాలు వుంటాయి.
దీనికి సింబాలిక్‌గా జపమాలలో 108 పూసలు అనేది సామాన్య సంఖ్య 108 పూసలున్న మాలని మెడలో వేసుకుంటే బొడ్డు దిగువకి వస్తుంది. కనుక రెండు మడతలుగా మెడలో వేసుకుంటారు. అలాగే జపం చేసుకునేటప్పుడు ఈ మాల పొడవుగావుండి జపానికి అసౌకర్యంగా వుంటుంది. కనుక కొందరు 54 పూసల మాలని ధరిస్తారు. లేక జపమాలగా వాడతారు. లేదా ఇందులో సగం-27 పూసలు కూడా వాడేవారు లేకపోలేదు.
మరొక సిద్ధాంతం: మనం ఉచ్చరించే మంత్రాలన్నీ భాషామయాలు. భాష అంటే అక్షరాలు ఈ అక్షరాల ఉచ్చారణ-దంతాలను గాలి, నాలుక తాకే తాకిడినిబట్టి వుంటుంది. ఈ దంతాలు 32.
అందుచేతనే దంతాలను విద్యాస్థానాలుగా పరిగణించారు; చిట్టచివరగా వచ్చే దంతాలను జ్ఞానదంతాలుగా పేర్కొన్నారు. అంటే మేధావికాసం స్థారుూభావానికి చేరుతుందని భావన. ఈ దంతాల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని జపమాలలోని పూసల సంఖ్యని 32-64-128గా నిర్ణయించారు. వీటిలో 32 సంఖ్య ఎక్కువ ప్రసిద్ధి.
ఈ రీత్యా మెడలో వేసుకునే మాలలో 32 పూసలు వుండాలన్నది ఒక సంప్రదాయంగా వచ్చింది.
గమనిక: సంఖ్య ఏదైనా జపమాల అనేది ప్రాథమిక స్థాయిలోనున్న సాధకుడికి ఉపయోగపడటానికి ఏర్పడినదే. కనుక ఏ సంప్రదాయాన్ని ఆచరించినా మంచిదే! జపమాలలో ఉపయోగించే పూసలకి ఓషధీ గుణాలున్నాయి. ఆ తత్వాన్నికూడా దృష్టిలోపెట్టుకుని వివిధ రకాల జపాలకు వివిధ పూసలు ఉపయోగిస్తారు. సాధారణంగా అయిదు రకాల మాలలు ధరిస్తారు. అవి-
1. రుద్రాక్షమాల, 2. స్ఫుటికమాల 3. తులసిమాల 4. పగడాల మాల 5. పద్మపూసల మాల.
రుద్రాక్షలు: ఇవి అగ్ని తేజస్సుని ఉద్దీపన చేస్తాయి. శివునికి, ఆయన పరివారానికి రుద్రాక్షమాలతో జపం చేయవచ్చు.
వైద్యపరంగా- బి.పి.తగ్గించే ఓషధి గుణముంది. రక్తంలోని లోహకణాలను (ఎర్ర కణాలను) చైతన్యవంతం చేసే గుణం వుంది.
పగడాల మాల: ‘అమ్మ’వార్లకు ఈ మాలతోనే జపం చేయవచ్చు. మహిళలు పగడాలతోనే జపంచేయాలన్న ఆచారం కూడా ఉంది. కుజదోష నివారణకు ఉపకరిస్తుంది. ఈ పగడాల మాల మనసుని ప్రేమమయం చేస్తుంది; సౌందర్య దృష్టిని కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా వాత పిత్త కఫదోషాల్ని నివారిస్తుంది.
పద్మపూసల మాల: ఐశ్వర్య ప్రదాత. ప్రధానంగా లక్ష్మీపూజకి, ఇతర దేవీ జపాలకి కూడా ఉపయోగించవచ్చు. శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించే ఓషధి గుణముంది; వరుణతత్వాన్ని ఉద్దీపన చేస్తుంది.
తులసిమాల: మనసుకి ప్రశాంతత చేకూరుస్తుంది. వరుణతత్వాన్ని ఉద్దీపన చేస్తుంది. శరీరానికి హాని కలిగించే సూక్ష్మక్రిముల్ని నాశనం చేస్తుంది. విష్ణుగణాలకి తులసి మాలతో జపం చేయవచ్చు.
స్ఫటికమాల: స్ఫటికం అంటే క్వార్ట్‌జ్! ఇది శారీరక ఆరోగ్యాన్ని అన్ని విధాలా మెరుగుపరుస్తుంది. ఇది అన్నిరకాల కోరికలూ తీరుస్తుంది. మనసుని వైరాగ్యంవైపు మళ్లిస్తుంది. జ్ఞాన దృష్టి కలిగిస్తుంది. పీఠాధిపతులు, యతీశ్వరులు ఈ కారణంగానే స్ఫటికమాల ధరిస్తారు.
ఇవిగాక కొందరు బంగారంతో పూసలు చేయించి లక్ష్మీదేవి జపం చేయడం కూడా జరుగుతుంది. బంగారానికి కూడా ఓషధి గుణం వుంది. చర్మానికి కాంతినిస్తుంది. సువర్ణ్భస్మం జీర్ణాశయాన్ని శుద్ధిచేస్తుంది.
తపం: జపం పెర్‌ఫెక్షన్ దగ్గరకి వెళ్తున్నకొద్దీ తపస్సు అవుతుంది. జపంలో రిథమ్ వుంటుంది. రిథమ్ అంటే పీసెస్ ఆఫ్ సౌండ్. రెండు సౌండ్ పీసెస్ మధ్య నిశ్శబ్దం వుంది. ఈ నిశ్శబ్దం మీద దృష్టి కేంద్రీకృతమైతే అది ‘తపస్సు’అవుతుంది. ఎప్పుడైతే మనసు తపస్సులోకి ప్రవేశిస్తుందో- ప్రకృతిలో వుండే అనేక తత్వాలు వాటంతటఅవే ఆవిష్కరించుకుంటాయి. అప్పుడు తపస్సు అనేది ఆలోచనగా మారుతుంది. తపస్సు పరిణతి చెందుతున్నకొద్దీ తరిగి నిశ్శబ్దం పెరుగుతుంది. ఆ నిశ్శబ్దంలోనుంచి హృదయాంతరాలలోనున్న సహజమైన నాదం ఆవిష్కరింపబడుతుంది. ఈ నాదం లయకి అతీతమైంది. దీనిలో తాదాత్మ్యం సిద్ధిస్తే వరమతత్వం ఆవిష్కారవౌతుంది. ఇది తపస్సుకి పరాకాష్ఠ. ఇంకావుంది...

‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం,
పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్,
దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.

ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట,
విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి