Others

కన్నీటి సంతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడి పూలు దుఃఖాన్ని వినీవినీ
దుఃఖానే్న పరిమళిస్తున్నాయి
నైట్‌క్వీన్ చెట్లు
రక్త, మూత్ర పరీక్షల వాసనలను
వెదజల్లుతున్నాయి
అక్కడి కిటికీల్లోంచి చంద్రుడు
వెనె్నలను భళ్లున వాంతి చేసుకుంటున్నాడు
రోగి ‘ఇన్’ ‘అవుట్’ గేట్ల మధ్య తిరిగీ తిరిగీ
ఎగ్జిట్‌కై వెంపర్లాడుతున్నాడు
అతని సంబంధీకుల చేతుల నిండా
మందు బిళ్లలో, ఆసుపత్రి బిల్లులో
క్యాష్‌లెస్‌లో సైతం బిల్డింగ్ సెక్షన్
భెల్ మోగిస్తూనే ఉంది
సందర్శకులు వచ్చినవారు వచ్చినట్టే
గాజు కళ్లైపోతున్నారు.
నిద్ర పట్టని సలపరింతల రాత్రుల్లో
ఉపశమనానికై తపించీ తపించీ
రోగి సతమతమవుతున్నాడు
శరీరం నిండా సూదులు గుచ్చీ గుచ్చీ
ప్రాణం నిలవడమో నిలవలేక పోవడమో
ఆశ నిరాశల భారమితి
ఆసుపత్రి వాతావరణాన్ని కొలుస్తుంది
బంధాలు మల్లెతీగల్లా పెనవేసుకుంటుంటే
డిశ్చార్జ్‌కై దారులు వెదికీ వెదికీ
వెక్కిరిస్తున్న ఆసుపత్రి తలుపుల ముందు
కన్నీటి సంతకమై పోతున్నారు.

-ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్.. 9849082693