ఐడియా

సర్వగుణప్రదాయని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతచిగురు రుచికే కాదు ఆరోగ్యానికీ ఎంతో మేలుచేస్తుంది. పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆకుకూరల్లో చింతచిగురు ఒకటి. చింతచిగురు గురించి తెలియనివారు లేరు. చింతచిగురులో యాంటీసెప్టెక్ గుణాలు అధికంగా ఉంటాయి. మన శరీరంలోని వ్యర్థాలను బయటకు తొలగిస్తుంది. అన్ని వయసులవారూ దీన్ని తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వచ్చు. లేత చింతచిగురును ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు. కొన్ని రకాల పచ్చడి చేస్తారు.
ఫిలిప్పీన్‌లో చింతాకుతో చేసిన టీ మలేరియా జ్వరానికి వైద్యంగా వాడతారు. చింతచిగురు ఆహారం తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కూర వండుకుని తిన్నా, పచ్చిగా తిన్నా ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో చింతచిగురు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఈ చిగురుతో ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతునొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ గుణాలు చింతచిగురులో ఉండటమే ఇందుకు కారణం. కడుపులో నులిపురుగులు ఉంటే ఎంతగానో బాధిస్తాయి. అలాంటివారికి తరచూ చింతచిగురుతో చేసిన కూరలూ, పచ్చళ్ళూ తినిపిస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. అలానే కళ్లు దురదలుగా అనిపించినా ఈ చిగురు తింటే సమస్య తగ్గుముఖం పడుతుంది. చింతచిగురు తరచూ తీసుకోవడంవల్ల రక్తం శుద్ధి అవుతుంది. వీటిలోని ఆమ్లాలు రక్తంలోని మలినాలను తక్షణమే తొలగిస్తాయి. చింతపండులో కంటే చిగురులో విటమిన్ ‘సి’ శాతం అధికంగా ఉంటుది. చింతచిగురులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను దూరం చేస్తాయి. ఆకు రాల్చే కాలంలో అన్ని చెట్ల మాదిరే, చింతచెట్ల ఆకులు కూడా రాలిపోతాయి. తర్వాత వాటి స్థానంలో లేత చిగురులు వస్తాయి. ఈ చిగురులను సేకరించి కూరలలో వేసుకోవటం మనకు తెలిసిన విషయమే. చింతచిగురుతోనే కొన్ని వంటకాలు చేసుకుంటారు. ఇది రుచికి పుల్లగా ఉంటుంది కాబట్టి, చింతచిగురు వేసిన కూరల్లో చింతపండు వేయరు. చింతచిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో, ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. చింతచిగురుతో కూర, పచ్చడి ఇతరత్రా వాటితో కలిపి పదార్థాల్ని చేసుకోవచ్చు. చింతచిగురు, పల్లీలు కలిపి చట్నీ చేస్తారు. వంకాయలతో చింతచిగురు వేసి చేసే కూర, చింతచిగురులో చేపలు వేసి చేసే కూర, చింతచిగురు రొయ్యల కూర చాలా ప్రత్యేకంగా వుంటుంది. ఇలా ప్రతి కూరలోను చింతపండు బదులు చింతచిగురు వేస్తే అది చాలా రుచికరంగా ఉంటుంది. చింతచిగురు ఎక్కువ దొరికినపుడు దాన్ని కచ్చపచ్చగా రుబ్బి వడల ఆకారంలో చేసి వాటిని ఎండబెట్టుకొని భద్రపరచుకొని వాడుకుంటారు. ఇవి కొన్ని నెలలు నిలవవుంటాయి.
చింతచిగురు మన శరీరంలోని వాతాన్ని, పైత్యాన్ని పూర్తిగా హరిస్తుంది. ప్రతిరోజూ చింతచిగురు రసం అరకప్పు ఉదయం వేడినీళ్లతో కలిపి త్రాగడంవల్ల పచ్చకామెర్ల వ్యాధి నాలుగు రోజుల్లో నివారణ అవుతుంది. చింతచిగురును ఆముదంతో ఉడికించి గడ్డలపైన, కురుపులపైన వేసి కడితే త్వరగా తగ్గిపోతాయి. చింతచిగురు రసం తీసి శరీరం నిండా పట్టించి కొంత సమయం ఉదయం పూట నిలబడితే దురదలు, దద్దుర్లు, గజ్జి వంటి చర్మవ్యాధులు తగ్గిపోతాయి. చింతచిగురు, పాత బెల్లం కలిపి నూరి కట్టుకడితే బెణుకులు, వాతనొప్పులు, వాపులు తగ్గుతాయి. చింతచిగురును పేస్ట్‌లా చేసి కీళ్ళపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. దగ్గు, కఫం, తగ్గించే గుణం చింతచిగురుకు ఉంది. చింతచిగురు కషాయం తాగితే జ్వరతీవ్రత నశిస్తుంది. చింతచిగురు, కొబ్బరినీరు కలిపి మెత్తగా రుబ్బి దానిని ముఖానికి పావుగంట సేపు ఉంచుకుంటే మొటిమలు, మచ్చలు, పొక్కులు కనిపించవు. ఆరోగ్య పరిరక్షణలో చింతచిగురు ఎంతో మేలు చేస్తుంది. తరచుగా చింతచిగురు తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. థైరాయిడ్‌తో బాధపడేవారు చింతచిగురును తమ ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గుండె జబ్బులను చింతచిగురు దరిచేరనీయదు. శరీరంలో ఎర్రరక్తకణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందించడమేగాక, రక్తాన్ని శుద్ధిచేస్తుంది.

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి