ఉత్తరాయణం

రాహుల్ ‘రచ్చబండ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జర్మనీ, లండన్‌ల్లో ముఖాముఖి కార్యక్రమాన్ని ‘రచ్చబండ’ను తలదనే్నలా నిర్వహించారు. ఇక్కడ ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్’ అంటూ రేడియో ప్రసంగాలు చేస్తుంటే, అక్కడ పరాయి దేశాల్లో ప్రతిపక్షనేత వేడి వేడి ప్రసంగాలతో ఆహూతుల్ని అలరించారు. ప్రధాని మోదీకి పార్లమెంటయినా, ఎర్రకోట అయినా, అమెరికా అయినా ఒకటే. దేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్వాకాన్ని, దాని చరిత్రని తవ్విపోయడమే అతని ధ్యేయం. రాహుల్ కూడా మోదీ అడుగుజాడల్లోనే నడవాలని భావిస్తున్నట్టున్నారు. అప్రస్తుతం, అసందర్భం, అనవసరం అన్న భేషజాలేమీ లేకుండా రాజకీయ వ్యాకరణాలతో వ్యాఖ్యల్ని వడ్డించేశారు. జర్మనీలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని చెప్పారు. జర్మనీలో ఆంధ్రప్రదేశ్ ఏమిటో, దానికి హోదా ఏమిటో, ఆ ప్రత్యేకత దేనికో చాలా కొద్దిమందికే తెలిసి ఉండొచ్చు. ఆ తర్వాత ఆర్సెస్సెస్‌ని తీవ్రవాద ఐసిస్‌తో పోల్చి చెప్పారు. ఇది తీవ్ర వ్యాఖ్య. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, అసహనం, మూకదాడులపై వ్యాఖ్యలు సరే సరి. వాటిని పెద్దనోట్ల రద్దు, జీఎస్టీలతో ముడిపెట్టడంలో అర్థం లేదు. వేర్వేరు తీవ్ర అంశాల్ని ముడివేసి గందరగోళం చేశారు. హింసపై తన వ్యతిరేకత కరెక్టే. కానీ 1984లో సిక్కుల ఊచకోత పట్ల కాంగ్రెస్ వైఖరిని, బాధ్యతని చెప్పడంలో తేలిపోయారు. ఇక డోక్లామ్ సరిహద్దు విషయం మాట్లాడడం, సమాచారం లేదంటూనే అక్కడ చైనా సైన్యం తిష్ఠ వేసిందంటూ చెప్పడం తనలోని అస్పష్టతకి నిదర్శనం. మొత్తానికి పరాయి గడ్డమీద తమ పార్టీ ఎన్నికల శంఖారావం బాగానే పూరించారు. అయితే అందుకు ఆయన్ని మరీ అభిశంసనకి గురిచేయనక్కరలేదు. ఎందుకంటే సాక్షాత్తూ ప్రధాని ఆ తరహా ప్రసంగాలతో దేశీయ హద్దులు చెరిపేస్తున్నప్పుడు రాహుల్ ఒక్కణ్ణే అంటే సబబు కాదు. కానీ ప్రధానికి ప్రధాన పోటీదారునిగా మరింత సంయమనం, పరిపక్వత, స్పష్టవైఖరిని రాహుల్ చూపగలిగితే బాగుండేది.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

శిథిలావస్థలో పురాతన కట్టడాలు
కాకతీయుల నాటి అద్భుత కట్టడాలు ప్రాభవం కోల్పోతున్నాయి. దేవాలయాలు కళ తప్పుతున్నాయి. మన చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పురాతన ఆలయాలు, కట్టడాల క్రింద గుప్తనిధులు ఉన్నాయన్న దురాశతో కొంతమంది ముఠాలుగా ఏర్పడి తవ్వకాలు చేపడుతున్నారు. కాకతీయుల కాలంలో ప్రాధాన్యతను సంతరించుకున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురం మండలంలోని రామప్ప ఆలయం, చుట్టూవున్న చిన్న ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. నిత్యం వందలాది మంది భక్తులు, పర్యాటకులు రామప్పగుడిలోని రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఆలయం ముందుగా నంది విగ్రహం నల్లరాయితో కట్టబడి ఆకర్షణీయంగా వున్నా తలభాగం దెబ్బతింది. రామప్ప ఆలయం చుట్టూ గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతూనే వున్నాయి. నిత్యం విదేశీ పర్యాటకులు, ఉన్నతాధికారులు రామప్పని నిత్యం సందర్శిస్తుంటారు. రామప్ప చెరువులో బోటు షికారుతో అందాలను ఆస్వాదిస్తుంటారు. ఇదే జిల్లా గణపురంలోని కోటగూళ్ల పరిస్థితి అంతే. పురాతన చరిత్రగల కోటగూళ్లు చూపరులను కట్టిపడేస్తాయి. కోటగూళ్లలో కొలువైన గణపేశ్వరస్వామి ఆలయ పైభాగం శిథిలమై ఇటీవలి భారీవర్షాలకు గుడి మొత్తం తడిసి ముద్దయింది. కేంద్ర పురావస్తుశాఖ అధీనంలోని ఆలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ కాకతీయుల కాలం నాటి ఆలయాల మరమ్మతులకు నిధులు విడుదల చేయడం లేదు. చరిత్రకారులు సైతం ఈ ఆలయాలు శిథిలావస్థకు చేరుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాకతీయుల కాలం నాటి ఆలయాలు, పర్యాటక ప్రదేశాలకు పూర్వవైభవం తీసుకురావాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఉంది.
- కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట

మట్టి గణపతులనే పూజిద్దాం
వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఇంటింటా, వీధులలోనూ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం పరిపాటి. కొందరు మట్టి విగ్రహాలను పూజిస్తే, మరి కొందరు రంగుల మాయలో ఆకర్షణ మోజులో పడి ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాలను పూజిస్తారు. కానీ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడం అన్ని విధాలా ఉత్తమం. మట్టి గణపతులను పసుపు, కుంకుమ, గంధంతో, అనేక రకాల ఔషధ మొక్కల ఆకులతో పూజిస్తే, ఆ విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల ఆ విగ్రహాలు నీటిలో తొందరగా కరగడం, ఆ విగ్రహానికున్న పసుపు, కుంకుమ, గంధంతోపాటు, పత్రిలో ఉన్న వివిధ ఔషధ గుణాలు కలవడం వల్ల ఆ నీరు ఆరోగ్యదాయిని అవుతుంది. నీటిలోని జీవరాశులకీ మంచిది. ఆ నీటిని తాగిన వారిలో ఆరోగ్యం, రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారైన విగ్రహాలతో అన్నీ నష్టాలే. కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేడ్ (జిప్సమ్)ను బాగా వేడిచేయగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తయారవుతుంది. ఇది నీటిలో కరగడానికి చాలాకాలం పడుతుంది. నీటి అడుగుభాగంలో పొరగా ఏర్పడుతుంది. దీనివల్ల వర్షాలు పడినప్పుడు వర్షపునీరు భూమిలోకి ఇంకకుండా బయటకువెళ్ళిపోతాయి. ఆ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం బాగా తగ్గిపోతుంది. వినాయక విగ్రహాలు ఆకర్షణీయంగా కనిపించడానికి రసాయనిక రంగులను వాడుతుంటారు. ఈ రసాయనాల తయారీలో భారీ లోహాలైన మెర్క్యురీ, లెడ్‌లను ఉపయోగిస్తారు. ఈ నీటిని తాగినప్పుడు గుండె, కిడ్నీ, నాడీ సంబంధిత వ్యాధులు, శ్వాసకోస సంబంధిత వ్యాధులు, రక్త, చర్మ సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. ఏ విధంగా చూసినా మట్టి విగ్రహాలే మంచివి. ప్రతి ఒక్కరూ జాగృతమవ్వాలి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు దీన్ని ప్రచారం చేయాలి. పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని కాపాడాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

తగ్గుతున్న మోదీ హవా?
ప్రధాని నరేంద్ర మోదీని అడుగడుగునా ఇరకాటంలో పెట్టాలని ప్రతిపక్షాలు చూస్తున్నా, అతనికి కలసివస్తోందనే చెప్పాలి. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఎన్‌డీఏదే పైచేయిగా నిలిచింది. రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికల్లో సైతం మోదీ తనదైన శైలి చాటుకున్నారు. కానీ ఎన్‌డీఏలో మిత్రపక్షాలు దూరవౌతున్నాయి. అందువల్ల రానున్న ఎన్నికల్లో కొంత దెబ్బ తగులవచ్చు. నాలుగున్నరేళ్ల కాలంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన మోదీకి నోట్ల రద్దు పుణ్యమాని కొన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. మోదీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ మిత్రపక్షాలు ఒకే తాటిపైకి వస్తున్నాయి.