క్రీడాభూమి

స్వప్న సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, ఆగస్టు 29: ఆసియా వేదికలపై భారత అథ్లెట్లు దూసుకుపోతున్నారు. ఊహకందని రికార్డులతో ‘గోల్డెన్’ హిస్టరీ తిరగరాస్తున్నారు. పదిరోజుల్లో పసిడి పతకాల సంఖ్యను పదకొండుకు చేర్చి, ఖేల్ ఇండియాకు కొత్త నిర్వచనమిచ్చారు. హెప్ట్థ్లాన్‌లో స్వప్న బర్మన్ హీరోచిత పోరాటాన్ని ప్రదర్శించి ‘స్వర్ణ బర్మన్’ అవతారమెత్తింది. మూడడుగుల దూకుడులో ప్రత్యర్థుల మాడు పగులకొట్టిన అర్పిందర్ సింగ్ ‘మేలిమి’ పతకాన్ని మెడలో వేసుకున్నాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఉపఖండానికి ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన ధుతీ చంద్ డబుల్ (రజతం) మెడలర్‌గా వినుతికెక్కింది. వీటన్నింటినీ సమం చేస్తూ బుధవారం భారత్ సాధించిన మరో ఘనత -టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సాధించిన పతకం. టీటీ స్టార్ శరత్‌కమల్, కొత్త సంచలనం మనీకా బాత్రా ద్వయం మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్యాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఆసియా గేమ్స్ ముగింపు రోజుల్లో మెరుపులు మెరిపిస్తున్న భారత అథ్లెట్లు పతకాల సంఖ్యను క్రమంగా పెంచుతుండటం శుభపరిణామం. పది రోజుల్లో పసిడి సంఖ్యను 11కు చేర్చి, 20 రజతాలు, 23 కాంస్యాలు.. మొత్తం 54 పతకాలతో పట్టికలో ప్రాధాన్యతా స్థానాన్ని ఆపాదించారు. హెప్ట్థ్లాన్ పోరులో దవడ ఎముకకు బలమైన గాయమైన బాధను పంటి బిగువున అదిమిపెట్టి స్వర్ణాన్ని సాధించిన స్వప్న బర్మన్ తెగువను ప్రశంసించాల్సిందే. రిక్షా లాగుతూ హృద్రోగానికి గురై 2013లోనే మంచంలోపడిన తండ్రికి సేవలు చేస్తూనే, కఠోర సాధనతో ‘స్వర్ణాన్ని’ సాకారం చేసుకున్న బర్మన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హైజంప్ (1003 పాయింట్లు), జావెలిన్ త్రో (872 పాయింట్లు)లో టాపర్‌గా, షాట్ పుట్ (707 పాయింట్లు), లాంగ్ జంప్ (865)లో సెకెండ్ బెస్ట్‌గా, 100 మీటర్లు (981 పాయింట్లు), 200 మీటర్ల పరుగులో (790 పాయింట్లు) చెప్పుకోదగ్గ ప్రదర్శనతో 6026 పాయింట్లు సాధించిన బర్మన్ జయకేతనాన్ని ఎగరేసింది. ఇక 48 ఏళ్ల తరువాత చరిత్ర సృష్టించిన మరో అథ్లెట్‌గా అర్పిందర్ సింగ్ నిలిచాడు. ట్రిపుల్ జంప్‌లో 1970లో మొహిందర్ సింగ్ గిల్ సాధించిన స్వర్ణం తరువాత, భారత్‌కు స్వర్ణం సాధించిన హీరో అర్పిందరే. పంజాబ్‌కు చెందిన అర్పిందర్, పురుషుల ట్రిపుల్ జంప్ మూడో విడతలో 11.77 మీటర్లుదూకి జాతీయ వ్యక్తిగత రికార్డును బద్దలుకొట్టాడు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆధిక్యతను సాధిస్తూ భారత్ ఖాతాకు మరో స్వర్ణాన్ని జోడించాడు. అవమానాలు, అవరోధాలు అధిగమించి మళ్లీ ఆసియా ట్రాక్ మీదకొచ్చిన ధుతీ చంద్, మహిళల 200 మీటర్ల పరుగులో రజతాన్ని సాధించి ‘డబుల్ మెడలర్’ రికార్డు నమోదు చేసింది. దేహంలో పురుష కణాలు ఎక్కువగా ఉన్నాయన్న అపవాదుతో 2014 కామనె్వల్త్ గేమ్స్‌కు దూరమైన ధుతి, సిఏఎస్ (కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్) క్లియరెన్స్‌తో మళ్లీ ట్రాక్ ఎక్కింది. కఠోర సాధనతో స్వర్ణాలే లక్ష్యంగా ట్రాక్‌లోకి దిగిన ధుతి, 100మీ, 200మీ స్ప్రింట్‌లో రెండు రజతాలు సాధించింది. బుధవారం 200మీ పరుగులో బహ్రెయిన్ అథ్లెట్ ఎడిడియోంగ్ ఓడియోంగ్ కంటే 0.149 క్షణాలు వెనకబడి స్వర్ణాన్ని చేజార్చుకుంది. ‘2014 నుంచి ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా. అలాంటి భయానక పరిస్థితి ఏ అథ్లెట్‌కూ ఎదురుకాకూడదు. వాటిని అధిగమించి దేశానికి రెండు రజతాలు సాధించిన క్షణాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కానీ, పతకాల కోసం సాగించిన కఠోర సాధన గుర్తుకొస్తే భయమేస్తోంది’ అని ధుతి వ్యాఖ్యానించింది. ఇక కామనె్వల్త్ గేమ్స్‌లో స్వర్ణ విజేతలు హోదాలో ఆసియా బరిలోకి దిగిన టీటీ మిక్స్‌డ్ డబుల్స్ ద్వయం కమల్, బాత్రా కాంస్యాన్ని సాధించారు. ఇప్పటికే కమల్ సారథ్యంలోని పురుషుల జట్టు కాంస్యాన్ని ఖాయం చేస్తే, బుధవారం మిక్స్‌డ్ డబుల్స్‌లో పతకాన్ని సాధించి 60 ఏళ్ల భారత కలను సాకారం చేశారు. సెమీఫైనల్స్‌లో చైనా టీటీ ద్వయం యింగ్షా సున్, వాంగ్ సన్ చేతిలో 9-11, 5-11, 10-11, 4-11, 8-11 స్కోరుతో ఓడిన భారత మిక్స్‌డ్ డబుల్స్ ద్వయానికి కాంస్యం దక్కింది. ‘ఈ క్షణాలను నమ్మలేకపోతున్నా. నన్ను నేను గిల్లి చూసుకున్నా. ఆసియా గేమ్స్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు పతకం సాధించాలన్న కల నేటితో నెరవేరింది’ అని మ్యాచ్ అనంతరం కమల్ వ్యాఖ్యానించాడు. హాకీ మహిళా జట్టు చైనాపై 1-0 విజయంతో ఫైనల్‌కు చేరితే, స్క్వాష్ పురుషుల, మహిళా జట్లు థాయిలాండ్, చైనాపై 3-0 విజయాలతో సెమీ ఫైనల్స్‌కు చేరాయి. దీంతో స్క్వాష్ వ్యక్తిగత విభాగంలో మూడు, టీం ఈవెంట్‌లో రెండు కాంస్యాలను భారత ఆటగాళ్లు ఖాయం చేశారు. ఇక బాక్సింగ్ ఈవెంట్‌లో బుధవారం మిశ్రమ ఫలితాలే దక్కాయి. 75కేజీ విభాగంలో నెత్తురోడుతూనే స్టార్ బాక్సర్ వికాశ్ కృష్ణన్, 49కేజీ విభాగంలో అద్భుత బౌట్‌తో అమిత్ ఫంగల్ భారత్‌కు పతకాలు ఖాయం చేశారు. మహిళల 51కేజీ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ రజత పతక విజేత సర్జుబాలా దేవి ఓటమితో, తొలిసారి ఏ పతకం లేకుండా మహిళా బాక్సర్లు వెనుతిరిగినట్టయ్యింది. జూడో, సెపక్‌తక్రా, కురష్‌లోనూ బుధవారం భారత ఆటగాళ్లు సరైన ఫలితాలు నమోదు చేయలేదు. లీగ్ మ్యాచ్‌లోనే ఘోర అపజయాలతో గేమ్స్ నుంచే నిష్క్రమించిన హ్యాండ్‌బాల్ పురుషుల జట్టు, చివరిగా ఇండోనేసియాపై ఫలితంలేని విజయాన్ని నమోదు చేసింది