హైదరాబాద్

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్మినార్, ఆగస్టు 29: బోనాల జాతర తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కే. స్వామి గౌడ్ అన్నారు. సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా టీఎన్‌జీఓ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి ఆఫీసులో ఉత్సవాలు జరుగుతున్నాయని అభినందించారు. ముఖ్య అతిధిగా హాజరైన స్వామిగౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులు కలిసిమెలిసి బోనాలను జరుపుకోవటం ఎంతో సంతోషమని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా పాఠశాల విద్యాశాఖ టీఎన్‌జీఓ అధ్యక్షుడు కే.ఆర్.రాజ్‌కుమార్, కార్యదర్శి యం. బాస్కర్ అధ్యక్షతన జరిగిన ఉత్సవాల్లో భాగంగా తొలుత శ్రీ బంగారు మైసమ్మకు ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పించారు. ఊరేగింపులో పోతరాజు నాట్యవిన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ టీఎన్‌జీఓకు చెందిన అన్ని శాఖల నుంచి ఉద్యోగులు, నేతలు హాజరుకావటం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో టీఎన్‌జీఓ హైదరాబాద్ అధ్యక్షుడు ముజీబ్, వీ.డేవిడ్, సెంట్రల్ యూనియన్ నేత రవీందర్ రెడ్డి, సిటీ సివిల్ కోర్టు జీపీ శివకుమార్ దాస్, స్పెషల్ జీపీ సత్యనారాయణ, జాయింట్ డైరెక్టర్ జి.రమేశ్, యూనియన్ నేతలు విజయలక్ష్మి, హైదరాబాద్ డీఈఓ వెంకట నర్సమ్మ, రంగారెడ్డి జిల్లా డీఈఓ సత్యనారాయణ రెడ్డి హాజరయ్యారు.
రైతు కుటుంబాలను ఆదుకోవాలి
ఖైరతాబాద్, ఆగస్టు 29: ప్రగతి నివేదన సభకు అయ్యే ఖర్చుతో రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ ప్రజా పార్టీ అధ్యక్షుడు, జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు రచేసిన విలేఖరుల సమావేశంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో నికృష్ట, అవినీతి పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. స్వార్థప్రయోజనాల కోసం ప్రాజెక్టులను నిర్మిస్తూ కోటాను కోట్లు కొల్లగొడుతున్నారని అన్నారు. సీఎం కేసీ ఆర్ పాలనలో రాష్ట్రం అదోగతి పాలౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి భవిష్యత్‌ను అంధకారం చేసే కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని ముఖ్యమంత్రి ఏమి సాధించారని ప్రగతి నివేదన సభ నిర్వహిస్తారని ప్రశ్నించారు. సుమారు 500 కోట్లతో సభను నిర్వహించడం కంటే రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకుంటే ఎంతో మేలు జరుగుతోందని అన్నారు. నాయకులు నర్సయ్య, సాంబశివ గౌడ్, వేద వికాస్, వాసు, సూరజ్, ఖాన్ పాల్గొన్నారు.