రంగారెడ్డి

మొక్కల సంరక్షణకు ట్రీగార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఆగస్టు 29: హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు ట్రీగార్డులను సిద్ధం చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ సూచించారు. గురువారం వికారాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆలంపల్లి దర్గావద్ద మొక్కలు నాటారు. ట్రీగార్డులకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని తెలిపారు. జిల్లాలో ఒక్కరోజే 20వేల మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. పురపాలక సంఘానికి 50వేల మొక్కల లక్ష్యాన్ని నిర్దేశించామని పేర్కొన్నారు. నాటిన అన్ని మొక్కలకు నీరు పోసి పెంచాలని స్పష్టం చేశారు. మున్సిపల్ చైర్మన్ వీ.సత్యనారాయణ మాట్లాడుతూ నాటిన మొక్కల సంరక్షణకు దర్గానలువైపుల ప్రహరీ నిర్మించాలని కోరారు. శాసనసభ్యుడు బీ.సంజీవ రావు, జడ్పీటీసీ ముత్తార్ షరీఫ్, మున్సిపల్ కమిషనర్ బీ.సత్యనారాయణ రెడ్డి, వైస్‌చైర్మన్ హెచ్.సురేష్, టీఆర్‌ఎస్ నాయకుడు ఎన్.శుభప్రద్ పటేల్ పాల్గొన్నారు.