రంగారెడ్డి

నాన్‌టీచింగ్ అధికారుల సంఘం సర్వసభ్య సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఆగస్టు 29: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పడిన నాన్ టీచింగ్ అధికారుల సంఘం తొలి సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం, పరిపాలనా భవనంలో జరిగిన తొలి సర్వసభ్య సమావేశానికి జాయింట్ రిజిస్ట్రార్ మధుపాల్ రావు అధ్యక్షత వహించారు. ఈనెల 31న ఉద్యోగ విరమణ చేయనున్న డిప్యూటీ కంప్ట్రోలర్ కే.చంద్రశేఖర్ రావును నాన్‌టీచింగ్ అధికారుల సంఘం సన్మానించింది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి ర్యాంకుల్లో విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే 6వ స్థానంలో నిలిపిన ఉపకులపతి డాక్టర్ వీ.ప్రవీణ్ రావును నాన్ టీచింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ అధ్యక్షుడు మధుపాల్ రావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం విభజన సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవహరించినందుకు ఉపకులపతి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఉపకులపతి డాక్టర్ వీ.ప్రవీణ్ రావు మాట్లాడుతూ బోధన, బోధనేతర ఉద్యోగులు, ప్రభుత్వం, వ్యవసాయశాఖ మంత్రి, ముఖ్యమంత్రి సహకారంతోనే విశ్వవిద్యాలయం అన్ని రంగాల్లో ముందుకు పోతుందని అన్నారు. డిప్యూటీ కంప్ట్రోలర్ కే.చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ తన విధినిర్వాహణలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్ కుమార్, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, నాన్‌టీచింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు శివాజీ, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.