మెయిన్ ఫీచర్

కలియుగ దైవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇప్పుడు కలియుగం. కలియుగం 4,32,000 సంవత్సరాలు చెప్పబడుతోంది. ప్రస్తుతం 5117 సం.లు కలియుగం, ప్రథమపాదం అని చెప్పుకుంటున్నాం. శే్వత వరాహకల్పం 28వ కలియుగం. కలి ప్రభావంవలన మనుషుల్లో సత్యత, ధర్మం, ప్రేమ, దైవభక్తి, శ్రద్ధ రోజురోజుకి క్షీణించిస్తున్నాయనియంటారు. యజ్ఞయాగాదులు ధ్యానం, తపస్సు ఇవేమి జరగడంలేదని పెద్దల ఆవేదన.
‘‘మహాభారతం అనంతరం శ్రీకృష్ణుడు అవతారం చాలిస్తే తమగతి ఏమిటని బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు-్భగవంతుని ప్రార్థించగా తాను శ్రీ వేంకటేశ్వరస్వామిగా అర్చావతారిగా వేంకటాచలంలో కొలువై ఉంటానని చెప్పారుట. ఆ విధంగానే కలియుగ దైవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి పూజలు అందుకుంటున్నారు.
‘‘కలిపురుషునితో బ్రహ్మగారు చెప్పారుట. భగవంతుని పూజించే వారిని, తల్లిదండ్రులను, గురువులను, సేవించేవారిని, వేదాలను, పురాణాలను తెలుసుకుని ధర్మాన్ని ఆచరించేవారిని సదా దైవ నామస్మరణతో ఉండేవారిని బాధించవద్దని, మిగిలిన అధర్మపరులలో ప్రవేశించమని వారంతా ‘కల్కికి’ లోబడి ఉంటారని బ్రహ్మ చెప్పడం జరిగిందట.
అందరూ కలియుగ దైవముగా శ్రీ వేంకటేశ్వరస్వామిని కొలుస్తూంటారు.
శ్లో॥ వేంకటాద్రి సమంస్థాన బ్రహ్మాందే నాస్తికంచన,
వేంకటేశ సమాదేవో నభూతో నభవిష్యతి!
అని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. వేంకటాచలంతో సమాన దేవుడు ముందు లేడు, ఇకపై ఉండడు.
‘‘ఇంతటి మహిమగలది స్వామివారు మరియు ఆయననున్నది దివ్యస్థానం. మానవులకు ఎన్నో ఆశలు, కోరికలు, ఊహలు, వాంఛలు సహజంగానే కలుగుతూంటాయి. కోరికలు నెరవేరడానికి ఒక్కొక్క దేవతకు ముడుపులు, మొక్కులు చేస్తుంటారు. సాధారణంగా మనుష్యులు ఒక్కొక్క కోరిక కోసం, ఒక్కొక్క దేవతను ప్రార్థిస్తుంటారు. అన్ని కోరికలు తీర్చే మహామాన్విత దైవం ‘‘శ్రీ వేంకటేశ్వరస్వామి.’’
‘‘12 పురాణాలల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి మహిమలు, వైభవం గూర్చి చెప్పబడ్డాయి. భవిష్య పురాణాల్లో తిరుమల కొండకు ‘కలియుగంలో’ వృషభాద్రి ప్రసిద్ధిచెందినది. త్రేతాయుగంలో అంజనాద్రిగాను, ద్వాపర యుగంలో శేషాద్రిగాను, కలియుగంలో శ్రీ వేంకటాద్రిగాను ప్రసిద్ధి చెందింది.
వేంగడం అనగా తమిళంలో వేంకటేశ్వరుడు. పురాణాల తర్వాత అందుబాటులోనికి వచ్చింది. తమిళ సాహిత్యం, తమిళులు వేంకటేశ్వరస్వామి భక్తులు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఉనికి, 3వ శతాబ్దమునుండే ఉండేదిట. అటవికులు విగ్రహం ఉనికి పూజలు మట్టి మూకుడులో ప్రసాదం ఆనవాయితిగా మారింది.
‘ఏడుకొండలవాడా, గోవిందా, గోవిందా’అంటూ ప్రతీరోజు వేలకొలది భక్తులు భారతదేశం నలుమూలలనుండి వచ్చి గంటల తరబడి కాచుకుని దర్శించుకుంటారు.
‘‘నేను వైకుంఠం అయినా విడిచి ఉంటాను, కాని నా భక్తుల్ని మాత్రం ఒక్కక్షణం అయినా విడిచి ఉండలేనని, దృఢమైన సంకల్పంతో భువిలో ఏడుకొండలపై ‘‘సాలగ్రామ’’శిలామూర్తిగా వెలిసియున్న స్వామి శ్రీ వేంకటేశ్వరస్వామికి, అనేక పేర్లు ఉన్నాయి. స్వామివారిని ఏ పేరుతో పిలిచినా ఎలా భావించినా పలుకుతాడని ‘అన్నమయ్య’ కీర్తనలో తెలిపారు.
‘నిత్య కళ్యాణ చక్రవర్తికి కొనసాగుతున్న అర్చన విధానంకూడా ఒక విశిష్టతను సంతరించుకుంది. అత్యంత ప్రాచీనమైన ‘వైఖానస ఆగమం’ ప్రకారం షట్కాలార్చనలు జరుగుతూంటాయి. ‘గర్భాలయాన్ని’ ఆనంద నిలయం అంటారు.
‘‘స్వామివారి గర్భాలయంలో చతుర్బుజుడు, శంఖుచక్రాలతో ఒకటి, వరద హస్తాలతో ఒక సొంపైన భంగిమలో నిలిచి ఉంటూ అద్భుతరీతిలో భక్తులకు దర్శనమిస్తూయున్నారు. తమ పాదాలను ఆశ్రయించమని అందరికి అభయమిస్తూన్నారు. సుమారు 8 అడుగుల ఎత్తు మూలమూర్తికి ప్రతీరోజు రెండుమార్లు తోమాల సేవ, మూడుమూర్లతో అర్చన, మూడుమార్లు నివేదన జరుగుతాయి. ఎంత చూసినా ఎన్ని సేవల్లోపాల్గొన్నా తనివి తీరదు.
‘ఏడుకొండలవాడు’ సప్తగిరీశుడు వక్షస్థలంలో లక్ష్మీగల శ్రీనివాసుడు. ఇలా ఏ పేరుతో పిలిచినాకోరిన వారికి కల్పతరువు పట్టిన వాళ్ళచేత బంగారు ముట్టి కొలిచినవారి ముందు జీవితం సేవచేసిన వాళ్ళ చేతిలోని మాణిక్యం భావించే వారికి ‘పరబ్రహ్మ’ కావలెనన్న వారికి ఘన మనోరథాన్ని తీర్చేవారులైన దైవం తన్మయముతో స్తుతించేవారికి ఆనంద రూపం! శ్రీ వేంకటేశ్వరుడు!

- ఎ.ఎస్.నాగభూషణశర్మ