Others

శిథిలాక్షరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమిస్తాను
కానీ పువ్వందించను
ఎదలో పూయనపుడు
కొన్నైనా ఇవ్వాలిగా
కోరిక అలాంటిది మరి.

నీతోటి సంతోషం
నాకేటి ఆనందం
చెల్లించుకో కాస్త స్నేహసుంకం
ఎదలో లేని కోలాహలాన్ని
అభినయంలోనైనా చూపాలిగా.

నీతోటి చెలిమి
నాకేమి కలిమి
అయినా చేస్తాను మాటల చెలిమి
పరిమళించని మాటలను
అవసరాల అత్తరులోనైనా ముంచి తీయాలిగా

నీతోటి ఏడుపు
నాకెందుకు చెప్పు
అయినా ఏడుస్తాను
అవసరార్థం రేపటి నీ మెప్పు కోసం
గుండెలో లేని తడిని కళ్లల్లో చూపాలిగా

నిన్ను నిన్నుగా చూడ్డానికి
నీలా ఎవరూ ఉండరు
నీ కోసం రావడానికి
నీకుమల్లే వెర్రి ఎవరికీ లేదు
అవసరాన్నిబట్టే అయినవాళ్ల ప్రవర్తనైనా
ప్రయోజనాన్ని బట్టే పదిమంది పలకరింపులైనా

కల్మషాల కడలియైనా
కడిగిన ముత్యాలనిస్తుంది
సెగలు పొగలై రగిలే ఎడారులైనా
చెలమల చెలిమిని అందిస్తుంది
ప్రళయ మారుత ఝంఝారావాలైనా
స్వాంతన సమీరాలతో
తనువును పులకరింపచేస్తుంది
ప్రకోపించే అగ్ని సైతం
వెలుగునిచ్చే చిరుదివ్వెగా మారుతుంది
శూన్యమనుకొనే ఆకాశమైనా
జలధారియై జగతిని నడిపిస్తుంది

రెండు విభిన్నాల మధ్య
అనుకూలతల అనుబంధాలు
రెండు ఏకత్వాల మధ్య
ప్రతికూలతల ప్రతిబంధకాలు
ప్రాణంలేని శిలాజాలను సైతం
పనిగట్టుకొని మరీ గుర్తిస్తాం
భద్రించి భావితరాల కందిస్తాం
ప్రాణమున్న బుద్ధిజీవులం
మనల్ని మనం మనుషులుగా గుర్తించలేమా!
శ్వాసించే విలువలతో మలితరానికి
సంధానకర్తలుగా మనలేమా?

కష్టాలను కాస్తే మానవత్వం
కష్టాలను పంచుకొంటే స్నేహతత్వం
ఎదుటి వారి సౌఖ్యాన్ని కోరుకొంటే ప్రేమ తత్వం
వాత్సల్యాన్ని పెంచుకొంటే సోదరత్వం
మనిషికుండే తత్వానే్న మానవత్వం అనుకొన్నాం
తత్వశుద్ధిలేని నిషిద్ధపు మనోతత్వమే
మనిషి తత్వం అని తెలుస్తోంది ఈనాడు
ఊహల్లో సైతం ఉనికిని కోల్పోయిన విలువలు
కొత్తగా తోస్తున్న వింతైన పదజాలాలు
చెల్లని కాలంలో
కాలరాసుకొంటున్న శిథిలాక్షరాలు

-కె.రవీంద్రబాబు.. 9052778988