కర్నూల్

హత్తిబెళగల్ ఘటనపై నివేదిక నిజాయితీగా అందజేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, ఆగస్టు 30: ఆలూరు మండలం హత్తిబెళగల్ గ్రామం సమీపంలో విఘ్నశేశ్వర స్టోన్‌క్రషర్ క్వారీలో ఈ నెల 3వ తేదీన జరిగిన పేలుడు సంఘటనపై ప్రజలు, అధికారులు నిజాయితీగా వాటి వివరాలను అందజేయాలని కలెక్టర్ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. రాత మూలకంగా కూడా వివారలు తెలియజేయాలన్నారు. గురువారం ఆర్డీఓ కార్యాలయంలో హత్తిబెళగల్ గ్రామం సమీపంలోని క్వారీలో జరిగిన పేలుడు సంఘటనపై కలెక్టర్ మెజిస్టీరియల్ విచారణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వారీలో జరిగిన ప్రమాదంలో 13 మందిమృతి చెందగా ఇద్దరు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారని, వారు క్షతగ్రాతులు అయ్యారన్నారు. ఈ సంఘటనపై న్యాయ విచారణ చేపట్టామని, జరిగిన సంఘటనను విచారణకు అందజేసి సహకరించాలని హత్తిబెళగల్ గ్రామప్రజలను కోరారు. గ్రామ ప్రజలు సమాచారాన్ని ఒక్కొక్కరుగాని లేదా అందరు కలిసి ఒక వినతిపత్రం ద్వారా అందజేయాలని కోరారు. విచారణలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. క్వారీ సంఘటనపై మైనింగ్, పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, ఎక్స్‌ప్లోజర్ కార్మిక శాఖ అధికారుల నుండి సేకరించిన నివేదికలను కూడా పరిశీలించడం జరుగుతుందన్నారు. ఈ విచారణపై ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా నిజాయితీగా చెబితే రికార్డు చేస్తామన్నారు. పేలుళ్లు చట్టం 1884 ప్రకారం మెజిస్టీరియల్ విచారణ జరుగుతుందన్నారు. పేలుడు సంఘటన జరిగిన సమయంలో అక్కడ పని చేస్తున్న వారు కూడా నిర్భయంగా వారి అభిప్రాయం విచారణ ముందు తెలపాలన్నారు. ఈ మేరకు హత్తిబెళగల్ గ్రామానికి చెందిన రామాంజినేయులు మాట్లాడుతూ క్వారీ సమీపంలో దేవాలయం ఉందని అక్కడికి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారని ఈవిషయం క్వారీపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రతి రోజూ ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేలుళ్ల శబ్దానికి స్కూల్‌కు వెళ్లే పిల్లలు పలు వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్‌కు వివరించారు. విచారణకు వచ్చిన ప్రజలందరు కూడా వారి అభిప్రాయాలను రాత మూలకంగా రాసి అందరు సంతకాలు చేసి ఇవ్వాలని ఆయన కోరారు. విచారణలో ఎక్స్‌ప్లోజర్ కంట్రోలర్ (వైజాగ్) అధికారి అమోల్ సోమ్‌బ్రాస్, ఆర్డీఓ రామమూర్తి, కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ బాలునాయక్, డీఎస్పీ ప్రసాద్, గనులశాఖ డీడీ రాజాబాబు, ఏడీ అమీర్‌బాషా, కార్మిక శాఖ అధికారి రఘురాముడు, ఆదోని, ఆలూరు, తహశీల్దార్లు శ్రీనాథ్, ఉసేన్‌సాబ్, వీరేంద్రగౌడ్ ఆర్డీఓ కార్యాలయం ఏఓ ఈరన్న, కలెక్టరేట్ అధికారి వసుందర, హత్తిబెళగల్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.