Others

ఎక్కడున్నావయ్యా బాపూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడున్నావయ్యా బాపూ
ఎతకలేక సత్తున్నాం..
-గీతలోనా?
ఎన్ని గీతలు సాపు చెయ్యాలి
-రాతలోనా?
ఎన్నచ్చరాల నీడలెతకాలి

ఎక్కడున్నావయ్యా బాపూ
ఎతకలేక సత్తున్నాం..

రామాయణంలో వానర తోకలా
భాగవతంలో వామనావతారిలా
కొమ్మంచునో.. గొడుక్కిందో ఉన్నట్టే ఉంటావ్
పట్టుకుందామంటే -బుడుగైపోతావ్

ఎక్కడున్నావయ్యా బాపూ
ఎతకలేక సత్తున్నాం..

ముగ్గులతో ముద్దపప్పు..
అల్లరితో ఆవకాయ పెట్టడం నీకే చెల్లింది
వనిత చెంగున వాలుజడ
పంచెమాటున బ్రాందీ సోడా కప్పెట్టడం బాగా అలవాటైంది
కోపమొచ్చో.. కోతికొమ్మచ్చో
కట్టేద్దామంటే -కలమై కాలమైపోతావ్

ఎక్కడున్నావయ్యా బాపూ
ఎతకలేక సత్తున్నాం..

పట్టుపంచె.. పట్టిమంచెం
వీధిగుమ్మం.. వెండికంచం
తాతమీసం.. తారాలోకం
అప్పడాలకర్ర.. ఆండాళ్లు చీర
కవరుపేజీ.. చిరుగు గోచీ
తుంబుర వీణ.. వెంకటరమణ
ఎక్కడని వెతకాలి? ఎక్కడ లేవనుకోవాలి..?
***
ఇప్పుడర్థమైందయ్యా బాపూ
నువ్వు
రాతకందని గీతాసారానివి
లిపికి చిక్కని లిప్తకాలానివి
అభౌతికంలోని అనంత జ్ఞాపకానివి
***
ఎక్కడో లేడయ్యా బాబూ
తెలుగుదనంలో ఉన్నాడు నిక్షేపంగా

(నేడు బాపు నాల్గవ వర్ధంతి..................)

-మహాదేవ