క్రీడాభూమి

ఇంగ్లాండ్ 246 ఆలౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంప్టన్ (ఇంగ్లాండ్), ఆగస్టు 30: ఇక్కడి రోజ్ బౌల్‌లో గురువారం భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రారంభమైన నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 76.4 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టులో శామ్ కుర్రన్ (78), మొరుూన్ అలీ (40) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌లెవరూ ఆశించిన స్కోరు చేయడంలో విఫలమయ్యారు. ఇప్పటికే ఇరు జట్ల మధ్య జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌లలో ఇంగ్లాండ్ 2-1 తేడాతో భారత్‌పై ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్‌లో గెలుపు ద్వారా సిరీస్‌ను సమం చేయాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. జస్ప్రీత్ బుమ్రా 20 ఓవర్లలో 46 పరుగులు, ఇషాంత్ శర్మ 16 ఓవర్లలో 26 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ 14.4 ఓవర్లలో 40 పరుగులు, మహమ్మద్ షమీ 18 ఓవర్లలో 51 పరుగులిచ్చి తలో రెండు వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యకు ఒక వికెట్ దక్కింది. ప్రత్యర్థి తమ ముందు ఉంచిన 247 పరుగుల ఛేదనకు బరిలోకి దిగిన భారత్ తొలిరోజు ఆట ముగిసేసరికినాలుగు ఓవర్లలో 19 పరుగులు చేసింది. శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్ బరిలో ఉన్నారు.