క్రీడాభూమి

బలపడతాం..స్వర్ణం సాధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 30: ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఓటమి చెందినంతమాత్రాన తానేమీ నిరాశపడడం లేదని, భవిష్యత్తులో ఇలాంటి మ్యాచ్‌లు ఎన్నో ఆడాల్సి ఉంటుందందని, వాటిలో అద్భుత ప్రదర్శన కనబరచడం ద్వారా గోల్డ్ మెడల్ తప్పకుండా సాధిస్తాననే గట్టి నమ్మకం ఉందని భారత షట్లర్ పీవీ సింధు వ్యాఖ్యానించింది.
గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో సింధు, సైనా నెహ్వాల్, కోచ్ గోపీచంద్ మాట్లాడారు. జకార్తా ఆసియా గేమ్స్‌లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్ చేతిలో పరాజయం పాలై రజత పతకంతో సరిపెట్టుకున్న తనకు రానున్న రోజుల్లో పోటీ పడే విభిన్న పోటీల్లో పైచేయి సాధించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఆసియా క్రీడల్లో భారత్‌కు చెందిన మరో షట్లర్ సైనా నెహ్వాల్ సైతం సెమీ ఫైనల్స్‌లో వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్ చేతిలో ఓటమి చెంది కాంస్య పతకాన్ని అందుకుంది. ఆసియా క్రీడల్లో సింధు, సైనా నెహ్వాల్ చూపిన అద్భుత ప్రతిభా పాటవాలను కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ప్రస్తుతిస్తూ వారిద్దరూ ఓటమితో కుంగిపోలేదని, మానసికంగా చాలా ధృడంగా ఉన్నారని అన్నాడు. ఆసియా గేమ్స్ కంటే ముందు జరిగిన కామనె్వల్త్ గేమ్స్, మరో రెండు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో సింధు ఫైనల్ మ్యాచ్‌లలో ఓడిపోయినా, అద్భుత ఆటతీరును కనబరచిందని గోపీచంద్ వ్యాఖ్యానించాడు. గత మ్యాచ్‌లలో జరిగిన తప్పులను గమనంలోకి తీసుకుని మళ్లీ అలాంటి పొరపాట్లు జరగకుండా భవిష్యత్తులో జరిగే వివిధ పోటీల్లో మరింత సాధన ద్వారా తన సత్తా నిరూపించుకుంటానని సింధు వ్యాఖ్యానించింది. క్రీడా పోటీల్లో గెలుపు, ఓటములు సహజమని, ప్రతీ మ్యాచ్‌లోనూ గెలవడం సాధ్యం కాదని సైనా నెహ్వాల్ పేర్కొంది. తాను ఆడబోయే తదుపరి టోర్నమెంట్లలో గోల్డ్ మెడల్ సాధించేందుకు శక్తివంచన లేకుండా శ్రమిస్తానని ధీమా వ్యక్తం చేసింది.