అంతర్జాతీయం

ఉగ్రపోరుపై సమష్టి పోరాటానికి మేము సిద్ధమే....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మాండు, ఆగస్టు 30: ప్రపంచంలో వేళ్లూనుకుపోయిన ఉగ్రవాదం, డ్రగ్స్ సరఫరా వంటి అతిపెద్ద సమస్యలను నిర్మూలించడానికి ఇతరదేశాలతో కలిసి పనిచేయడానికి తామెప్పుడూ సిద్ధమేనని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఇక్కడ భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్, నేపాల్ భాగస్వాములుగా ఉన్న బిఐఎంఎస్‌టెక్ (బిమ్స్‌టెక్) నాలుగో శిఖరాగ్ర సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచలోని మొత్తం జనాభాలో ఈ ఏడుదేశాల జనాభా 22 శాతం ఉందని, అలాగే 2.8 ట్రిలియన్‌ల యూఎస్ డాలర్ల స్థూల ఉత్పత్తి కలిగి ఉన్నాయని చెప్పారు. ఈ దేశాల మధ్య సంధాయకత ఏర్పడటానికి ఈ సమావేశం చాలా మంచి అవకాశమని ఆయన చెప్పారు. ముఖ్యంగా వాణిజ్య, డిజిటల్, ఆర్థిక, రవాణా, ప్రజలకు-ప్రజలకు మధ్య సంధాయకత ఏర్పడటానికి ఇదే తరుణమని అన్నారు. ముఖ్యంగా బంగాళాఖాతం ప్రాంతానికి రక్షణ పరంగా, అభివృద్ధి పరంగా ప్రత్యేక పాత్ర ఉందన్నారు. అయితే ఉగ్రవాదం, డ్రగ్స్ రవాణా తదితర సమస్యల నుంచి బాధపడని దేశాలు ఈ రీజియన్‌లో లేవని అన్నారు.
బిమ్స్‌టెక్ ఆధ్వర్యంలో నార్కోటిక్ లాంటి సమస్యలపై చర్చలు జరపడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఇది కేవలం ఏ ఒక్క దేశానికో చెందిన శాంతిభద్రతల సమస్య కాదని, సమష్టిగా ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే హిమాలయాలు, బంగాళాఖాతం మధ్యన ఉన్న ఈ దేశాలు తరచూ వరదలు, తుపాన్లు, భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాల బారిన పడుతున్నాయని, అన్నిదేశాల పరస్పర సహకారంతోనే వీటి తీవ్రతను తగ్గించవచ్చునని, అలాగే సహాయ కార్యక్రమాలు చేపట్టవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఏ ఒక్కదేశం ప్రయత్నంతోనే శాంతి, సౌభ్రాతృత్వం, సంపద సాధించడం కష్టమని, దీనికి అన్ని దేశాలు ఒకరికి ఒకరు సహకరించి ముందుకు పోవాలని అన్నారు.
ముఖ్యంగా వాణిజ్యం, ఆర్థిక, రవాణా, డిజిటల్, పౌరుల మధ్య సంధాయకతను పెంచడం వల్ల అందరం లాభపడతామని మోదీ అన్నారు. బిమ్స్‌టెక్ దేశాల మధ్య కేవలం ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చుకోవడంతోనే సరిపెట్టుకోకుండా భాష, కళ, చరిత్ర, నాగరికత, ఆహార అలవాట్లు విషయంలో కూడా ఒకరికొకరు సంధాయకత పొందాలని ఆయన కోరారు. అలాగే వ్యవసాయ పరిశోధన, స్టార్టప్‌ల వంటి అంశాలు సభ్యదేశాలు లబ్ధి పొందడానికి వీలుగా భారత్ నలందా యూనివర్సిటీలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా బుద్ధిజంపై 2020లో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని దానికి అన్ని సభ్యదేశాలను ఆహ్వానిస్తామని చెప్పారు. అంతేకాకుండా డిజిటల్, సైన్స్, టెక్నాలజీ అంశాలలో అనుసంధానం విషయంలో భారత్ మిగిలిన దేశాలకు సహాయ సహకారాలు అందిస్తుందని మోదీ తెలిపారు. నేపాల్ ప్రధాని కెపి శర్మ ఒలి ప్రారంభించిన ఈ సమావేశంలో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కాగా, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో ఇరుదేశాల మధ్య సంబంధాల పటిష్టానికి చర్చలు జరిగినట్టు అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ తెలిపారు. శ్రీలంకతో కలిసి చేపట్టినన పలు ప్రాజెక్టులు, ద్వైపాక్షిక, ఇతర అంశాలు ఇందులో ప్రస్తావనకు వచ్చినట్టు ఆయన చెప్పారు.