Others

లగేజ్ బ్యాగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను నేనుగా ఉన్నాను
నన్ను మోస్తూ బ్యాగ్ నడుస్తుంది

అవసరాలు పేర్చబడ్డ ఆత్మీయమై
వీపునకు చుట్టేసుకుని కొత్త ప్రాంతాల్లో
కొత్త విశేషాల గైడవుతుంది
ఆకలినీ ఆవశ్యకాన్నీ పసిగట్టి
అమ్మలా అనునయిస్తూ
వాత్సల్యాల అరల మధ్య ఒద్దికగా
ఒదిగిపోతుంది

అల్లాద్దీన్ అద్భుతంలా
నా కూడా తనుంటే నల్లేరుపై బండినడక
కాదంటే ప్రయాణం ఓ కుంటినడక
తలకింద దిండవుతుంది
వొంటి మీద దుప్పటిపరిచి
నీటి బాటిల్ నోటికందిస్తూ
కాలక్షేపాన్ని ఓ పుస్తకంగా.. వ్యాపకంగా
మస్తిష్కాన్ని చిరునవ్వై స్వాంతనపరుస్తుంది

అకస్మాత్తుగా చేదు జ్ఞాపకం జ్ఞప్తికొచ్చినప్పుడు
ఒడిలో చేరి ఆలింగనాల ఓదార్పై
చెమ్మగిల్లుతుంది
మనసు కావచ్చు శరీరం కావచ్చు
కొద్దిపాటి సుస్తీకి
అమాంతం మందుబిళ్లగానో మత్తుబిళ్లగానో
నయంచేసి గానీ నిద్రకుపక్రమించదు

వెళ్లిన పని అయ్యేవరకు
అంటిపెట్టుకు తిరిగే స్నేహమల్లే
పాతకాలాన్ని గిర్రున తిప్పి
వర్తమానమై ఓరిమి నింపుతుంది

నేను నేనుగా ఉన్నాను
నన్ను మోస్తూ బ్యాగ్ నడుస్తుంది
నిజంగా బ్యాగ్ వెంటుంటే
జగమంత కుటుంబం నా వెంట వున్నట్టే
తను లేని ప్రయాణంలో నేనే కాదు ఎవ్వరైనా ఒంటరైనట్టే.

-బంగార్రాజు కంఠ 8500350464