వినమరుగైన

మా భూమి వాసిరెడ్డి - సుంకర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరో రంగంలో దేశముఖ్ నల్లగొండ పారిపోవటం- అంతటితో దేశముఖ్ దౌర్జన్యకాండ అంతమైపోవడం ఫలప్రాప్తి.
ఈ నాటకంలో శిల్పం ఇంత కట్టుదిట్టంగా వుండటం చేతనే విశ్వనాథ సత్యనారాయణ గారు దీన్ని 10.7.1947న విజయవాడ శ్రీరామా టాకీస్‌లో చూసి ‘‘పాత్రపోషణ కమ్మచ్చున లాగినట్లున్నది. ఒక కావ్యానికి ఆద్యంతాలు ఇంత చక్కగా బిగించడం ఒక శిల్పపు నేర్పు’’ అని ప్రశంసించారు.
ఈ నాటకంలోని సంభాషణల్లో ఆంధ్ర గ్రామీణ ప్రాంతాల్లోని అచ్చమైన జాతీయాలు, లోకోక్తులు, సామెతలు, ప్రేక్షకులనెంతో ఆకర్షించాయి. కనుకనే ప్రేక్షకులకు ఈ నాటకం అంత సన్నిహితమైంది. ‘కాళ్ళు కండెలు కట్టేట్టు కచేరీ చుట్టూ తిరిగాడు’. ‘గొర్రె కొవ్వికొండ మీద తిరగబడిందట’, ‘గోచీకి మించిన దరిద్రం ఏమిటి?’, ‘ఆవుల్ని చంపి చెప్పులు దానమిచ్చినట్లు’. ‘చెప్పు తినే కుక్కకు నెయ్యి కూడు ఇముడుతుందా’, ‘గానుగలోదే గంటెడు’, ‘పట్టుమని పదేళ్ళన్నాకాలా’, ‘చూడబోతే కుచ్చీకాయలేరు’, ‘ఎందుకొచ్చిన నోటిరంకురా బాబూ’, ‘ఆ పిల్లనెత్తిన ముందా చిట్టెడు గింజలు పడేదాకా నాకేం తోచదు’ మొదలగు ప్రయోగాలెన్నో దీనికి ఉదాహరణలుగా చూపించవచ్చు. కనుకనే విశ్వనాథ సత్యనారాయణ ‘‘మేము కవులమని రొమ్ములు విరుచుకుని పద్యాలు వ్రాసి, ఏనుగులెక్కి గండపెండేరాలు చేయించుకునే కవులల్లో ఎంతమందికి ఈ అచ్చమైన, జాతీయమైన తెలుగు భాష తెలుసు?’’ అని ప్రశ్నించారు. అదేవిధంగా పింగళి లక్ష్మీకాంతం గారు స్పందించి ‘వీరి రచనలు చూశాక మేం కవులమని చెప్పుకోవడం సిగ్గుగా ఉంది. తిక్కన తర్వాత మళ్లీ ఈనాడు జాతీయమైన భాష విన్నాం’ అన్నారు.
ఇంద్రగంటి శ్రీకాంత శర్మ మా భూమి గురించి రాస్తూ ‘‘ఈ నాటకంలో విశేషం ఏమిటంటే రచయితలు ఏ లక్ష్యాన్ని ఉద్దేశించి ఏ పాత్రలమీద ప్రేక్షకులకు సానుభూతి ఏర్పడాలనుకున్నారో ఏ పాత్రల మీద ఏహ్యభావం కలిగించాలనుకున్నారో, దానిని ఘటనల పరంపర ద్వారా సాధించారు తప్ప, తామే కలియబడి పాత్ర నోళ్ళు పెగలదీసి తమ భాషనూ, ఉద్దేశాలనూ గొంతులో పొయ్యలేదు. రచనలో ముఖ్యంగా నాటక రచనలో ఈ సంయమనాన్ని పాటించడానికి మించిన కళాత్మకత లేదు’’.
‘‘ఈ నాటకాన్ని నేడు మూడు తడవలు చూశాను. మొదటిసారి చూచినప్పుడెంత బాగుందో, మూడోసారి చూచినపుడు కూడా అంతే బాగుంది’’ అన్నారు నార్ల వెంకటేశ్వరరావుగారు. ఇంకా ఎందరో ప్రముఖులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు, గిడుగు సీతాపతిగారు, మల్లంపల్లి సోమశేఖర శర్మగారు, ముదిగొండ లింగమూర్తిగారు. కొప్పరపు సుబ్బారావుగారు, మునిమాణిక్యంగారు, హరినాగభూషణంగారు, పుచ్చలపల్లి సుందరయ్యగారు, తుమ్మల వెంకట్రామయ్యగారు దీనిని ప్రశంసించారు.
అయితే ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం వారి సచిత్ర సాహిత్య మాసపత్రిక ‘అభ్యుదయ’ ఆగస్టు 1947 సంచికలో ఈ నాటకాన్ని పూర్తిగా తెగనాడుతూ- ఆ పత్రిక సంపాదకవర్గ సభ్యుడు ప్రయాగ కోదండరామశాస్ర్తీగారు గ్రంథసమీక్ష చేశారు. ఐదున్నర పేజీలు సాగిన సమీక్ష ఇది- ‘ఏ విధంగానూ, అభ్యుదయ రచన అనిపించుకోదు’ అనే తీర్పుతో ముగిసింది. గ్రామీణుల చతుర సంభాణలు వారికి ఎబ్బెట్టుగా తోచాయి. రెండు పదాల వాడకం బూతులుగా ఖండించారు. తెలంగాణ ప్రజల సమస్యలు చిత్రీకరించలేదన్నారు. శిల్పం, పాత్ర పోషణ సరిగా లేదన్నారు. ఇంత పాక్షిక విమర్శ వారు ఎందుకు రాశారోగాని, దానిపై వచ్చిన ప్రతి విమర్శలు సెప్టెంబరు 47 సంచికలో ప్రచురిస్తూ ‘ప్రతి వ్యక్తికీ ప్రతి విషయమూ తెలియనట్లుగానే, నాకు తెలియని విషయాలు అనేకం వుండి, నా రచనల్లో అజ్ఞానం ప్రతిబింబించవచ్చు. ఈ వాస్తవానికి నేను అతీతుణ్ణని ఏనాడూ అనుకోవడంలేదు’’ అంటూ ఆత్మ విమర్శ చేసుకున్నారు.
ఈ నాటకం విస్తృతంగా కోస్తా ఆంధ్రాలో ప్రదర్శింపబడింది. ఆదరింపబడింది. నాటకంలో వాడిన భాష ఆంధ్ర గ్రామీణ ప్రాంతాలవారిది. ఈ ప్రాంతంలో తెలంగాణా పోరాటం ఇచ్చిన చైతన్యంతో సాగిన భూస్వామ్య, జమీందారీ వ్యతిరేక పోరాటాలను ఈ నాటకంలో ప్రజలు చూడగల్గారు. తెలుగువారందరూ ముక్కచెక్కలుగా విడగొట్టబడటాన్ని ప్రతిఘటిస్తూ, విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళే క్రమాన్ని ఈ నాటకంలో చూస్తాం. అదేవిధంగా ప్రజలు ఏ మతంవారైనా పేదవారంతా ఒకటనీ, కులపరంగా కాదు వర్గ పరంగా ప్రజలు సంఘటితం కావాలనీ ఈ నాటకం ప్రబోధించింది.
‘‘కన్యాశుల్కానికి లాగానే ఈ నాటకానికీ ఆంధ్రదేశం స్వాగతం పల్కింది’’ అని శ్రీనివాస చక్రవర్తిగారు అంటే, గిడుగు సీతాపతిగారు ‘‘గురజాడ అప్పారావుగారే ఈ నాటకాన్ని చూచి ఉన్నట్లయితే , తాము పడ్డ కష్టాలన్నీ ఫలించినాయి అని ఉండేవారని నా భావం’’ అన్నారు.
ఈనాటికీ మాభూమి నాటకం సజీవంగా ఉండటానికి కారణం దానిలో చర్చించిన సమస్యలన్నీ మరొక రూపంలో ఈనాటికీ కొనసాగుతూ వుండటమే. అటువంటి వౌలిక సమస్యలకు చర్చించిన ఉత్తమ నాటకం మాభూమి.
*
-అయిపోయంది
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కొత్తపల్లి రవిబాబు