బాబు బయోపిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎక్కడ చూసిన బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. తెలుగులో ఇప్పటికే సావిత్రి మహానటి బ్లాక్‌బస్టర్‌గా నిలవగా, రాష్ట్ర రాజకీయాలలో మహానాయకులుగా పేరొందిన ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు, వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిల బయోపిక్‌లు సైతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇందులో చంద్రబాబునాయుడు బయోపిక్‌ను పి.వెంకటరమణ దర్శకత్వంలో జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్నారు. మోహన శ్రీజ సినిమాస్, శే్వతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్‌పై సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకటరమణ మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడుగారు ఓ లివింగ్ లెజెండ్. దేశ చరిత్రలోనే ఆయనొక అరుదైన, ఆదర్శవంతమైన నాయకుడు. ఓ సామాన్య కుటుంబంలో పుట్టి అగ్రస్థానానికి ఎదిగిన ఆయన జీవితం అందరికీ తెలియచెప్పాలనే సంకల్పంతో బాబుగారి బయోపిక్‌ను తెరమీదకు తీసుకువస్తున్నాం. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తిచేశాం. వినోద్ నువ్వుల చంద్రబాబునాయుడు పాత్రలో నటిస్తున్నాడు. భాస్కర్ ఎన్టీఆర్‌గా కన్పిస్తారు. చంద్రబాబునాయుడు చిన్నతనం నుంచి ఆయన రాజకీయ నాయకుడిగా ఎదిగిన క్రమాన్ని ఈ బయోపిక్‌లో చూపిస్తామన్నారు. నిర్మాత రాజేంద్ర మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడుగారు ప్రమాణ స్వీకారం చేసి ఈ సెప్టెంబర్ 1కి 23 సం.లవుతోంది. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అణువణువునా ఆయన మార్క్ మనకు కన్పిస్తూనే ఉంటుంది. అలాంటి మహానాయకుడి బయోపిక్‌ను మేము ప్రతిష్ఠాత్మంగా నిర్మిస్తున్నాం. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు. వినోద్ నువ్వుల, శివానీ చౌదరి, వౌనిక, భాస్కర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: కార్తీక్ ముకుందన్, సంగీతం: రాజ్‌కిరణ్, పి.ఆర్, మార్కెటింగ్: వంశీ చలమలశెట్టి, నిర్మాత: జి.జె.రాజేంద్ర, దర్శకత్వం: పి.వెంకటరమణ.