విజయదశమికి ‘పందెం కోడి -2’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ కథానాయకుడు విశాల్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకంపై ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పందెం కోడి-2’. గతంలో మాస్ హీరో విశాల్, ఎన్.లింగుస్వామి కాంబినేషన్‌లో వచ్చిన ‘పందెంకోడి’ సూపర్ డూపర్ హిట్ అయి విశాల్ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘పందెంకోడి 2’. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ గురువారం విడుదల చేశారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న పందెంకోడి-2 చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర సమర్పకులు ఠాగూర్ మధు తెలిపారు. మాస్ హీరో విశాల్, కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాజ్‌కిరణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: కె.ఎ.శక్తివేల్, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్, సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాతలు: విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా, దర్శకత్వం: ఎన్.లింగుస్వామి.