సంపాదకీయం

‘పొరుగు’ మైత్రికి బలం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిమ్‌స్టెక్’ దేశాల ప్రభుత్వ అధినేతల సమావేశంలో బీభత్సకాండ పట్ల నిరసన వ్యక్తం కావడం పాకిస్తాన్ ప్రభుత్వానికి మరో అభిశంసన. మన దేశంలోకి పాకిస్తాన్ ప్రభుత్వం దశాబ్దుల తరబడి బీభత్సకారులను ఉసిగొల్పుతుండడం అంతర్జాతీయ సమాజానికి తెలిసిన రహస్యం. అందువల్ల ఇరుగు పొరుగు దేశాలు బీభత్సకాండను నిరసించడం పాకిస్తాన్‌కు కనువిప్పు కలిగించడం లక్ష్యమైన శుభ పరిణామం. పాకిస్తాన్‌కు ‘కనువిప్పు’ కలుగబోదన్నది వేఱు విషయం. కానీ నేపాల్ రాజధాని ఖాట్మండూ నగరంలో గురు,శుక్రవారాలలో జరిగిన ‘బిమ్‌స్టెక్’ సమావేశం విడుదల చేసిన ప్రకటనలో ‘బీభత్సకాండ’పై ఉమ్మడి పోరాటం గురించి ప్రస్తావించడం పాకిస్తాన్‌కు మాత్రమే కాదు, చైనాకు సైతం నచ్చని వ్యవహారం. ఎందుకంటె చైనా ఉసిగొల్పుతున్న బీభత్సముఠాలు బర్మా- మ్యాన్‌మార్-లో తిష్ఠవేసి ఉన్నాయి, మన ఈశాన్య ప్రాంతంలోకి పదే పదే చొరబడుతున్నాయి. బర్మాలో సైనిక పాలన సాగిన సమయంలో ఈ ముఠాలను బర్మా ప్రభుత్వం ‘చూడకుండా’ వదిలేసింది. కానీ బర్మాలో ప్రజాస్వామ్య ప్రక్రియ మొదలైన తరువాత ఈ ‘చైనా సమర్ధక బీభత్స బృందాల’ను బర్మా ప్రభుత్వం నిరసిస్తోంది. ఇప్పుడు ఖాట్మండూలో జరిగిన నాలుగవ ‘బిమ్‌స్టెక్’ శిఖర సమావేశానికి ఇదంతా నేపథ్యం. చైనా ప్రభుత్వం దశాబ్దుల తరబడి థాయ్‌లాండ్‌లో సైతం ‘ఎఱ్ఱ బీభత్సకాండ’ను ఉసిగొల్పుతోంది. ఈ ‘ఎఱ్ఱ బీభత్సకారులు’ థాయ్‌లాండ్‌లో పదే పదే కల్లోలకాండను సృష్టించడం చరిత్ర. నేపాల్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకొనడానికై ‘మావోయిస్టులు’ 1995 నుంచి 2004 వరకు భయంకర బీభత్సకాండను సాగించడం చరిత్ర.. ఈ చరిత్రను చైనా ప్రభుత్వం నడిపించింది. 2004 నుంచి 2008 వరకూ నూతన ‘రాజ్యాంగ రచన’ జరుగకుండా మావోయిస్టులు అడ్డుకున్నారు. 2005లో సాయుధ మార్గాన్ని వదలిపెట్టిన నేపాల్ మావోయిస్టులు ‘ప్రజాస్వామ్య నిబద్ధత’ను ప్రకటించారు. ఈ ప్రజాస్వామ్య ‘నిబద్ధత’ ముసుగులో యుగాలనాటి ‘్భరత-నేపాల్ సాంస్కృతిక భౌగోళిక’ సంబంధాలను భగ్నం చేయడానికి నేపాల్‌ను చైనాకు చేరువచేయడానికి నేపాల్ ‘మావోయిస్టులు’ 2008 నుంచి యత్నిస్తుండడం నడుస్తున్న చరిత్ర. ప్రస్తుతం ‘నేపాల్ మావోయిస్టు, కమ్యూనిస్టుపార్టీ’ వారు, ‘నేపాల్ మార్క్సిస్టు లెనినిస్టు కమ్యూనిస్టుపార్టీ’వారు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు. అందువల్ల నేపాల్ రాజధానిలో జరిగిన ఈ ‘బిమ్‌స్టెక్’ సమావేశం మరింత ప్రాధాన్యం సంతరించుకొంది. ‘బిమ్‌స్టెక్’ సభ్య దేశాలు మన దేశానికి ఇరుగు పొరుగున ఉన్న దేశాలు. గత నాలుగేళ్లుగా ‘బిమ్‌స్టెక్’ అధ్యక్ష బాధ్యతలను నిర్వహించిన నేపాల్ ఈ సమావేశం ముగింపు దశలో పదవీ బాధ్యతలను శ్రీలంకకు అప్పగించింది. ఐదవ ‘బిమ్‌స్టెక్’ సమావేశం శ్రీలంకలో జరుగనుంది. గత ఎనిమిది, తొమ్మిదేళ్లుగా శ్రీలంకలో చైనా వ్యూహాత్మక విస్తరణ సాగిస్తోంది. ఈ ‘విస్తరణ’ మన దేశపు భద్రతకు భంగకరంగా పరిణమించి ఉంది. అందువల్ల ‘బిమ్‌స్టెక్’ కేంద్ర బిందువుగా అటు శ్రీలంకతోను ఇటు నేపాల్‌తోను తరతరాల మైత్రిని మరింత పెంపొందించుకొనడానికి మన దేశం కృషిచేస్తోంది..
ఆసియా దక్షిణ, తూర్పు ప్రాంతాల దేశాలతో ‘సాన్నిహిత్యం’- కనెక్టివిటీ- మరింతగా దృఢతరం చేసుకొనడం మన దేశం లక్ష్యమని ‘బిమ్‌స్టెక్’ సదస్సులో మన ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించడం ‘ఇరుగు పొరుగు’మైత్రికి మనం ఇస్తున్న ప్రాధాన్యానికి మరో ధ్రువీకరణ. ఈ ‘ఇరుగు పొరుగు’ మైత్రిని చెడగొట్టడానికి చైనా నిరంతరం తన పన్నాగాన్ని కొనసాగిస్తోంది. ఈ ‘సాన్నిహిత్యం’ మన దేశానికీ ఇరుగు పొరుగు దేశాలకూ మధ్య ప్రయాణ, రవాణా వ్యవస్థల ద్వారా ప్రస్ఫుటిస్తోంది. ఈ ‘సాన్నిహిత్యం’ ‘బిమ్‌స్టెక్’ దేశాల మధ్య ఇంధన, విద్యుత్ తదితర వౌలిక ‘శక్తి’ సదుపాయాలతో అనుసంధానమై ఉంది. ‘బిమ్‌స్టెక్’ సమావేశం శుక్రవారం విడుదల చేసిన ‘ఖాట్మండూ ఉద్ఘోషణ’- ఖాట్మండూ డిక్లరేషన్-లో ‘బీభత్సకాండ నిర్మూలన’ తరువాత ప్రాధాన్యం సంతరించుకున్న అంశం ఇంధన అనుసంధానం. రహదారులు, రైలుమార్గాలు, ఇంధన తైలం, ఇంధన, వాయువు, విద్యుచ్ఛక్తి ఆర్థిక ప్రగతికి ప్రధానమైన ప్రాతిపదికలు. బ్రిటన్ దురాక్రమణ పూర్వయుగంలో ‘్థయ్‌లాండ్’ తప్ప మిగిలిన ‘బిమ్‌స్టెక్’ దేశాలన్నీ ఒకే ‘రాజ్యాంగ విభాగం’గా, ఒకే భౌగోళిక విభాగంగా, ఒకే దేశంగా ఉండడం చరిత్ర. ఈ సమీకృత రాజ్యాంగ వ్యవస్థలో లేకపోయినప్పటకీ ‘్థయ్‌లాండ్’ దేశం ‘విస్తృత హిందూ సాంస్కృతిక భౌగోళిక విభాగం’- గ్రేటర్ భారత్-లో తరతరాలుగా భాగం. ఇప్పటికీ రామాయణ, మహాభారత చారిత్రక సాన్నిహిత్యం భారత్, థాయ్‌లాండ్ దేశాల ప్రజాజీవనాన్ని నిరంతరం అనుసంధానం చేస్తోంది. నరేంద్ర మోదీ ఖాట్మండూ సదస్సులో పునరుద్ఘాటించిన ‘పూర్వ దిశా కార్యాచరణ’- యాక్ట్ ఈస్ట్ - విధానానికి ‘్థయ్’ ప్రజలతో భారతీయుల ఈ సాంస్కృతిక అనుబంధం ప్రాతిపదిక..
ఇదంతా పాకిస్తాన్‌కు నచ్చని వ్యవహారం, చైనాకు గిట్టని పరిణామ క్రమం. 1997లో ‘బిమ్‌స్టెక్’ ఏర్పడిన నాటి నుంచీ దశాబ్దికి పైగా దాదాపు నిద్రాణంగానే ఉన్న ‘బిమ్‌స్టెక్’ గత నాలుగైదు ఏళ్లుగా ఈ ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకొనడానికి కృషి చేస్తోంది. ‘బిమ్‌స్టెక్’ అన్న ‘పరిభాష’- బే ఆఫ్ బెంగాల్ ఇన్షియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్- బంగళాఖాత దేశాల బహుళరంగ సాంకేతిక ఆర్థిక సహకార కార్యాచరణ సమాఖ్య-అన్న దానికి సంక్షిప్తీకరణ.. మన దేశం, శ్రీలంక, బంగ్లాదేశ్, బర్మా, నేపాల్, భూటాన్, థాయ్‌లాండ్ దేశాలు ‘బిమ్‌స్టెక్’లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సమాఖ్య- సౌత్ ఆసియా రీజినల్ కోఆపరేషన్- సార్క్- పరిధిలోని పాకిస్తాన్ ఇందులో లేదు. ‘సార్క్’ పరిధిలో లేని థాయ్‌లాండ్ ‘బిమ్‌స్టెక్’లో ఉంది. పాకిస్తాన్, చైనాలు లేని ఒక ఆసియా ప్రాంతీయ సమాఖ్య ఏర్పడడం చైనా ‘విస్తరణ’ ప్రమాదాన్ని, వ్యూహాత్మక దురాక్రమణను ప్రతిఘటించడానికి దోహదం చేస్తున్న భారతీయ దౌత్య విజయం..
మావోయిస్టులు చైనా చంకబిడ్డలు. నేపాల్ ప్రజలు యుగాలుగా హైందవ జాతీయ సాంస్కృతిక స్రవంతికి చెందినవారు. బ్రిటన్ దురాక్రమణ ఫలితం నేపాల్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్, అప్ఘానిస్థాన్, మాల్ దీవులు, బంగ్లాదేశ్, బర్మా వంటి ‘అఖండ భారత’ప్రాంతాలు స్వతంత్ర దేశాలుగా రూపొందడం. ఈ రాజకీయపు సరిహద్దులతో నిమిత్తం లేకుండా ‘అవశేష’ భారత్‌కూ నేపాల్‌కూ మధ్య హైందవ జాతీయ సాంస్కృతిక సమానత్వం నెలకొని ఉంది. ‘బిమ్‌స్టెక్’ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ ‘సమానత్వం’ మరోసారి ప్రస్ఫుటించింది. ఖాట్మండూలోని పశుపతినాథ మందిర సందర్శనకు వస్తున్న యాత్రికుల సౌకర్యార్థం మన దేశం కొత్తగా ఒక బృహత్ ‘్ధర్మశాల’- సత్రం-ను నిర్మించింది. ఈ ‘్ధర్మశాల’ను శుక్రవారం నరేంద్ర మోదీ నేపాల్‌కు కానుకగా సమర్పించడం ‘సాంస్కృతిక సాన్నిహిత్యం’- కర్చలల్ కనెక్టివిటీ- మరింత పెరగడానికి దోహదం చేస్తోంది. నేపాల్ ప్రధాని ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ సమక్షంలో ప్రసంగించిన మోదీ ఈ సాంస్కృతిక సాన్నిహిత్యం గురించి మరోసారి గుర్తుచేయగలిగాడు. సోమనాథ్, వారణాసి విశ్వనాథ్, పశుపతినాథ్‌లు ఈ సమాన సాంస్కృతిక బంధానికి ప్రతీకలు. అయోధ్య, జనక్‌పురి మధ్య, పూరీ జగన్నాథ్‌కూ, నేపాల్‌లోని ముక్తినాథ్ క్షేత్రానికి మధ్య నెలకొన్న సాంస్కృతిక సమానత్వం మరోసారి స్ఫురణకు వచ్చింది. కన్యాకుమారి నుంచి సాగరమాత- ఎవరెస్టు- గౌరీశంకర శిఖరం వరకూ, కాంచన గంగ వరకూ ఈ సాంస్కృతిక సమానత్వం నెలకొని ఉంది. శ్రీలంకలోని ‘శాంకరీదేవి’ కైలాస పర్వతం వరకూ ప్రస్థానం చేసి పరమశివుణ్ని చేరింది. ‘బిమ్‌స్టెక్’ దేశాల మధ్య సాన్నిహిత్యానికి ఆర్థిక భౌగోళిక రక్షణ వ్యూహాత్మక ప్రాతిపదికలున్నాయి. వీటి అన్నింటి కంటె మేలైన ప్రాతిపదిక సమాన సాంస్కృతిక వారసత్వ సంపద..