బిజినెస్

మూడోరోజూ ఫ్లాట్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* దెబ్బతీసిన వాణిజ్య ఉద్రిక్తతలు
ముంబయి, ఆగస్టు 31: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ బలహీనంగా ఉండటం దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్‌ల కాంట్రాక్టులు బలహీనంగా ప్రారంభం కావడంతో పాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం మరింత పడిపోయి తొలిసారి 71 మార్కుకన్నా దిగువకు దిగజారడం దేశీయ మార్కెట్ల కీలక సూచీలు పడిపోవడానికి తోడ్పడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 45 పడిపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ స్వల్పంగా 3.70 పాయింట్ల ఎగువన స్థిరపడింది. అయితే, నెల రీత్యా చూస్తే వరుసగా అయిదో నెల దేశీయ మార్కెట్లు లాభపడ్డాయి. 2016 ఆగస్టు తరువాత మార్కెట్లు వరుసగా ఇన్ని నెలల పాటు బలపడటం ఇదే మొదటిసారి. వారం రీత్యా చూస్తే మార్కెట్ కీలక సూచీలు బీఎస్‌ఈ సెనె్సక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ రెండూ కూడా వరుసగా ఆరో వారం పుంజుకున్నాయి. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో సెనె్సక్స్ 393.27 పాయింట్లు (1.02 శాతం) పుంజుకోగా, నిఫ్టీ 123.40 పాయింట్లు (1.07 శాతం) పెరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనానుంచి దిగుమతులపై సుంకాలను మరింత పెంచడానికి సిద్ధమవుతున్నట్టు వచ్చిన వార్తలు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 71 మార్కుకన్నా కిందికి దిగజారడం కూడా దేశీయ స్టాక్ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసిక దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు వెలువడనుండటం వల్ల కూడా మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. శుక్రవారం మార్కెట్ పనివేళలు ముగిసిన తరువాత జీడీపీ గణాంకాలు వెలువడ్డాయి.బీఎస్‌ఈ సెనె్సక్స్ శుక్రవారం 38,838.45- 38,562.21 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 45.03 పాయింట్ల (0.12 శాతం) దిగువన 38,645.07 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం రెండు సెషన్లలో కలిసి 206.53 పాయింట్లు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఊగిసలాటలో సాగినప్పటికీ, క్రితం ముగింపుతో పోలిస్తే అతి స్వల్పంగా 3.70 పాయింట్ల (0.03 శాతం) ఎగువన 11,680.50 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో ఈ సూచీ 11,727.65- 11,640.10 పాయింట్ల మధ్య కదలాడింది. ఇదిలా ఉండగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) గురువారం నికరంగా రూ. 1,598.67 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 958.01 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.