బిజినెస్

ఐడియా, వొడాఫోన్ విలీనం సంపూర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశ టెలికాం రంగంలో అతి పెద్ద సంస్థ అవతరించింది. ఇడియా సెల్యులార్ లిమిటెడ్, వొడాఫోన్ పీఎల్‌సీ విలీనం ప్రక్రియ శుక్రవారం పూర్తికావడంతో, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ మనుగడిలోకి వచ్చింది. దేశంలోనే అతి పెద్ద టెలికాం సంస్థగా రికార్డు సృష్టించింది. ప్రధానంగా రిలయెన్స్ జియో పోటీని ఎదుర్కోవడానికి ఐడియా, వొడాఫోన్ విలీనమయ్యాయి. ఈ రెంటికీ కలిపి సుమారు 40.8 కోట్ల మంది ఖాతాదారులున్నారు. దేశంలో ఇంత వరకూ అతి పెద్ద టెలికాం సంస్థగా ఉన్న భారతి ఎయిటెల్‌ను రెండో స్థానానికి నెట్టేసిన వొడాఫోన్ ఐడియా ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఐడియా సెల్యులార్‌ను నెలకొల్పిన ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం ఈ కొత్త వొడాఫోన్ ఐడియా కంపెనీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కంపెనీలో 12 మంది డైరెక్టర్లు ఉంటారు. రెండు కంపెనీలు కలిపి సంయుక్తంగా బాలేష్ శర్మను సీఈవోగా ఎంపిక చేశాయి. ఐడియా సెల్యులార్‌లో మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేసిన హిమాంశు కపానియా తన పదవికి రాజీనామా చేశారు. అయితే, కొత్త కంపెనీలో ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. విలీనం కారణంగా సంస్థాగత ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని, ఫలితంగా రిలయెన్స్ జియోకు అన్ని విధాలా గట్టిపోటీని ఇవ్వచ్చని వొడాఫోన్ ఐడియా భావిస్తున్నది. సుమారు 14,000 కోట్ల రూపాయల మేర ఖర్చులను పొదుపుచేయవచ్చని అంచనా వేస్తున్నది. అమల్లో ఉన్న ధరల కంటే చాలా తక్కువ ధరలకే ఉచిత వాయిస్ కాల్స్‌తోపాటు ఫోర్ జీ నెట్ సౌకర్యాన్ని కూడా జియో కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీనితో దేశంలోని ఇతర ప్రధాన టెలికాం కంపెనీలు ఇరుకున పడ్డాయి. కొన్ని కంపెనీల ఉనికే కనిపించకుండా పోయింది. రెండేళ్ల కాలంలోనే జియో 23 కోట్ల మంది ఖాతాదారులను సంపాదించుకుంది. ఈ మార్పుతో కంగుతిన్న భారతి ఎయిర్‌టెల్ వెంటనే స్పందించింది. మన దేశంలో సేవలు అందిస్తున్న నార్వేకు చెందిన టెలినార్‌ను విలీనం చేసుకుంది. ఆతర్వాత కాలంలో టాటా టెలిసర్వీసెస్ లిమిటెడ్ (టీటీఎస్‌ఎల్), టాటా టెలిసర్వీసెస్ మహారాష్ట్ర (టీటీఎంఎల్) సంస్థలను కూడా సొంతం చేసుకుంది. దేశ మొబైల్ మార్కెట్‌లో 35 శాతం వాటాతో, అతి పెద్ద కంపెనీగా అవతరించింది. అయితే, వొడాఫోన్ ఐడియా ఇప్పుడు సులభంగానే భారతి ఎయిర్‌టెల్‌ను రెండో స్థానానికి నెట్టేసింది. ఇలావుంటే, విలీనం ద్వారా వొడాఫోన్‌కు 82,800 కోట్ల రూపాయలు, టాటా సెల్యులార్‌కు 72,200 కోట్ల రూపాయల మేరకు ఎంటర్‌ప్రైజ్ విలువలో లాభపడనున్నాయి. 4.90 శాతం వాటాలకు తాజాగా 3,900 కోట్ల రూపాయలు చెల్లించడం ద్వారా ఐడియా సెల్యులార్‌కు తాజా కంపెనీలో వాటా 26 శాతానికి పెరిగింది. కాగా, వొడాఫోన్ ఐడియాకు దేశ వ్యాప్తంగా 84 కోట్ల మంది ఉపయోగిస్తున్న 3,40,000 బ్రాడ్‌బ్రాండ్ సైట్లు ఉంటాయి. దేశ జనాభాలో 92 శాంతానికి సేవలు అందించగలిగే 2,00,000 జీఎస్‌ఎం సైట్ల బలం ఉంటుంది.