క్విజ్

ఏ జిల్లాకు ప్రకాశం పేరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1. ప్రకాశం పంతులు బారిస్టర్ చదువుకోసం ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు, ఏ వ్యక్తి బ్రిటీష్ పార్లమెంటుకు ఎన్నిక కావడానికి ప్రచారంలో పాలు పంచుకొన్నారు?
ఎ) అనిబిసెంట్ బి) మేడం బికాజీ కామ
సి) మోతీలాల్ నెహ్రూ డి) దాదాభాయ్ నౌరోజీ

2. టంగుటూరి ప్రకాశం పంతులు ఆగస్టు 23, 1872న జన్మించారు. ఆయన గురించి కింది వానిలో ఏది సరైనది?
ఎ) రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
బి) అతను మిశ్రమ మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టారు.
సి) రాజాజీ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా చేశారు మరియు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా నియమితుడయ్యారు.
డి) పైవన్నియు

3. బారిస్టర్ ప్రకాశం న్యాయవాదిగా లాభదాయకమైన ప్రాక్టీస్ విడిచిపెట్టి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. అతను ఏ పత్రికలకు సంపాదకత్వం వహించేవారు?
ఎ) లా టైమ్స్ అనే న్యాయవాద పత్రిక, కేసరి దినపత్రిక
బి) లా టైమ్స్ అనే న్యాయవాద పత్రిక, స్వరాజ్య అనే దినపత్రిక
సి) స్వరాజ్య అనే దినపత్రిక, ఆంధ్రపత్రిక
డి) లా టైమ్స్ అనే న్యాయవాద పత్రిక, ఆంధ్రపత్రిక

4. క్రీడాకారుడు, అడ్వకేట్, సంపాదకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, నాయకుడిగా టంగుటూరి జీవిత చరిత్ర నుంచి భవిష్యత్తు తరాల వారికి ప్రేరణ కలుగుతుంది. ఆంధ్రకేసరి జీవిత చరిత్ర పేరేమిటి?
ఎ) నా జీవిత యాత్ర
బి) అమరజీవి టంగుటూరి ప్రకాశం పంతులు
సి) ఆంధ్రకేసరి చరిత్ర డి) నా జీవిత ప్రయాణం

5. ప్రకాశం పంతులు జాతికి చేసిన సేవలకు గుర్తుగా 1972లో ఏ జిల్లాకు ప్రకాశం జిల్లాగా పేరు పెట్టారు?
ఎ) చీరాల బి) మార్కాపురం
సి) కనిగిరి డి) ఒంగోలు

6. ఆంధ్ర రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన హయాంలో ఏ విశ్వవిద్యాలయం స్థాపనకు నడుం కట్టి బాధ్యత వహించారు?
ఎ) కాకతీయ విశ్వవిద్యాలయం
బి) సెంట్రల్ యూనివర్శిటీ, హైదరాబాద్
సి) శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం
డి) నాగార్జున విశ్వవిద్యాలయం

7. టంగుటూరిగారు ఆంధ్రరాష్ట్రం మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రింది వానిలో ఏవి నిర్మాణానికి నోచుకున్నాయి?
ఎ) నాగార్జున సాగర్ ప్రాజెక్టు
బి) ప్రకాశం బారేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్
సి) గుంటూరులో హైకోర్ట్
డి) పైవన్నియు

8. ఆంధ్రప్రదేశ్‌కు కర్నూలు రాజధానిగా ఎంపిక చేసుకున్నందుకు చాలామంది ప్రజలు అసంతృప్తికి గురయ్యారు. ప్రాంతీయ సమతుల్యతను కాపాడటానికి, ఆంధ్ర అసెంబ్లీ ఒక సమావేశం ఆంధ్రకేసరి ఎక్కడ నిర్వహించారు?
ఎ) మహారాజకోట, విజయనగరం
బి) కోటగుమ్మం, రాజమండ్రి
సి) ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, వాల్టర్‌లో జరిగింది
డి) కలెక్టర్ ఆఫీస్, శ్రీకాకుళం

9. టంగుటూరి ప్రకాశం ధైర్యం, పోరాటపటిమ, త్యాగం, పరిపాలనా దక్షత ద్వారా అశేష తెలుగు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు, ఆయన చిరస్మరణీయుడుగా ఉంటారు. మద్రాస్ ప్రెసిడెన్సీ రెవెన్యూ మంత్రి మరియు ముఖ్యమంత్రిగా ప్రకాశంగారు ఏ సంస్కరణలను ప్రవేశపెట్టారు?
ఎ) జమీందారీ వ్యవస్థ రద్దు
బి) ఫిర్కా డెవలప్మెంటు స్కీమ్
సి) హరిజనుల అభ్యున్నతి నిధి (హరిజన్ అప్లిఫ్ట్ ఫండ్)
డి) పైవన్నియు

గత వారం క్విజ్ సమాధానాలు
1. డి 2. ఎ 3. డి 4. ఎ 5. డి 6. బి 7. డి 8. సి 9. ఎ 10. డి

-సునీల్ ధవళ 97417 47700