కళాంజలి

నాట్య మయూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డా. విజయ్‌పాల్ పాత్‌లోత్ ప్రఖ్యాత నర్తకుడు, గురువు, పరిశోధకుడు, రచయిత. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నృత్యశాఖలో 2009 నుండి బోధిస్తున్నారు. వీరి నృత్య శిక్షణాలయం- ‘పాత్‌లోత్ కళాక్షేత్ర’. ఇందులో దీక్షతో నేర్చుకునే విద్యార్థులకు నృత్యం నేర్పిస్తున్నారు. డా.విజయ్‌పాల్ ‘డాన్స్ థెరపీ విత్ స్పెసిఫిక్ రెఫరెన్స్ టు హస్తముద్ర థెరపీ’ అనే పరిశోధనాంశంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి పిహెచ్‌డి పొందారు. దేశ విదేశాలలో వేల నృత్య ప్రదర్శనలిచ్చారు. అయినా డా.విజయ్ నిండుకుండలా ఉంటారు. వీరు ఎన్నో పాత్రలకు జీవం పోసి, ప్రేక్షకులకు రసాస్వాదన చేశారు. అన్నిటికీ మించి డా. విజయ్‌పాల్ మంచి మనిషి! వీరి మాట సున్నితం, మనస్సు నవనీతం.
డా.విజయ్‌పాల్ పాత్‌లోత్ దేశ విదేశాలలో నృత్యప్రదర్శనలిచ్చారు. నృత్యంలో ఎక్కడ విద్యార్థిగా ఎం.ఏ కూచిపూడి చేశారో, అక్కడే అదే తెలుగు విశ్వవిద్యాలయంలో 2009 నుండి బోధనా సిబ్బందిలో చేరి నృత్య శాఖలో పనిచేస్తున్నారు. నేడు పేరు పొందిన కళాకారుల్లో డా.విజయ్ పాల్ తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నారు.
గురువు: డా. విజయ్‌పాల్ పాత్‌లోత్ శ్రీ చింతా ఆదినారాయణ శర్మగారి వద్ద నాట్యాభ్యాసం మొదలుపెట్టారు. తరువాత శ్రీమతి ప్రసన్నారాణి, మంజుభార్గవి, ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల, ప్రొఫెసర్ భాగవతుల సేతురాం, ప్రొఫెసర్ అనూరాధ వద్ద ఎంతో నేర్చుకున్నారు. కీ.శే.మహంకాళి మోహన్‌గారి వద్ద నట్టువాంగం నేర్చుకున్నారు. కీ.శే.పద్మభూషణ్ డా.వెంపటి చినసత్యంగారి ఏకలవ్య శిష్యుడని అంటారు డా.విజయ్‌పాల్. కీ.శే. పద్మశ్రీ నటరాజ రామకృష్ణ, శ్రీ కళాకృష్ణ, పద్మభూషణ్ డా.స్వప్నసుందరి, పద్మశ్రీ డా.శోభానాయుడు, ప్రొఫెసర్ పసుమర్తి రామలింగశాస్ర్తీ, ప్రొఫెసర్ అరుణాభిక్షు, డా. కె.వి.సత్యనారాయణ, డా.వేదాంతం రామలింగశాస్ర్తీ, డా. వనజ ఉదయ్, డా.రత్నశ్రీ, డా.సుధాకర్- ఇలా ఎంతోమంది వద్ద ఎంతో నేర్చుకున్నారు. స్వయంగా పాత్‌లోత్ కళాక్షేత్ర స్థాపించి ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దుతున్నారు.
విదేశాలు: యుకెటిఎ- యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్, లైకెస్టర్ మిడ్‌లాండ్, కార్డ్ఫి, వేల్స్, మిల్లన్‌కీన్స్, ఇంగ్లాండ్, లండన్, యుకె, 2008లో లాహోర్- పాకిస్తాన్ వరల్డ్ పెర్పార్మింగ్ ఆర్ట్స్ ఫెస్టివల్, ఇటిఎ- యూరోపియన్ తెలుగు అసోసియేషన్ అక్టోబర్ 2009, బర్మింగ్‌హామ్, స్టాక్ ఆన్‌ట్రెండ్‌లో నృత్యప్రదర్శనలిచ్చి మన భారతీయ సంస్కృతిని ప్రచారం చేశారు. యుకె, యుఎస్‌ఎ, యూరోపు, మలేసియా, సింగపూర్, పాకిస్తాన్, ఒమన్ మొదలగు ఎన్నో విదేశాలలో నృత్యప్రదర్శనలిచ్చారు.
ఎన్నో గౌరవాలు
జూనియర్ రీసెర్చి ఫెలోషిప్- జెఆర్‌ఎఫ్, ఎన్‌ఇటి లెక్చరర్ షిప్- యుజిసి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బంగారు పతకం-ఎం.్ఫల్, జానపద కళలు- కొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. గ్రేడెడ్ ఆర్టిస్టు- దూరదర్శన్, నేషనల్ నృత్య శిరోమణి-ఉత్కళ యువ సాంస్కృతిక సంఘం, నాట్యమయూరము-నృత్యతి కళాక్షేత్రం- భిలాయి, ఛత్తీస్‌ఘడ్, నాట్యకౌముది- అభినయ నృత్య భారతి, ఏలూరు, ఆం.ప్ర., భారతీయ నాట్యమయూరి-కళా నిలయం, చిలకలూరిపేట, ఆం.ప్ర.
విద్యాభ్యాసం: పిహెచ్‌డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నృత్యశాఖనుండి డాన్స్ థెరపీ విత్ స్పెసిఫిక్ రెఫరెన్స్ టు హస్త ముద్ర థెరపీ అనే పరిశోధనాంశంతో చేశారు.
ఎం.పిల్- జానపద శాఖ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంనుండి చేశారు.
ఎం.్ఫల్- టూరిజం మేనేజ్‌మెంట్, మధురై కామరాజు యూనివర్సిటీ, మధురై, తమిళనాడు నుండి చేశారు.
ఎం.ఏ కూచిపూడి నృత్యం- నృత్యశాఖ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంనుండి.
ఎం.బి.ఎ- హ్యూమన్ రిసర్సెస్ ఎండ్ మార్కెటింగ్- ఉస్మానియా విశ్వవిద్యాలయం-
రూపకల్పన (కొరియోగ్రఫి) ఎన్నో నృత్యరూపకాలకి డా.విజయ్‌పాల్ పాత్‌లోత్‌గారు రూపకల్పన చేశారు. అందులో కొన్ని:-
సప్తతాండవం, రమ్యం దశవిధ రూపం, కూచిపూడి వైభవం, నాట్యవైభవం, మిళిత నాట్యం, నాట్య సంగమం, విఘ్నేశ్వర వైభవం, ఎన్నో నృత్యాంశాలకి రూపకల్పన చేశారు. టెలీ డాన్స్ సీరియల్, ఆముక్త మాల్యద- ఎస్‌విబిసి ఛానల్‌లో వచ్చింది. దీనికి డా. విజయ్‌పాల్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు.
ప్రఖ్యాత నర్తకులతో ప్రదర్శన
పద్మభూషణ్ శ్రీమతి స్వప్నసుందరి, పద్మశ్రీ డా.శోభానాయుడు, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డా.ఉమా రామారావు, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ప్రొ. డా. అలేఖ్య పుంజాల, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత కళాకృష్ణ, కళారత్న శ్రీమతి మంజుభార్గవి, ప్రొ. డా. భాగవతుల సేతురాం, కళారత్న కె.వి.సత్యనారాయణ, ప్రొ. రామలింగశాస్ర్తీ, ప్రొ.అరుణా భిక్షు, శ్రీ చింతా ఆదినారాయణ శర్మ, శ్రీ మహంకాళి మోహన్, కళారత్న డా.వనజ ఉదయ్, డా.సుధాకర్, డా.రత్నశ్రీ, శ్రీ సౌమిత్రి, శ్రీమతి ప్రసన్నారాణి, శ్రీమతి మంజు హేమామాలిని, కళారత్న డా.జి.పద్మజారెడ్డి, శ్రీ రాఘవరాజ్ భట్టు వంటి ఎంతోమంది ప్రఖ్యాత గురువులు, నర్తకులతో డా.విజయ్‌పాల్ పాత్‌లోత్ నర్తించారు.
నృత్యరూపకాలు
ఆంధ్ర, తెలుగు వైభవం, శ్రీనివాస కళ్యాణం, సర్వం సాయిమయం, నవరస నటభామిని, శ్రీలలితా నృత్యార్చనం, పంచకావ్య, పంచకన్య, ఆముక్త మాల్యద, కాలార్చన, నాట్యవైభవం, నాట్యసంగమం, మిళితనాట్యం, దశావతారం, కూచిపూడి వైభవం, మహానదుల మణిహారం, కళ్యాణ శ్రీనివాసం, గజాననీయం, శశిరేఖా పరిణయం, రామకథాసారం, లకుమా స్వాంతం, రాత్‌ఫూల్‌కీ, విఘ్నేశ్వర వైభవం, మోహినీ భస్మాసుర, రమ్యం దశవిధ రూపం, శివగంగ, కాణీపాక వినాయకం, కల్చరల్ ఇంటిగ్రిటీ, చంబబాల, అన్నమయ్య, కాళికా విజయం, శ్రీపదార్చన, అర్థనారీశ్వరం, వేమన శతకం, రాధా మాధవీయం, తరతరాల తిరుపతి, సిద్ధేంద్ర యోగి, జాగృతి, వజ్రభారతి, అన్నమయ్య పద నర్తన శోభ, భామాకలాపం, శ్రీకృష్ణ పారిజాతం, శ్రీకృష్ణ వసంతం, స్తంభాద్రివైభవం, లక్ష్మణరేఖ, ప్రబంధం, కూచిపూడి మహత్వం మొదలగు ఎన్నో నృత్య రూపాకాల్లో ప్రదర్శించారు.
ఎన్నో పాత్రలు: డా.విజయ్‌పాల్ పాత్‌లోత్ ఎన్నో పాత్రలకు జీవం పోశారు. వీరి ప్రదర్శనలో ఏకమై లీనమై తాదాత్మ్యం చెంది, ప్రేక్షకులు రసాస్వాదన చేశారు. వీరు ప్రదర్శించిన కొన్ని పాత్రలు- విష్ణువు, శివుడు, బ్రహ్మ, శ్రీకృష్ణుడు, రంగనాథస్వామి, శ్రీరాముడు, ఇంద్రుడు, నారదుడు, మాయాఇంద్రుడు, సప్తఋషి, అర్జునుడు, కాలపురుషుడు, ప్రవరాఖ్యుడు, నిగమశర్మ, చోళరాజు, ఆకాశరాజు, చంబరాజు, కాటమరాయుడు, నానావళి, విష్ణుచిత్తుడు, రామదాసు, ఆస్థాన నర్తకుడు, ఆస్థాన కవి, సూత్రధారి, వానరసేన, ప్రమథగణం, అల్లూరి సీతారామరాజు, భారత, భావకులు, సత్యభామ, ఆస్థాన నర్తకి, అగస్త్య మహాముని మొదలగు ఎన్నో పాత్రలు పోషించారు.
ఇతర బాధ్యతలు: ఎన్నో లెక్చర్ డెమాస్ట్రేషన్స్ చేశారు. వర్క్‌షాప్స్ నిర్వహించారు. నృత్యశిక్షణ శిబిరాలు నిర్వహించారు. ఎన్నో కమిటీల్లో జడ్జిగా, జ్యూరీ మెంబర్‌గా ఉన్నారు. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. దేశ విదేశాల్లో 1500కుపైగా నృత్య ప్రదర్శనలిచ్చారు.

ప్రచురణలు:2018లో లంబాడా ద యూనిఫైడ్ కల్చరల్ హెరిటేజ్, ఆయు పబ్లికేషన్స్, న్యూ ఢిల్లీద్వారా ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నంది అవార్డును, ఉగాది పురస్కారాలు పొందారు.

-డాక్టర్ శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి