మీ వ్యూస్

సరికాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివాహం అయిన తర్వాత సమంతను సమంత అక్కినేని అని మీడియా పేర్కొనడం సరికాదు. తెలుగు రాష్ట్రాల్లో వివాహిత ఇంటి పేరు మారుతుంది. కాని తమిళులు, మలయాళీలు, ఉత్తరాదివారు, క్రైస్తవులకు ఇంటి పేరు ఉండదు. సొంత పేరు పక్కన తండ్రి పేరు లేదా భర్త పేరు వస్తుంది. సమంత క్రైస్తవ మలయాళీ. ఆమెకు ఇంటి పేరు లేదు. భర్త నాగచైతన్యను చై అని గాని చైతూ అని గాని పిలుస్తూ ఉంటారు. అందువల్ల సమంత చై లేదా సమంత చైతూ అనడం మంచిది. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తెను కళ్యాణి ప్రియదర్శన్ అనాలి కానీ కొందరు కళ్యాణి ప్రియదర్శిని అంటున్నారు. ఇదీ తప్పే.

- గునే్నశ్, కొవ్వాడ

దటీజ్..సుబ్బరాజు!

ఎస్.ఎస్.రాజవౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బహుబలి చిత్రాలతో ప్రభాస్ కీర్తి ఎక్కడికో వెళ్లిపోయింది. అతనికి ఆఫర్లమీద ఆఫర్లు వచ్చేస్తున్నాయంటూ మన మీడియా బాకాలుదాయి. కానీ జపాన్‌లో రజనీకాంత్ తర్వాత అంత క్రేజ్ సాధించినవాడు బాహుబలిలో కుమారవర్మగా నటించిన సుబ్బరాజు! మిగిలినవారు సూపర్ హీరోల్లాగ అసహజంగా ఉంటే సుబ్బరాజు పాత్ర సహజంగా ఉండి వారికి బాగా నచ్చింది. ఆ పాత్ర పిరికివాడు. యుద్ధం అంటే వణికిపోయేవాడు. పిరికిపందగా కనిపించినా చివరకు తెగించి ధైర్యం కూడగట్టుకొని తెగించి ఫైటింగ్ చేయ