రివ్యూ

@నవ్వులశాల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

@నర్తనశాల ** ఫర్వాలేదు

తారాగణం:

నాగశౌర్య, కశ్మీర పరదేశి యామిని భాస్కర్, శివాజీరాజా ప్రియ, జయప్రకాశ్‌రెడ్డి
సుధ, అజయ్, రాకెట్ రాఘవ సత్యం రాజేష్, జెమిని సురేష్ ఉత్తేజ్, తిరుపతి ప్రకాష్
పద్మాజయంతి, మాధురి తదితరులు.
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఆర్ట్: కిరణ్‌కుమార్ మనె్న
ఫైట్స్: విజయ - మల్లేష్
లైన్ ప్రొడ్యూసర్: బుజ్జి
సంగీతం: మహతి స్వరసాగర్
సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్
సమర్పణ: శంకర్‌ప్రసాద్
నిర్మాణం: ఐరా క్రియేషన్స్
నిర్మాత: ఉషా మల్పూరి
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీనివాస్ చక్రవర్తి

= = = = = = = = = = = = = = = = = = = === ===

తెలుగు చిత్రసీమలో మన హీరోలు వీళ్లే.. అని చెప్పుకుంటున్న చాలామంది కథానాయకులు రొటీన్ క్యారెక్టర్‌లనే చేసుకుంటూ వైవిధ్యానికి దూరంగా ఉంటున్నారు. పాత్రల ఎంపికలో ఏ మాత్రం కొత్తదనం చూపించకుండా ప్రేక్షకుల్ని బోర్ కొట్టిస్తున్నారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తాపడుతున్నారు. చేసే ప్రతి చిత్రంలో తమ క్యారెక్టర్ వెరైటీగా వుండాలనీ, ఆ క్యారెక్టర్‌లో లీనమై ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవాలన్న తపన, ఆరాటం నేటి హీరోల్లో కొరవడింది. ఏదో చేశామంటే చేశాం అని హీరోలు.. చూశామంటే చూశాం.. అని ప్రేక్షకులు ఇలా కానిచేస్తున్నారు. ఇదీ..నేటి టాలీవుడ్‌లో మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్న వైనం. అందుకే ఈ మూసకు తట్టుకోలేక బాక్సాఫీస్ సైతం వెలవెలబోతోంది. ఈ వైనానికి భిన్నంగా మనం నాగశౌర్య చిత్రాలను చూడొచ్చు. ఆయా చిత్రాల్లో అతడి పాత్రలను పరిశీలించొచ్చు. ఆ క్యారెక్టర్లలో ఆయన హావభావాలను చూసి వాహ్..అనొచ్చు. టాలీవుడ్‌లో తొలినుంచీ విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటున్నాడు నాగశౌర్య. అతడికి వచ్చిన లవర్‌బాయ్ ఇమేజ్‌ని పక్కనపెట్టి పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తున్నాడు. నవతరం కథానాయకుల మధ్య మంచి పోటీవుంది. అయితే ఎవరి శైలి వారిది. ఎవరికి తగిన కథలు వాళ్లు ఎంచుకుంటున్నారు. వినోదం, ప్రేమకథలు, యాక్షన్.. ఇలా ఏ కథకైనా న్యాయం చేయగల కథానాయకుడు నాగశౌర్య. చందమామకథలు, ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద, అమ్మమ్మగారిల్లు, కణం, ఛలో.. ఇలా తన ఖాతాలో మంచి చిత్రాలున్నాయి. ‘్ఛలో’ తన కెరీర్‌లో ఓ మైలురాయి. ఆ సినిమాతోనే ‘ఐరా క్రియేషన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు చేశాడు. హీరోగా నిలదొక్కుకుంటున్న తరుణంలోనే ఇలా నిర్మాతగా మారి తొలిప్రయత్నంగా ‘్ఛలో’తో విజయాన్ని అందుకోవడంతో అదే ఊపుని బనర్తనశాలతో కొనసాగించే ప్రయత్నం చేశాడు. తొలిసారిగా ఏ హీరో కూడా డేర్ చేయని ‘గే’ పాత్రను ఎంచుకోవడం అతడు చేసిన సాహసమే! సాధారణంగా ఇలాంటి క్యారెక్టర్లు పోషించాలంటే ఏ హీరోకైనా దమ్మూ, ధైర్యం కావాలి. చాలా మంది హీరోలు ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్లు చేసేముందు సంకోచిస్తారు. కానీ, నాగశౌర్య ఈ ‘గే’ పాత్రను ఓ సవాల్‌గా స్వీకరించాడు. అంతేకాదు, సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నర్తనశాల’ సినిమా టైటిల్ పెట్టడం, హీరోగా ‘గే’ పాత్రలో కనిపించడం.. ఇవన్నీ చిత్రంపై అంచనాలను పెంచాయి. ఐరా క్రియేషన్స్ పతాకంపై నూతన దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో నాగశౌర్య తల్లి ఉషా మల్పూరి నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ బనర్తనశాలతో నాగశౌర్య మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడా? తొలిసారి ‘గే’ పాత్రలో ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకున్నాడు? నాటి ‘నర్తనశాల’కు నేటి ‘బనర్తనశాల’కు ఉన్న సంబంధం ఏమిటి? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
కళామందిర్ కల్యాణ్ (శివాజీరాజా) అమ్మ చనిపోతుంది. అయితే తనకు కూతురు పుడితే ఆమెను అమ్మగా చూసుకోవాలనుకుంటాడు. కానీ, అతడి భార్య (ప్రియ) అబ్బాయి (నాగశౌర్య)కి జన్మనిస్తుంది. ఈ విషయం తెలిస్తే తండ్రి గుండె ఆగిపోతుందని కూతురే పుట్టిందని వాళ్ల నాన్నకు చెప్పి నమ్మించి మేనేజ్ చేస్తుంటాడు కల్యాణ్. కూతురు పుట్టాలన్న తన ఆశ నెరవేరకపోవడంతో కొడుకునే కూతురులా పెంచుతాడు. ఈ సమయంలో అమ్మపలుకు..జగదాంబ పలుకు అంటూ బుడబుక్కల వాడు (ఉత్తేజ్) ప్రత్యక్షమవుతాడు. వాడిని ఆట పట్టించాలని సరదాగా మా అమ్మాయికి ఎలాంటి మొగుడు వస్తాడో చెప్పమని అడిగిన కల్యాణ్‌కు ఊహించని సమాధానం ఎదురవుతుంది. అబ్బాయిని అమ్మాయిగా చూపించి మోసం చేస్తున్నావు.. నిజంగానే ఈ అబ్బాయికి తోడుగా అబ్బాయే వస్తాడు అని చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసి వెళ్లిపోతాడు. అలా పెద్దయ్యాక నాగశౌర్య మహిళల్లో ఆత్మ స్థయిర్యం నింపడం కోసం.. వారిలో చైతన్యం కలిగించడం కోసం సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్‌ని నిర్వహిస్తూ..తమను తాము సేవ్ చేసుకునే విధంగా వారికి శిక్షణ ఇస్తుంటాడు. ఆడ పిల్లలకు ఎలాంటి సమస్య వచ్చినా తానే ముందుండి పరిష్కరిస్తుంటాడు. అలాంటి తరుణంలోనే అతడికి మానస (కశ్మీర పరదేశి) తారాసపడుతుంది. ఆమె ఓ విచిత్రమైన సమస్యలో చిక్కుకుంటుంది. ఆ సమస్యనుంచి మానసను రక్షించి ఆమె ప్రేమలో పడతాడు నాగశౌర్య. అతడికి మరో ఊహించని సంఘటన ఎదురవుతుంది సత్య (యామిని భాస్కర్) రూపంలో. ఆమె దందాలు చేసే పెద్దమనిషి జయప్రకాష్ రెడ్డి గారాల కూతురు. తనపై దాడి చేస్తున్న యువకుల్ని సత్య మట్టికరిపిస్తుంది. అది చూసిన నాగశౌర్య ఆమె ధైర్యాన్ని, ఆమె చేసిన ఫైట్స్‌ను చూసి మెచ్చుకుంటూ ఓ సెల్ఫీ దిగుతాడు. కొడుకు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న తండ్రి కల్యాణ్, కొడుకు తెలియకుండా సత్యనే అతడు ప్రేమిస్తున్న అమ్మాయి అనుకొని సెల్ఫీలో దిగిన ఫొటో చూసి వాళ్లింటికి వెళ్లి ఆమె తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్లి సంబంధం ఖాయం చేసుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న నాగశౌర్య తను మనసారా ప్రేమించిన మానసను మర్చిపోలేక ఆ పెళ్లి నుంచి తప్పించుకునే దశలో సత్యవాళ్ల ఇంటికి వెళ్లిన క్రమంలో అక్కడ అతడు విచిత్ర పరిస్థితుల్లో చిక్కుకోవలసి వస్తుంది. ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి తాను అసలు ఏ అమ్మాయినీ ప్రేమించలేదని, తానో ‘గే’నని చెబుతాడు. ఆ అబద్ధం వల్ల అతడి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి? చివరికి అతడి ప్రేమకథ ఎక్కడికి చేరుకుంది? ఆ సమస్య నుంచి అతడు ఎలా బయటపడ్డాడు? అన్నదే కథ.
‘గే’ అనే ముద్రపడిన ఓ కుర్రాడి కథ ఇది. తనని ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తుంటారు. ఆ ప్రేమకథల్లోంచి తనకు ఎలాంటి సమస్య వచ్చింది? ఎలా బయటపడ్డాడు అనేది కథ. కథానాయకుడు అసలు గేనా? కాదా? అనేది ఆసక్తికరం. గతంలో ఎప్పుడూ ఇలాంటి కథలు టాలీవుడ్‌లో వెలుగుచూడలేదు. హీరో ‘గే’ క్యారెక్టర్‌ని పోషించడం మెచ్చుకోతగ్గదే. చిత్రం ప్రథమార్ధం అంతా హీరో క్యారెక్టర్, శివాజీరాజా నుంచి పండే కామెడీ, సత్యం రాజేష్ ఎపిసోడ్, హీరో హీరోయిన్ల ప్రేమకథపైనే సాగుతుంది. ద్వితీయార్థం అంతా ‘గే’ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. ఈ దశలో అజయ్ పాత్ర ప్రవేశించడమే కథకు మలుపు. గే ఎపిసోడ్ బాగా పేలింది. ఈ క్యారెక్టర్‌లో నాగశౌర్య ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల్ని తన నటనతో నవ్వుల్లో ముంచెత్తాడు. దర్శకుడు గే పాత్రల మధ్యసాగే సన్నివేశాలను నవ్వించేలా చేశాడు. కథలో, సన్నివేశాల్లో పెద్దగా మలుపులేమీ ఉండవు. సినిమా అంతా ప్రేక్షకుడి ఆలోచనకు అనుగుణంగానే సాగుతుంటుంది. అయితే..కథా పరంగా మరింత కామెడీ పండించే అవకాశం ఉన్నా, దర్శకుడు సాదాసీదాగానే కానిచ్చేశాడు. హీరో నాగశౌర్య రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆకట్టుకున్నాడు. ఇలాంటి పాత్రను ఒప్పుకోవడంతోనే మంచి మార్కులు కొట్టేశాడు. గే సన్నివేశాల్లో అతడి ప్రతిభ కనిపిస్తుంది. గేగా సిగ్గుపడే సన్నివేశాలైతే నవ్వుల్లో ముంచెత్తాయి. తన గత చిత్రాల్లో కంటే అతడు కొత్తలుక్‌తో కనిపించాడు. గే పాత్రకి ఎదురయ్యే ఇబ్బందికర సంఘటనల ద్వారా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక ఇద్దరు హీరోయిన్లు ఉన్నా, వారి పాత్రలు అంతంత మాత్రమే. కేవలం పాటలకే పరిమితమయ్యారు. ‘కీచక’ చిత్రంతో తెరకు పరిచయమైన యామిని భాస్కర్ విజయవాడకు చెందిన అచ్చ తెలుగు అమ్మాయి. సత్యభామ అనే గడుసైన అమ్మాయిగా నటించి ఉన్నంతలో మెప్పించింది. మరో హీరోయిన్ కశ్మీర పరదేశీ మానసగా కవ్వించింది. గ్లామర్‌తోనూ ఆకట్టుకుంది. అజయ్ తన నటనతో అలరించాడు. ద్వితీయార్థంలో కామెడీ వర్కవుట్
అయిందంటే దానికి అజయ్ క్యారెక్టరే కారణం. చాలా కాలం తర్వాత అతడికి ఫుల్‌లెంగ్త్ పాత్ర దక్కింది. రఫ్‌లుక్‌లో కనిపిస్తూనే కామెడీతో ఆకట్టుకున్నాడు. హీరో తండ్రిగా శివాజీరాజా, తల్లిగా ప్రియ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇలాంటి పాత్రలు వారికి కొట్టినపిండే. శివాజీరాజా తన కెరీర్‌లోనే మరో గుర్తుపెట్టుకునే పాత్ర ఇది. జయప్రకాష్‌రెడ్డి, సుధ రోటీన్ పాత్రల్లోనే కనిపించారు. కాస్సేపు కనిపించినా..సత్యం రాజేష్ నవ్విస్తాడు. సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతున్న తరుణంలో మధ్య మధ్యలో వచ్చే ‘జబర్ధస్త్’ ఫేం రాకెట్ రాఘవ తాగుబోతు క్యారెక్టర్ పండించిన కామెడీకి థియేటర్లో నవ్వులు పేలాయి. సాంకేతికత విషయానికొస్తే.. మహతి స్వరసాగర్ అందించిన సంగీతంలో పాటలు వినసొంపుగా వున్నా యి. విజువల్‌గానూ ఆకట్టుకున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే. ఎడిటింగ్‌పై కోటగిరి ఇంకాస్త దృష్టిసారించాల్సింది. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ, ఐరా సంస్థ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టే ఉన్నాయి. మొత్తం మీద ఈ బనర్తనశాల ఫర్వాలేదనిపించి ప్రేక్షకుల్ని నవ్వులశాలకి తీసుకెళుతుంది.

-ఎం.డి. అబ్దుల్