Others

అందరూ సిల్లీ ఫెలోస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్, సునీల్, చిత్ర శుక్ల ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాస్‌రావు దర్శకత్వంలో బ్లూప్లానెట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సిల్లీ ఫెలోస్ ఈనెల 7న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు భీమనేని శ్రీనివాస్‌రావు చెప్పిన విశేషాలు...
సుడిగాడు సినిమా తరువాత అల్లరి నరేష్, నా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ స్థాయి అందుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఇది పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్. హీరో అల్లరి నరేష్ టైలర్‌గా కనిపిస్తాడు. ఆయన ఓనర్ జయప్రకాశ్‌రెడ్డి... ఆయన కూడా లెడీస్ టైలర్ అలాంటి స్థాయినుండి ఎంఎల్‌ఏగా ఎదిగిన వ్యక్తి. తన బాస్ మినిస్టర్ అయితే ఆయన ప్లేస్ ఎంఎల్‌గా తాను ఎదగాలని ఆరాటపడే యువకుడిగా అల్లరి నరేష్ కామెడీతో ఆకట్టుకుంటాడు. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఈ సినిమాతో మళ్ళీ కమెడియన్‌గా ఈ సినిమాతో సత్తా చాటుతాడు. ఇందులో సునీల్ హీరోకి ఫ్రెండ్‌గా కనిపిస్తాడు.. తాను బేవార్స్. వీరిద్దరూ కలిసి ఓ ఇస్స్యూలో ఇరుక్కుంటారు.. ఆ తరువాత ఎలా బయటపడ్డారు అన్న విషయం పూర్తి కామెడీగా సాగుతుంది. ఈ సినిమాలో నరేష్, సునీల్ ఇద్దరు మాత్రమే సిల్లీఫెలోస్ కారు... ఇందులో ఉన్న 15 మంది ప్రముఖ ఆర్టిస్టులు అందరు సిల్లీఫెల్లోస్‌గా కామెడీ అందిస్తారు. నిజానికి ఈ సినిమాకు సుడిగాడు 2 అని పెట్టాలని అనుకున్నాం కానీ ఆ కథకు ఈ కథకు పోలిక ఉండదు. ఇందులో ఒక్క స్పూఫ్ కూడా ఉండదు. టైటిల్ పెట్టి ప్రేక్షకులను మోసం చేయడం ఇష్టంలేక చాలా టైటిల్స్ అనుకుని ఫైనల్‌గా ఈ టైటిల్ పెట్టాం. ఇందులో హీరోయిన్ చిత్ర శుక్ల గడుసు అమ్మాయిగా కనిపిస్తుంది. తాను పోలీస్ అధికారి అవ్వాలని ఆశపడే అమ్మాయి. అనుకోకుండా హీరోకి పరిచయం అవ్వడమే ఆ తరువాత వీరి ప్రేమకథ నడుస్తుంది. ఈ ఇందులో కేవలం రెండు పాటలు మాత్రమే ఉంటాయి.. ఎందుకంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కు డిస్టర్బ్ ఎందుకని రెండు పాటలు మాత్రమే పెట్టడం జరిగింది. ఇక తాజాగా మహేష్ విడుదల చేసిన టీజర్‌ను అనుహ్యమైన స్పందన వచ్చింది. కేవలం వారంలో 3 మిలియన్స్ లైట్స్ రావడంతో ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రాన్ని బ్లూప్లానెట్ బ్యానర్‌లో నిర్మించడం ఆనందంగా ఉంది. ఇప్పటికే మంచి సినిమాలు నిర్మించి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యానర్‌లో సిల్లీ ఫెలోస్ హ్యాట్రిక్ హిట్ అవుతుంది. ఈ సినిమా తరువాత తదుపరి సినిమా ఉంటుంది. దాని గురించి తరువాత చెబుతా. నిజంగా ఈ సినిమా నాకు అల్లరి నరేష్‌కి అటు సునీల్‌కు కీలక సినిమా అని చెప్పాలి అంటూ ముగించారు.

-శ్రీనివాస్ ఆర్.రావ్