Others

విలన్‌గా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విలన్‌గా?
కెరీర్ ప్రారంభంలో విలన్‌గా ఎంతో గుర్తింపుతెచ్చుకున్న సీనియర్ నటుడు మోహన్‌బాబు ఆ తరువాత హీరోగా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. తన సినీ కెరీర్ మొత్తంలో ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించగల విలక్షణ నటుడు మోహన్‌బాబు. ఆ తరువాత పలు చిత్రాల్లోని వెరైటీ పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేశారు. ఇక చాలాకాలం తరువాత ఆయన రౌడీ సినిమాలో కొంత విలనిజాన్ని చూపించి ఓ వర్గం ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నారు. అయితే ఈసారి పూర్తిగా ఓ వైవిధ్యమైన విలన్ పాత్రలో నటించడానికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. సుధా కొంగర దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్‌స్టార్ సూర్య ఒక సినిమా చేయనున్నాడు. అయితే ఆ సినిమాలో విలన్ పాత్రకి మోహన్‌బాబు అయితే బాగుంటారని, ఈ విషయమై ఆయనను సంప్రదించింది చిత్ర బృందం, కథ విన్న మోహన్‌బాబు బాగుంది. నేను చేస్తాను అంటూ గ్రీన్‌సిగ్నల్ కూడా ఇచ్చారట. నిజానికి మోహన్‌బాబు గాయత్రీ సినిమా తరువాత సినిమాలను చాలావరకు తగ్గించి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు. కానీ మహానటి సినిమాలో ఎస్వీఆర్ పాత్ర కారణంగా మళ్ళీ నటించాలని నిర్ణయించుకున్న ఆయన ఈ సినిమా కథ నచ్చడం, దాంతోపాటుగా సూర్య తండ్రి శివకుమార్‌తో వున్న మంచి అనుబంధం కారణంగా ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నట్లు పరిశ్రమ వర్గాల టాక్. ఇక తమిళ్‌తోపాటు తెలుగులో కూడా ఈ సినిమా ఒకేసారి తెరకెక్కుతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి త్వరలో ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు సమాచారం.

--శ్రీనివాస్ ఆర్.రావ్