అంతర్జాతీయం

లంక తమిళ ప్రాంతాల్లో స్వయం ప్రతిపత్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, సెప్టెంబర్ 1: శ్రీలంకలో తమిళులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాజకీయ స్వయం ప్రతిపత్తి దిశగా చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. లంకలో స్థిరపడిన తమిళులకు రక్షణ లేదని, హత్యలు, మానభంగాలు నిత్యకృత్యమయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలోనే ఎల్‌టీటీఈ పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. తమిళులకు ప్రత్యేక దేశం అవసరమన్న డిమాండ్‌తో ప్రభాకరన్ ఎల్‌టీటీఈని ఒక పోరాట సంస్థగా మార్చేశాడు. ఫలితంగా శ్రీలంకలో అంతర్యుద్ధం ఒకానొక దశలో తారస్థాయికి చేరింది. ఎదురుకాల్పుల్లో ప్రభాకరన్ మృతి చెందడంతో ఎల్‌టీటీఈ కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ, తమిళుల నిరసలు, అసంతృప్తి జ్వాలలు కొనసాగుతునే ఉన్నాయి. ఫెడరల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానిక తమిళ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. రావణ కాష్టంలా మారిన ఈ సమస్యకు శాశ్వతంగా తెరదించేందుకు ప్రయత్నిస్తున్న శ్రీలంక సర్కారు ఫెడరల్ వ్యవస్థకు బదులు, స్వయం ప్రతిపత్తి ఉన్న స్థానిక సంస్థల ఏర్పాటుకు సుముఖంగా ఉంది. విస్తృతమైన అధికారాలతో కూడిన స్థానిక సంస్థలు ఉంటే, ఫెడదర్ రాజ్య డిమాండ్‌ను అంతా మరచిపోతారని, శాంతి నెలకొంటుందని లంక సర్కారు భావిస్తున్నది. ఇలావుంటే, స్థానిక సంస్థల స్వయం ప్రతిపత్తి ఆలోచనను తమిళుల ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ఫెడరల్ విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాకపోతే, స్వయం ప్రతిపత్తి కొంత వరకూ మెరుగైన ప్రత్యామ్నాయంగా వారు భావిస్తున్నారు. ఇటీవలే కొత్తగా రాజ్యాంగ రూపకల్పనలో భాగస్వామిగా ఉన్న సుమంతిరన్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. గాలేలో జరిగిన ఒక భారీ సభలో ఆయన మాట్లాడుతూ, ఎక్కువ అధికారులతో కూడిన స్వతంత్ర ప్రతిపత్తిగల స్థానిక సంస్థల ఏర్పాటు జరిగితే, ఫెడరల్ వ్యవస్థ డిమాండ్‌ను వదులుకుంటామని స్పష్టం చేశారు. సమాన హక్కుల కోసమే తమిళులు ఇంతకాలంగా పోరాటం సాగిస్తున్నారని, దానిని సాధించుకునే దిశగా జరిగే ప్రయత్నాలకు మద్దతునిస్తామని చెప్పారు.