అంతర్జాతీయం

మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సంజయ్ దత్ ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, సెప్టెంబర్ 1: మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాన్ని చేపట్టేందుకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ముందుకు వచ్చారు. ఈ వివరాలను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ చెప్పారు. ఆరు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఇటీవల సీఎం రావత్ ముంబాయికి వెళ్లినప్పుడు సంజయ్‌దత్‌ను కలిశారు. ఈ సందర్భంగా తాను చేసిన ప్రతిపాదనకు అంగీకరించి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు సమ్మతి తెలిపారు అని రావత్ చెప్పారు. మాదకద్రవ్యాలకు బానిసలై చాలా మంది జీవితాలు దెబ్బతింటున్నాయన్నారు. వీరి జీవితంలో పరివర్తన తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్తాన్, చండీఘడ్ కేంద్రపాలిత ప్రాంతంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిందన్నారు. ఈ విషయమై గత నెలలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించినట్లు ఆయన చెప్పారు. ఇకపై ప్రతి ఆరు నెలలకోసారి ఆరు రాష్ట్రాల సీఎంలు సమావేశమై మాదకద్రవ్యాలని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షిస్తామన్నారు.