షూటింగ్‌లో వీర రాఘవ బిజీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు నుండి తాను నటిస్తున్న అరవింద సమేత షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఇటీవలే ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ మృతితో వారి కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయింది. తండ్రి అంటే ఎంతగానో ఇష్టపడే ఎన్టీఆర్ ఈ విషాదంనుండి ఎప్పుడు తేరుకుంటాడో తెలియదు కానీ నిర్మాత నష్టపోకుండా ఉండేందుకు ఆయన తిరిగి ఈరోజునుండి షూటింగ్‌లో పాల్గొననున్నాడు. క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ ఆకస్మిక మృతితో షూటింగ్‌ని నిలిపివేశారు. అన్న ఎన్టీఆర్, హరికృష్ణలకు పనిపట్ల ఎంత గౌరవం ఉండేది. వాళ్ల డెడికేషన్ గురించి ఇప్పటికి చాలామంది మాట్లాడుకుంటారు.. ఇప్పుడు వారి వారసత్వ పరంపర తనయుడు ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లకు వచ్చేసింది. అటు కళ్యాణ్‌రామ్ కూడా గుహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో ఈరోజునుండి పాల్గొననున్నాడట.