‘అదుగో’ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవిబాబు నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం అదుగో. ఈ సినిమాలో పంది పిల్ల కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పుడు ఈ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఇందులో పిగ్ లెట్ బంటిని పరిచయం చేసారు. దర్శక నిర్మాతలు. చెక్క కంచెకు వేలాడుతూ నవ్వుతూ ఉన్న పంది పిల్ల చాలా క్యూట్‌గా అందర్నీ అలరిస్తోంది. రవిబాబుతోపాటు ఈ చిత్రంలో అభిషేక్ వర్మ, నభా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్‌ను చూపిస్తోన్న సినిమా ఇది. ఇందులో పంది పిల్లను చాలా రియల్‌గా చూపించే ప్రయత్నం చేసారు గ్రాఫిక్స్ టీం. దీనికోసం చాలా విజువల్ ఎఫెక్ట్స్ కూడా వాడుకున్నారు రవిబాబు. షూటింగ్‌తోపాటు అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని దసరా సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం. అందరకీ కనెక్ట్‌అయ్యే యూనిక్ కానె్సప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రవిబాబు. సురేష్ ప్రొడక్షన్ సంస్థలో ప్రముఖ నిర్మాత డి. సురేష్‌బాబు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తుండగా.. ఎన్.సుధాకర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏ ఫ్లయింగ్ ఫ్రాగ్ బ్యానర్‌లో రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అదుగో అన్ని భారతీయ భాషల్లో విడుదలవుతుండటం విశేషం. కుటుంబ ప్రేక్షకులను.. ముఖ్యంగా పిల్లలను బాగా ఆకట్టుకునే కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. అందుకే ఈ చిత్రాన్ని వీలైనన్ని భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు నిర్మాతలు. తెలుగులో అదుగో అనే టైటిల్‌తోనే రాస్తున్న ఈ చిత్రం మిగిలిన భాషల్లో మాత్రం బంటి పేరుతో విడుదల కానుంది. అభిషేక్ వర్మ, నభా, రవిబాబు, ఉదయ్‌భాస్కర్, ఆర్కే, వీరేందర్ చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: సురేష్ ప్రొడక్షన్స్, సంగీతం: ప్రశాంత్ ఆర్ విహార్, డిఓపి: ఎన్.సుధాకర్‌రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్: నారాయణరెడ్డి, ఎడిటర్: బల్ల సత్యనారాయణ, యాక్షన్: కనల్ కణ్ణన్, విజయ్, సతీష్, పాటలు: భాస్కరబట్ల, మాటలు: రవిబాబు, నివాస్, నిర్మాత: రవిబాబు, కథ, దర్శకత్వం: రవిబాబు,