ఆంధ్ర గాథాలహరి

కాఠిన్యమెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
జివిఅం అసాసఅం విఅణణిఅత్తఇ జొవ్వణం అతిక్కంతం
దిఅహా దిఅహేహిం సమాణహూంతి కి ణిఠ్ఠురో లో ఓ (హాలుడు)
సంస్కృత చ్ఛాయ
జీవితమశాశ్వత మేవ నివర్తితే వన వతిక్రాంతమ్
దివసా దివసైః సమాన భవంతికి నిష్ఠురో లోకః
తెలుగు
తే.గీ కరగిపోయిన పరువమ్ము మరలిరాదు
కాలమంతయు నొకరీతి గడువబోదు
ప్రాణములు శశ్వతంబుగ, పరగబోవు
ఇంత కఠినత్వము, జనుల కెందుకొరకు?
భావం:
ఏదో మాట పట్టింపువల్ల ఎడముఖం, పెడముఖంగాన్న భార్యాభర్తలకు దూతిక హితబోధ చేస్తూ-
‘‘వనం తిరిగిరాద. రోజులన్నీ ఒకరకంగా ఉండవు. ప్రాణా లు శాశ్వతం కావు. ఎందుకు? ఇంత టి కఠినత్వం’’ అంటూ ఉన్నన్నాళ్ళూ హాయిగా, సుఖంగా ఉండమని చెపుతోంది.
వివరణ:
జీవితం చాలా చిన్నది. ఆ చిన్న జీవితంలోనే పంతాలు, పట్టింపులు, పగలు, ప్రతీకారాలు. కొంతమంది పంతాలతోనే జీవితమంతా గడిపేసిన వాళ్ళూ ఉన్నారు. తను పిలుస్తాడని ఆమె, ఆమే వస్తుందని అతడు వృద్ధులయ్యేదాకా ఎదురుచూచిన జంటలు కోకొల్లలు. తీరా వృద్ధాప్యం సమీపించాక వగచి ప్రయోజనమేముంది? కఠినత్వం భార్యాభర్తల విషయంలో అసలు పనికిరాదు. ఎవరో ఒకరు ముందు ఒక మెట్టు దిగితే అవతలివారు రెండు మెట్లు దిగుతారు. జీవితం ఆనందమయవౌతుంది. లేకుంటే అంధకారబంధురవౌతుంది.

- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949