మెయిన్ ఫీచర్

కమనీయం కృష్ణతత్త్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ॥ గత జన్మంబులనేమి నోచితిమొ? యాగ శ్రేణులేమియి- చే
సితిమో? ఎవ్వరికేమి పెట్టితిమొ? ఏ చింతారతింబ్రూద్దుబు
చ్చితిమో? సత్యములేమి పల్కితిమొ? ఏ సిద్ధ ప్రదేశంబు, ద్రొ
క్కితిమో? యిప్పుడు సూడగంటి, మిచటం- కృష్ణార్భకున్ నిర్భయున్‌
అని పోతన రచించినట్లుగా శ్రావణ బహుళాష్టమినాడు యశోదమ్మకు ముద్దుబిడ్డడైనాడు. ఆ కృష్ణుడే
ధఠ్మసంస్థాపనార్థం అవతారాలు సృజియంచుకుంటారు. శ్రీకృష్ణునిగా 9 అవతారంలో వస్తుం ది. ఆ అవతార కాలం 125 సంవత్సరాలు. దుష్టులను సంహరిం చడం, శిష్టులను కాపాడడమే అవతార రహస్యం అని ఆ హరి స్వయంగా చెప్పాడు. కృష్ణుడు ఎవరికి వారు తమ వాడుగానే భావిస్తారు.కనులు తెరవని పసిపాపగా ఉన్నప్పుడే ఎన్నో వింతలు చూపించిన కృష్ణుని ఆబాలగోపాలమూ తమ వానిగా తలవడంలో వింతేముంది. వారువీరను తేడాల్లేకుండా కృష్ణాష్టమిని ప్రపంచం అంతా జరుపుకుంటారు.
సర్వజీవులలో కృష్ణపరమాత్మ చైతన్య స్వరూపుడు. ధర్మసంస్థాపనాచార్యుడు. మనోజ్ఞ రసజ్ఞమూర్తి. వందే కృష్ణం అంటూ మానవులందరూ కృష్ణసూక్తులను నెమరే సుకుంటూ పరిపూర్ణ భక్తిమార్గంలో పయనించాలి. సర్వమూ కృష్ణమయం అని తలచి నన్ను నమ్మిన వారి యోగక్షేమాలు చూస్తానని చెప్పిన ఆ కృష్ణుని తలుచు కుంటూ అహంకార మమకారాలను వదలాలి. కృష్ణుడు భక్తికీ-ప్రేమకూ వశుడౌతాడు.
యశోదమ్మ ముద్దుబిడ్డగా పెరుగుతూ ఎందరో రాక్షసు లను అంతం చేశాడు. తనయుడు అమాయ కుడుగా పెరుగుతు న్నట్టుగా తల్లి ప్రేమపాశానికి లొంగి పోయాడు. యశోదమ్మ చేత రోట కట్ట బడ్డాడు. ఉలూఖ బంధనం పేరిట నల కుబేరాదులకు శాప విమోచనం చేయం చాడు. మన్ను తిన్నావంటూ తనను గద్దించే అమ్మకు తన నోటిలో విశ్వరూపాన్ని చూపించి తన మాయలో బంధించి తిరిగి అమ్మా అమ్మా నేను నిజమే చెబుతున్నామ్మా అంటూ ఎంతో అమాయకంగా చెప్పాడు.

వారువీరను తేడాల్లేకుండా అందరినీ సమ్మోహితులను చేసే కృష్ణయ్య యుక్తవయసులో రుక్మిణికోసం అందరినీ ఎదిరించాడు. ఇష్టసఖి సత్యభామ తులాభారం వేస్తే రుక్మిణి భక్తి సరితూగాడు. పాండవ పక్షపాతిగా పాండవులకు అన్నీ తానే అయి ద్రౌపదీ మాన సంరక్షణ చేశాడు. ధర్మరక్షణకోసం కౌరవులవద్దకు పాండవ దూతగా రాయబారం చేశాడు. కురుక్షేత్ర సంగ్రామంలో విజయుని రథసారధిగా ఉండి విజయం చేకూర్చినాడు. అర్జునునికి గీతోపదేశంగావించి, గీతాచార్యుడై భగవద్గీతను మానవులకందించి, విశ్వవిఖ్యాతిగాంచి జగద్గురువైనాడు. భూదేవి మొర ఆలించి ధరణీ భారమును బాపినాడు.
కృష్ణాష్టమియే గోకులాష్టమి స్వామిని ఊయలలో పరుండబెట్టి పవళింపుసేవ చేస్తారు. భాగవతం-గీతాపఠనం శ్రీకృష్ణ ఆలయాలలో పారాయణ చేస్తారు. బృందావన కృష్ణుని స్మరిస్తూ, రాధాకృష్ణుల రాసలీలలు ప్రదర్శిస్తారు. సాయంత్రం ‘ఉట్టి’కొడతారు. గోమాతలను పూజిస్తారు.
అష్టమిలో పుట్టి ప్రలంబ, అజగాసుర, బకాసుర, వత్సాసుర, చక్రాసుర, చాణూర, ముష్టిక తదితర అష్ట (ఎనిమిదిమంది) మల్లులను (మహాయోధులైన రాక్షసుల)ను చంపి అనేక లీలను అల్లరి చేష్టలను చూపి జీవిత సత్యాలను బోధించాడు.
వైష్ణవ సంప్రదాయాలన్నీ శ్రీకృష్ణుని శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అవతారంగా పరిగణిస్తాయి. స్వామి నారాయణ, గౌడీయ, వల్లభాచర్య, నింబార్క మొదలగు సంప్రదాయాలవారు ‘కృష్ణస్తు స్వయం భగవాన్’ అనే సంభావన చేస్తారు. ఒడిషాలో జగన్నాథునిగా, మహారాష్టల్రో విఠోబాగా, రాజస్థాన్‌లో శ్రీనాథ్‌జీగా ఆరాధిస్తారు. మణిపూర్ ప్రాంతంలో రాధాసమేతుడైన కృష్ణునే్న ఆరాధిస్తారు. నేటి పిల్లలకు అవసరమైన వ్యక్తిత్వ వికాసమైనా, బుద్ధితో ఏ పని చేయాలన్నా రణరంగంలో ఉపదేశించిన గీత మంచి విజ్ఞానదాయనిగా పనికి వస్తుంది. కనుక వందే కృష్ణం అంటూ స్వామిని మనసారా స్మరిద్దాం. ధర్మమే జీవన మార్గమని తలుద్దాం.గీతను చదువుదాం. గీతబోధను ఆచరిద్దాం.

===========================================
వైష్ణవ సంప్రదాయాలన్నీ శ్రీకృష్ణుని శ్రీ మహావిష్ణువు యొక్క
పరిపూర్ణ అవతారంగా పరిగణిస్తాయి. స్వామి నారాయణ, గౌడీయ,
వల్లభాచర్య, నింబార్క మొదలగు సంప్రదాయాలవారు ‘కృష్ణస్తు స్వయం భగవాన్’ అనే సంభావన చేస్తారు. ఒడిషాలో జగన్నాథునిగా, మహారాష్టల్రో విఠోబాగా, రాజస్థాన్‌లో శ్రీనాథ్‌జీగా ఆరాధిస్తారు. మణిపూర్ ప్రాంతంలో రాధాసమేతుడైన కృష్ణునే్న ఆరాధిస్తారు. నేటి పిల్లలకు అవసరమైన వ్యక్తిత్వ వికాసమైనా, బుద్ధితో ఏ పని చేయాలన్నా రణరంగంలో ఉపదేశించిన గీత మంచి విజ్ఞానదాయనిగా పనికి వస్తుంది.
కనుక వందే కృష్ణం అంటూ స్వామిని మనసారా స్మరిద్దాం.
===========================================

-- జంగం శ్రీనివాసులు