Others

మహానుభావులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకు లేరు!
ఇప్పటికీ వున్నారు
మానవత్వం కోసం
మరణాన్ని లెక్కచేయనివాళ్లు
మరణంతో కొత్త ఆవరణకు
తెరతీసే మహాభి భాసితులు
ఎందుకు లేరు!

నిన్నటి ఆర్తిమూర్తులు
గోడలపై ఫ్రేముల్లో ఇముడరు
వారి కీర్తి ఉజ్జ్వలోజ్వలం!
స్ఫూర్తిని కిరణాలుగా గుచ్చుకొని
వారి అడుగుజాడల్లో
చరిత్ర కొత్తదారులు తియ్యక తప్పదు

వర్తమానం
ఒక శూన్యమహాసాగరం కాదు
కల్లోల తుఫానుల్లోంచి
ఊహించని ఉద్వేగ సూర్యులుదయస్తారు

కొండమీది రాయకి
గరిమనాభిని సమకూర్చేవాళ్ళు
ఎండను అరిగించుకొని
కన్నుల్లోంచి వెనె్నలను వెదజల్లేవాళ్ళు
ఎక్కడ దౌష్ట్యం చెలరేగినా
నిటారుగా నిలబడి ఎదిరించేవాళ్ళు
పిల్లలను వారి సందర్భంలోనే ప్రేమించేవాళ్ళు
స్ర్తీల త్యాగాన్ని
తమ స్వార్థంతో కలిపి చూడనివాళ్ళు
పదడు గుంపులను చూసి బెదరక
ఏకాకి గొంతుకల్తో నినదించేవాళ్ళు
నవయుగావిష్కరణ కోసం
చీకటిని చీలుస్తూ
కాంతిరేఖలను పొదిగేవాళ్ళు
ఎందుకు లేరు!

ఊదరగొట్టే వారిని చూసి
నిరాశలో కూరుకపోవద్దు
అవి వొట్టి తాటాకులు
దిష్టిబొమ్మల చేతుల్లో బాకులు
ఎందుకు లేరు!
మనలోనే వున్నారు
కుతకుతలాడే జాగృత్స్వభావులు
ఉష్ణోదగ్ర జ్వాలామూర్తులు
ఎందుకు లేరు
అది మనమే కావచ్చు.

--డా.ఎన్.గోపి