బిజినెస్

పెరిగిన మార్కెట్ విలువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలోని అత్యంత విలువయిన పది కంపెనీలలోని ఏడు కంపెనీల మొత్తం మార్కెట్ విలువ శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో రూ. 76,227 కోట్లు పెరిగింది. ఈ ఏడింటిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మిగతా వాటికన్నా ఎక్కువగా పెరిగింది. అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్), హెచ్‌యూఎల్, మారుతి సుజుకి ఇండియా కంపెనీల మార్కెట్ విలువ (ఎంక్యాప్) ఈ వారంలో పడిపోయింది. ఈ వారంలో తమ షేర్ల ధరలు పెరగడం వల్ల మార్కెట్ విలువను పెంచుకున్న మిగతా ఏడు కంపెనీలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, కోటక్ మహీంద్ర బ్యాంక్ ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ ఈ వారంలో రూ. 20,685.2 కోట్లు పెరిగి, రూ. 5,59,888.20 కోట్లకు చేరుకుంది. టీసీఎస్ ఎంక్యాప్ రూ. 13,783.49 కోట్లు పెరిగి, రూ. 7,95,654.49 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 13,125.57 కోట్లు పెరిగి, రూ. 3,14,523.57 కోట్లకు చేరుకుంది. ఐటీసీ మార్కెట్ విలువ రూ. 11,506.29 పెరిగి, రూ. 3,90,363.29 కోట్లకు చేరుకుంది. ఎస్‌బీఐ ఎంక్యాప్ రూ. 7,630.89 కోట్లు పెరిగి, రూ. 2,75,635.89 కోట్లకు చేరింది. కోటక్ మహీంద్ర బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 5,881.34 కోట్లు పెరిగి, రూ. 2,45,062.34 కోట్లకు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ ఎంక్యాప్ రూ. 3,614.2 కోట్లు పెరిగి, రూ. 3,26,652.20 కోట్లకు చేరుకుంది.
మరోవైపు రిల్ మార్కెట్ విలువ రూ. 23,352.34 కోట్లు పడిపోయి, రూ. 7,86,470.66 కోట్లకు దిగజారింది. మారుతి సుజుకి ఇండియా ఎంక్యాప్ రూ. 1,998.22 కోట్లు పడిపోయి, రూ. 2,74,809.78 కోట్లకు చేరుకుంది. హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) మార్కెట్ విలువ రూ. 1,458.57 కోట్లు తగ్గి, రూ. 3,84,224.43 కోట్లకు చేరింది. అత్యంత విలువయిన ఈ పది కంపెనీలలో టీసీఎస్ అగ్ర స్థానంలో నిలిచింది. తరువాత స్థానాల్లో వరుసగా రిల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), మారుతి, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉన్నాయి.