క్రీడాభూమి

అశ్విన్ బౌలింగ్ ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంఫ్టన్, సెప్టెంబర్ 2: ఇంగ్లాండ్‌తో నాల్గవ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పూర్ పెర్ఫార్మెన్స్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఛెతేశ్వర్ పూజారా దన్నుగా నిలబడ్డాడు. జాస్‌బట్లర్ అర్థ శతకంతో ఇంగ్లాండ్ 233 ఆధిక్యానికి చేరడం తెలిసిందే. మరోపక్క మొయిన్ అలీ ఐదు వికెట్లు తీసి భారత్‌ను పూర్తిగా నిలువరించాడు. ఈ పరిస్థితుల్లో అశ్విన్ 35 ఓవర్లలో వికెట్ తీసుకుని 75 పరుగులిచ్చాడు. దీనిపై వస్తున్న విమర్శలను పూజారా ఖండించాడు. ‘అశ్విన్ ఎక్కువ వికెట్లు తీయనంత మాత్రాన బాగా ఆడలేదని ఎలా అంటాం. అతను సరైన ఒరవడిలోనే బంతులు విసిరాడు. ఎక్కువ వికెట్లు తీసే సందర్భాలు బౌలర్లకు అన్నిసార్లూ దక్కవు’ అని అశ్విన్‌ను పూజారా సమర్థించాడు. ‘పిచ్ కూడా ఒక్కసారిగా స్లో అయ్యింది. కొన్ని బంతులు బౌలర్లు ఆశించినంత వేగంతో వెళ్లలేదు’ అన్నాడు.

గెలుపు మాదే: బట్లర్
సౌతాంఫ్టన్, సెప్టెంబర్ 2: ‘డ్రైవింగ్ సీట్లో మేమున్నాం. నాలుగో టెస్ట్‌లో విజయంతో సిరీస్‌ను సాధిస్తాం’ అని జాస్ బట్లర్ వ్యాఖ్యానించాడు. ఇబ్బందుల్లో పడిన ఇంగ్లాండ్ మలి ఇన్నింగ్స్‌ను అర్థ శతకంతో ఆదుకున్న బట్లర్, ఫోర్త్ టెస్ట్‌పై ధీమా వ్యక్తం చేశాడు. ఐదు వికెట్ల నష్టంతో 122 పరుగుల వద్ద చతికిలపడిన ఇంగ్లాండ్‌ను, 8 వికెట్ల నష్టానికి 260 పరుగులకు చేర్చడంలో బట్లర్ పెద్ద పాత్ర పోషించటం తెలిసిందే.