డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన పురాణాలలో సూర్యకిరణాలను వర్ణించిన తీరు రుూ సిద్ధాంతానికి సంపూర్ణంగా సరిపోతోంది. సూర్యుడికి ఏడు గుఱ్ఱాలు ఉన్నాయని, వాటిని పాముల పగ్గాలతో పట్టుకొంటున్నాడని పురాణాలు చెపుతూ వున్నాయి. ఈ పాముల గమనం అలల గమనం లాగా వుంటుంది. అలాగే అవి తోక దగ్గర సన్నగా వుండి తల దగ్గరకొచ్చే సరికి లావుగా వుంటాయి. కాంతికిరణాలు కూడా తరంగ ప్రవాహంగా పయనిస్తాయనీ, అవి మొదట్లో సన్నగా వుండి రానురాను వెడల్పు అవుతాయనీ వ్యాఖ్యాకారులు వ్రాశారు. అందుకే కాంతి కిరణానికి పృథుముఖమని పేరు. అంటే రానురాను వెడల్పవుతున్నదని అర్థం.
పాముల తలలకు మణులుంటాయని పురాణాలు చెపుతాయి. పగ్గాల పాముల మణులే మనం ఇప్పుడు ఫోటాన్స్‌గా భావిస్తున్న కాంతి అణుఖండాలు. కాంతి యొక్క వేగం అత్యధికమైనదని, దానిని మించిన వేగమే లేదని చెప్పడమే కాక ఏడు గుఱ్ఱాలు ఇంద్ర ధనుస్సులో ఏడు రంగులుగా వర్ణించబడ్డాయి. అందువల్ల ఆనాటి ఋషులకు కాంతి కిరణాల పరావర్తన విధానం పూర్తిగా తెలుసుననీ మనం ఊహించవచ్చు.
ఈ విధంగా మన పురాణాల వర్ణనకు దగ్గరగా వచ్చిన ఫోటాన్ రిసిద్ధాంతం ద్వైత భావనకు పెద్ద ముప్పును తెచ్చింది. ఇంతకూ మనం హైసన్‌బర్గ్ యొక్క అనిశ్చిత వాదాన్ని గురించి మాట్లాడుకొంటున్నాం. మళ్ళీ ఆ విషయానికి వద్దాము.
ఒక చిన్న అణుఖండం వుందనుకోండి. దాన్ని మీరు గమనిస్తున్నారు. గమనించడం అంటే ఏమిటి? దానిలో వున్న కాంతి కిరణం మిమ్మల్ని తాకుతోంది. అంటే, ఆ అణుఖండంలో వున్న ఏదో ఒక ఫోటాన్‌ను మీరు సంక్షోభ పరిస్తేనే తప్ప ఆ అణుఖండాన్ని మీరు గమనించడం సాధ్యంకాదు. ఎప్పుడైతే అణుఖండంలోని ఫోటాన్‌ను మీరు సంక్షోభ పరుస్తున్నారో, అప్పుడు మీరు అవశ్యంగా ఆ అణుఖండాన్ని కూడా సంక్షోభ పరుస్తూ వున్నారన్నమాట. కాబట్టి ఏదైనా ఒక అణువును తీసుకొని, దానిలోని ఎలక్ట్రానో మరో అణుఖండమో దానియొక్క ఆవర్తన పరిధిలో ఫలానా సమయానికి ఫలానాచోట వున్నది అని నిశ్చయంగా చెప్పాలనుకొని, దాని వంక మీరు గమనించేసరికి, దానియొక్క స్థితి సంక్షోభం చెందుతూ వున్నది. కనుక ఆ స్థితిని నిశ్చయాత్మకంగా చెప్పటం ఎప్పటికీ సాధ్యంకాదు. దానిని గమినించకపోతే మీరు నిర్ణయించలేరు. గమనిస్తే అసలే నిర్ణయించలేరు. ఇది అణుఖండాల ప్రకృతిలో ఒక విచిత్ర సన్నివేశం. ఆ విధంగా సాధ్యంకాదు గనుక రుూ సత్యానికి ‘అనిశ్చితవాదం’ అని పేరు పెట్టాడు హైసన్‌బర్గ్.
ఈ సిద్ధాంతం విజ్ఞానవాదుల హృదయాలలో ‘‘మేము ప్రతి దానిని నిర్వచించి, నిశ్చయంగా చెప్పగలము’’ అన్న విశ్వాసాన్ని కూకటి వేళ్ళతో పెకలించి వేయసాగింది.
మాయావాదం:
అద్వైత వేదాంత సిద్ధాంతంలో రుూ ప్రపంచ యొక్క సత్యాసత్యస్థితి ఇతమిత్థమని నిర్వచించేందుకు వీలు లేదు. ఈ ప్రపంచం మనకు కనిపిస్తోంది. కనిపిస్తోంది కనుక సత్యమే అనాలి. కాని కనిపిస్తోంది కనుక దాన్ని సత్యమంటే కలలో కనిపిస్తున్నదంతా కూడా సత్యమే అనాలి. కానీ చదివినవారు, చదవనివారు అందరూ కూడా కలలు కల్లలని నిర్ధారణగా చెప్పుతున్నారు. కనుక కంటికి కనిపించే రుూ సృష్టిని సత్యమనాలా, అసత్యమనాలా? ఏదీ నిర్వచించలేము.
ఇది ఇలా వుండగా ‘‘సప్తశతి’’ అనే ఒకానొక పురాణంలో ఆదిశక్తి ద్వారానే రుూ సృష్టి వచ్చిందని చెపుతూ ఒక వింత కథ చెప్పారు.
ఒకప్పుడు దేవతలు పరాజితులై ఆదిశక్తిని ప్రార్థించారు. ఆ తల్లి తనలోనుంచి అనేక శక్తులను ఉద్భవింపచేసి, రాక్షసులపై యుద్ధానికి వెళ్ళింది. ఆ రాక్షస నాయకుడు, ‘‘నీకింత పరివారం వుంది కనుక గర్వంగా విజృంభిస్తున్నావు’’ అన్నాడు. దానికి ఆదిశక్తి నవ్వి ‘‘వీరందరు నా శక్తులే’’ అని పలికి వారందరిని తనలో లయం చేసుకొని ఒకత్తెగా నిలబడ్డది.
ఇది కథగా వుంది కనుక మనకు త్వరగా వైజ్ఞానికంగా అన్వయం కాదు. కాని యిక్కడ ఆ పురాణకర్త శక్తియొక్క ఆదిస్వరూపం ఒకటేనని, అది విభిన్నాలుగా కనిపించనా, యిన్ని భేదాలేమిటి? అని పరిశీలించి చూస్తే ఒకటే అయిపోతుందని, శక్తితత్త్వాన్ని గురించి వివరిస్తున్నాడు.
శక్తి అంటే ఏమిటి? అని చర్చ వచ్చినప్పుడు ఇది ‘‘అనిర్వచనీయము’’ అని పురాణాలు చెపుతున్నాయి. పురాణాలు చదివినప్పుడు అనిర్వచనీయమనే పదాన్ని మనం సరిగా అర్థం చేసుకోవటం లేదు. హైసన్‌బర్గ్ నిర్వచించిన అనిశ్చితవాదం నేపథ్యంలో పురాణాల్లోని అనిర్వచనీయ పదాన్ని మనం అర్థం చేసుకుంటే మరింత సమజంసంగా వుంటుంది.
నిజానికి ఆర్థర్ ఎడింగ్టన్ అనే సుప్రసిద్ధ వైజ్ఞానికుడు ‘‘హైసన్‌బర్గ్ యొక్క అనిశ్చితవాద ఆవిష్కరణతో విజ్ఞానశాస్త్రం తన పరిధులను దాటి వేదాంత మత శాస్త్రాల పరిధిలోకి ప్రవేశించింది’’ అన్నాడు.
విజ్ఞానశాస్త్రం మొదట్లో పదార్థము, శక్తి వేరువేరు అనుకొన్నది. ఆ రెండు తనకు తెలుసుననుకొన్నది. ఐన్‌స్టీన్ రాకతో ఆ రెండూ వేరుకాదని నిరూపణ అయింది. హైసన్‌బర్గ్ రాకతో ఆ రెండూ వేరుకాదు గాని అవి ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం అనే్వషణ ప్రారంభమైంది.
ఉదాహరణకు ఒక రాతిముక్కను తీసుకోండి. ఇది ఏమిటి? అని ప్రశ్న సిలికాన్ అణువుల సమూహము అని సమాధానము. ఇంకావుంది...

‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.

ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004.
ఆం.ప్ర. 0866 - 2436643

- కుప్పా వేంకట కృష్ణమూర్తి